పెళ్లి విషయంలో నయనతార యూటర్న్: దానికి ప్రియుడి కుటుంబం నిరాకరణ.. అందుకే షాకింగ్ నిర్ణయం!

దాదాపు పదేళ్లుగా దక్షిణాదిలోని అన్ని భాషల్లో తన హవాను చూపిస్తూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది టాలెంటెడ్ హీరోయిన్ నయనతార. ఏక కాలంలో వరుసగా సినిమాలు చేస్తూ లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంటోంది. అందరు స్టార్ హీరోల సినిమాల్లోనూ ఫస్ట్ చాయిస్ అవుతోన్న ఈ బ్యూటీ.. లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్టుల్లోనూ సత్తా చాటుతోంది. కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ అయిన ఈ భామ.. పర్సనల్ లైఫ్ విషయంలో మాత్రం ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో తన పెళ్లి విషయంలో నయనతార యూటర్న్ తీసుకుందని తెలిసింది. ఆ వివరాలు మీకోసం!

కుర్ర హీరోయిన్ అందాల ఆరబోత... కురచ దుస్తుల్లో హంగామా

అన్ని చోట్లా హవా.. క్యూ కడుతున్నారు

అన్ని చోట్లా హవా.. క్యూ కడుతున్నారు

హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులారిటీని సంపాదించుకున్న వారిలో నయనతార ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం ఇలా దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటిస్తూ హవాను చూపిస్తూ ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. ఈ కారణంగానే ఆమెను తమ సినిమాల్లో తీసుకునేందుకు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.

తెలుగులో అలా ఎంట్రీ.. ఇలా పాపులర్

తెలుగులో అలా ఎంట్రీ.. ఇలా పాపులర్

'గజినీ', 'చంద్రముఖి' వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది నయనతార. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ నటించిన 'లక్ష్మీ'తో టాలీవుడ్‌లోకి నేరుగా ఎంటర్ అయింది. అప్పటి నుంచి దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే తెలుగులో ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్‌గా రికార్డును సాధించిందామె.

ఇద్దరితో ప్రేమాయణం.. చివర్లో షాకింగ్‌గా

ఇద్దరితో ప్రేమాయణం.. చివర్లో షాకింగ్‌గా

ఆరంభం నుంచే సినీ పరిశ్రమపై సత్తా చాటుతూ వస్తోంది నయనతార. దీంతో వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తోంది. అయితే, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆమెకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. కెరీర్ ఆరంభంలో యంగ్ హీరోతో లవ్ ట్రాక్ నడిపిన ఆమె.. ఆ తర్వాత బ్రేకప్ చెప్పింది. అలాగే, ప్రభాదేవాతో నిశ్చితార్థం కూడా చేసుకున్నా.. విడిపోయి షాకిచ్చింది.

యంగ్ డైరెక్టర్‌తో లవ్ ట్రాక్.. చెప్పేశారు

యంగ్ డైరెక్టర్‌తో లవ్ ట్రాక్.. చెప్పేశారు

ఇద్దరితో బ్రేకప్ అయిన తర్వాత మరోసారి ప్రేమ వ్యవహారం నడుపుతూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది నయనతార. 'నానుమ్ రౌడీ దాన్' మూవీ షూటింగ్ టైంలో దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడింది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించారు. పలుమార్లు కెమెరాల కంట పడ్డా దీనిపై నోరు మెదపలేదు. కానీ, కొద్ది రోజుల క్రితం తమ ప్రేమను ప్రకటించారు.

పెళ్లి విషయంలో పుకార్లు.. క్లారిటీ లేదు

పెళ్లి విషయంలో పుకార్లు.. క్లారిటీ లేదు

తమ బంధం బయట పడినప్పటి నుంచి నయనతార - విఘ్నేష్ శివన్ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. హాలీడే ట్రిప్పులను ఎంజాయ్ చేయడంతో పాటు దేవాలయాలను సైతం సందర్శిస్తున్నారు. వీటికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ జంట పెళ్లి గురించి ఎన్నో ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. దీంతో ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

పెళ్లి విషయంలో నయనతార యూటర్న్

పెళ్లి విషయంలో నయనతార యూటర్న్

వాస్తవానికి నయనతార - విఘ్నేష్ వివాహం 2020లోనే జరగాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా అది కాస్తా వాయిదా పడింది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్లిద్దరూ కొద్ది మంది అతిథుల మధ్యలోనే నిరాడంబరంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ మధ్య ఈ వార్త బాగా వైరల్ అయింది. ఈ పరిస్థితుల్లో తన పెళ్లి విషయంలో నయనతార యూటర్న్ తీసుకుందని తెలుస్తోంది.

దానికి ప్రియుడి కుటుంబం నిరాకరణ

దానికి ప్రియుడి కుటుంబం నిరాకరణ

తాజా సమాచారం ప్రకారం.. నయనతార - విఘ్నేష్ పెళ్లి మార్చి నెలలోనే జరగబోతుందట. దీన్ని అంగరంగ వైభవంగా జరపాలని లేడీ సూపర్ స్టార్ నిర్ణయించుకుందని తెలుస్తోంది. దీనికి కారణం.. నిరాడంబరంగా జరిపేందుకు విఘ్నేష్ ఫ్యామిలీ నిరాకరించడమేనని టాక్. తమ కుమారుడి వివాహం గ్రాండ్‌గా చేయాలని వాళ్లు బలవంతం పెట్టడం వల్లే నయన్ ఈ విషయంలో యూటర్న్ తీసుకుందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X