ప్రియుడికి భారీ షాకిచ్చిన నయనతార: పెళ్లి విషయంలో సంచలన నిర్ణయం..తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇలా!

నయనతార.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ హీరోయిన్.. దాదాపు పదేళ్లుగా దక్షిణాదిలోని అన్ని ఇండస్ట్రీల్లోనూ సత్తా చాటుతూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. కెరీర్ ఆరంభంలో గ్లామరస్ పాత్రలను మాత్రమే పోషించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న చిత్రాల్లో నటించింది. తద్వారా నటిగా మంచి పేరును అందుకుంది. అయితే, పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఇక, కొంత కాలంగా దర్శకుడు విఘ్నేష్‌తో ప్రేమాయణం సాగిస్తోన్న నయన్.. పెళ్లిపై సంచలన నిర్ణయం తీసుకుందని తెలిసింది. ఆ వివరాలు మీకోసం!

Photos: Bold acts from Bollywood Movies

లేడీ సూపర్ స్టార్.. అన్నింట్లోనూ ఆమెనే

లేడీ సూపర్ స్టార్.. అన్నింట్లోనూ ఆమెనే

సాదాసీదాగా కెరీర్‌ను ఆరంభించి.. చాలా తక్కువ సమయంలోనే లేడీ సూపర్ స్టార్ అన్న బిరుదును సొంతం చేసుకుంది యాక్టింగ్ క్వీన్ నయనతార. పాత్ర ఏదైనా ఇట్టే అందులో పరకాయ ప్రవేశం చేసి అద్భుతంగా పండించగల ఈమె నైపుణ్యం దక్షిణాది మొత్తాన్ని మెప్పించింది. అందుకే అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన దర్శక నిర్మాతలు నయనతార డేట్స్ కోసం క్యూ కడుతున్నారు.

Photos: South Indian Actress Hot Unseen Pics

టాలీవుడ్‌లోకి అలా ఎంట్రీ... ఇలా ఫేమస్

టాలీవుడ్‌లోకి అలా ఎంట్రీ... ఇలా ఫేమస్

అప్పట్లో 'గజినీ', 'చంద్రముఖి' వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది నయనతార. ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్ నటించిన 'లక్ష్మీ'తో టాలీవుడ్‌లో నేరుగా అడుగు పెట్టింది. అప్పటి నుంచి తెలుగులోని దాదాపు అందురు స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించింది. ఈ క్రమంలోనే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్‌గా రికార్డును ఖాతాలో వేసుకుంది.

లేటు వయసులో ఘాటు అందాలతో కవ్విస్తోన్న కరిష్మా కొటక్

పర్సనల్ లైఫ్‌లో షాకులు.. రెండు బ్రేక్‌లు

పర్సనల్ లైఫ్‌లో షాకులు.. రెండు బ్రేక్‌లు

సినిమా పరంగా నయనతార ఎంత సక్సెస్ అయిందో.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో షాకులను ఎదుర్కొంది. మరీ ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు ఆమెకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. కెరీర్ ఆరంభంలో ఓ యంగ్ హీరోతో డేటింగ్ చేసిన ఈ భామ.. ఆ తర్వాత ప్రభుదేవాతోనూ ప్రేమలో పడింది. వీళ్ల బంధం నిశ్చితార్థం వరకూ వెళ్లింది. కానీ, పెళ్లి పీటలు మాత్రం ఎక్కలేకపోయింది.

ముద్దబంతులతో ముద్దబంతిలా నైనా గంగూలీ..

యంగ్ డైరెక్టర్‌తో లవ్ ట్రాక్‌తో హాట్ టాపిక్

యంగ్ డైరెక్టర్‌తో లవ్ ట్రాక్‌తో హాట్ టాపిక్

ఏకంగా రెండు విఫల ప్రేమకథల తర్వాత నయనతార యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడింది. 'నానుమ్ రౌడీ దాన్' మూవీ షూటింగ్ టైంలో వీళ్లిద్దరి మధ్య లవ్ పుట్టుకొచ్చింది. అప్పటి నుంచి ఈ జంట చాలా కాలం పాటు సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించింది. ఈ క్రమంలోనే పలుమార్లు కెమెరాల కంట పడడంతో హాట్ టాపిక్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమను ప్రకటించారు.

మత్తు కళ్ళతో కైపెక్కిస్తున్న నందిత శ్వేత

అదుగో నయనతార పెళ్లి... ఎంగేజ్‌మెంట్

అదుగో నయనతార పెళ్లి... ఎంగేజ్‌మెంట్

విఘ్నేష్ శివన్‌తో దాదాపు ఐదేళ్లుగా నయనతార ప్రేమాయణం సాగిస్తూనే ఉంది. అప్పటి నుంచి వీళ్లిద్దరి పెళ్లి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. ఒకనొక సందర్భంలో ఈ జంట విడిపోయిందన్న టాక్ కూడా వినిపించింది. ఆ తర్వాత అంటే ఈ మధ్య కాలంలో పెళ్లి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక, ఇటీవల వీళ్లిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారని కూడా జోరుగా ప్రచారం జరిగింది.

ప్రియుడికి భారీ షాకిచ్చిన నయనతార

ప్రియుడికి భారీ షాకిచ్చిన నయనతార

ఇటీవలే నయనతార చేతికి ఎంగేజ్‌మెంట్ రింగ్‌ ఉందని చూపిస్తూ విఘ్నేష్ శివన్ ఓ ఫోటోను షేర్ చేశాడు. దీంతో నిశ్చితార్థం అయిపోయిందని అంతా అనుకున్నారు. అదే సమయంలో త్వరలోనే పెళ్లి కబురు కూడా చెబుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో నయన్.. వివాహం గురించి సంచలన నిర్ణయం తీసుకుని.. ప్రియుడికి భారీ షాకిచ్చిందని తెలుస్తోంది.

Recommended Video

కరోనా రూమర్స్ ని వెరైటీ గా ఖండించిన Nayanthara , Vignesh Shivan
పెళ్లిపై నయన్ సంచలన నిర్ణయం అంటూ

పెళ్లిపై నయన్ సంచలన నిర్ణయం అంటూ

కోలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. ఈ ఏడాది ఎలాగైనా వివాహం చేసుకోవాలని విఘ్నేష్ కుటుంబం పట్టుబడుతోందట. అయితే, నయనతార మాత్రం కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న కారణంగా పెళ్లిని వచ్చే సంవత్సరానికి వాయిదా వేద్దామని తేల్చి చెప్పినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో చేసేదేం లేక విఘ్నేష్ కూడా ఓకే చెప్పాడని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X