Exclusive: స్టార్ హీరోతో బాలీవుడ్ ఎంట్రీకి సిద్దమైన నయనతార.. అలా సెట్ చేసిన తమిళ దర్శకుడు

గ్లామరస్ బ్యూటీ నయనతార సినిమాల్లోకి అడుగు పెట్టి దాదాపు 18 ఏళ్లవుతోంది. ఇన్నేళ్ల సినిమా కెరీర్ లో అమ్మడు సౌత్ ఇండస్ట్రీలో దాదాపు అగ్ర హీరోలందరితో సినిమాలు చేసింది. చిన్న హీరో పెద్ద హీరో అని తేడా లేకుండా తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఈ బ్యూటీ బాలీవుడ్ వైవు పెద్దగా ఫోకస్ పెట్టింది లేదు. ఇక మొదటిసారి అమ్మడు ఒక బాలీవుడ్ అగ్ర హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Recommended Video

Nayanthara ఫోటో కి ఫోజ్ ఇచ్చిందా..? అంటూ నెటిజన్ల అనుమానాలు!! || Filmibeat Telugu
కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా

కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా

నయనతార కెరీర్ మొత్తంలో ఎన్నో విభిన్నమైన సినిమాలు ఉన్నాయి. కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా ప్రయోగాత్మకమైన లేడి ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది. ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్ళు గడుస్తున్నా కూడా ఆమె రేంజ్ అలానే కొనసాగుతోంది అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఆమె హార్డ్ వర్క్ తో పాటు గ్లామర్ ను కూడా ఒక పద్దతిలో. మెయింటైన్ చేసుకుంటూ వస్తోంది.

సినిమా కెరీర్ పై పడకుండా

సినిమా కెరీర్ పై పడకుండా

నయనతార తన జీవితంలో నేటితరం హీరోయిన్స్ చూడని స్టార్ డమ్ ను ఎంతగానో చూసింది. అయితే ఆమె ప్రేమ వ్యవహారాలు ప్రతిసారి మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. కానీ అలాంటి పర్సనల్ కాంట్రవర్సీలను సినిమా కెరీర్ పై పడకుండా చాలా జాగ్రత్తగా మెలిగింది. పూర్తిగా ఇంటర్వ్యూలను ప్రమోషన్స్ దూరం పెట్టినా కూడా ఆమెనే హీరోయిన్స్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారు.

షారుక్ ఖాన్ తో.. హిందీ ఎంట్రీ

షారుక్ ఖాన్ తో.. హిందీ ఎంట్రీ

ఇక 37ఏళ్ళ వయసులో నయనతార బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తో నటించబోతున్నట్లు టాక్ అయితే వస్తోంది. గత రెండు రోజులుగా నేషనల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారుతోంది. ఇక ఇప్పటివరకు అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు.

ఆ దర్శకుడి వల్లే.. ఛాన్స్

ఆ దర్శకుడి వల్లే.. ఛాన్స్

దర్శకుడు అట్లీ ఆమెను ఏరికోరి సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అట్లీ ప్రస్తుతం షారుక్ ఖాన్ తో సినిమా చేయడానికి అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. సంకీ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా కూడా కథనాలు వచ్చాయి. అసలైతే మొదట దీపికా పదుకొనె అని టాక్ వచ్చింది.

కానీ అది రూమర్ గా మిగిలిపోగా ఇప్పుడు నయన్ పేరు గట్టిగానే వినిపిస్తోంది. ఇటీవల షారుక్ ఖాన్ ఫైనల్ గా కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నయన్ పేరును సజెస్ట్ చేసినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X