కాబోయేవాడికి కోసం అంత ఖర్చు చేసిందా ..?
లేడీ సూపర్ స్టార్ నయనతార రేంజ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్ గా వెలిగిపోతోంది. ఇక నయనతార, విఘ్నేష్ శివన్ ప్రేమ గురించి అందరికీ తెలిసిందే . వాళ్లిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అందులో దాపరికం కూడా లేదు. ఇద్దరూ ఘాడంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటారని కూడా చాలాసార్లు వార్తలు వచ్చాయి.
అయితే దీనిపై మాత్రం ఇప్పటి వరకు నయన్ స్పందించలేదు. ఆ మధ్య విఘ్నేష్ శివన్ మాట్లాడుతూ .. తాము త్వరలో పెళ్లితో ఒకటి కానున్నామని ఎన్నివిధాలుగా ప్రచారమైనా ఇప్పట్లో పెళ్లి కార్డు ఇవ్వలేమని, ప్రస్తుతం కెరీర్ పైనే పూర్తి దృష్టి పెట్టామని చప్పాడు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం తన బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివాన్ తో కలిసి నయన్ గోవాకు వెళ్లిన సంగతి తెలిసినదే.

ఈ సందర్భంగా వీరు తీసుకున్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే విఘ్నేష్ పుట్టినరోజును దగ్గరుండి జరిపిన నయన్ అందుకోసం భారీగా ఖర్చు చేసినట్లు ఇప్పుడు కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. గోవా లో మూడు రోజుల పర్యటన కోసం నయనతార 25 లక్షల రూపాయలు ఖర్చు చేసిందట. ఇది తమిళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications











