Nayanthara Vignesh Shivan Divorce: విఘ్నేష్ శివన్‌తో విడాకులు? ఆ ఫోటోతో నయనతార క్లారిటీ

మేల్ డామినేషన్ ఉండే ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నారు నయనతార. ఆటిట్యూడ్ చూపిస్తుందని, పొగరని ఎన్ని విమర్శలు వచ్చినా తనదైన దారిలో దూసుకెళ్తున్నారు. హీరోలని మించిన క్రేజ్‌తో తమిళ చిత్ర పరిశ్రమను రూల్ చేస్తున్నారు. 40 ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని గ్లామర్‌తో వెలిగిపోతున్న నయనతార వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తుతం కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భర్త విఘ్నేష్ శివన్‌తో ఆమె విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.

విఘ్నేష్‌ ప్రేమలో నయన్
శింబు, ప్రభుదేవాలతో పీటల వరకు వెళ్లి చివరి నిమిషంలో బ్రేకప్ కావడంతో నయనతార డిప్రెషన్‌లోకి వెళ్లారు. తిరిగి కోలుకుని తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించారు. వరుస బ్లాక్‌బస్టర్స్, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ దశలో నానుమ్ రౌడీ దాన్ సినిమా ఆమె జీవితంలో పెను మార్పులు తీసుకొచ్చింది. ఈ చిత్ర దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారి పెళ్లిగా మారింది. దాదాపు 7 ఏళ్లపాటు వీరు సీక్రెట్‌గా డేటింగ్ చేసి తమ బంధాన్ని బయటపెట్టి ఇండస్ట్రీకి షాకిచ్చారు.

Nayanthara Vignesh Shivan Divorce Lady Super Star visiting Palani temple with her husband

భర్త, పిల్లలతో హ్యాపీలైఫ్
అప్పటికే రెండుసార్లు ప్రేమలో విఫలమైన నయనతార ఈసారి విఘ్నేష్‌తోనైనా పెళ్లి వరకు వెళ్తుందా? మధ్యలోనే ఆగిపోతుందా? అంటూ ట్రోలింగ్ జరిగింది. సామాన్యులే కాదు సినీవర్గాలు కూడా ఇదే అనుమానాలు వ్యక్తం చేశారు. వీటన్నింటిని పటాపంచెలు చేస్తూ విఘ్నేష్ శివన్‌తో పెళ్లికి గ్రాండ్ ఏర్పాట్లు చేసుకున్నారు నయనతార. పెద్దల అంగీకారంతో 2022లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. అనంతరం సరోగసి విధానంలో ఇద్దరు పిల్లలకు వీరు జన్మనిచ్చారు. భర్త, పిల్లలతో నయనతార తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

ధనుష్‌తో వివాదం
తమ పెళ్లి వీడియో హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌‌కు నయనతార విక్రయించడం వివాదాస్పదమైంది. నయన్- విఘ్నేష్‌ల కెరీర్, ప్రేమ, పెళ్లిపై నెట్‌ఫ్లిక్స్‌లో నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్ అనే పేరుతో డాక్యుమెంటరీ ప్రసారమైంది. ఇందులో నానుమ్ రౌడీ దాన్ సినిమాలోని మూడు సెకన్ల ఫుటేజ్‌ని వాడుకోవడంతో ఈ చిత్ర నిర్మాత ధనుష్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడం వివాదాస్పదమైంది. తాము సినిమాలోని పాటలు, వీడియోలు, సన్నివేశాలను వినియోగించలేదని.. కేవలం షూటింగ్ సమయంలో తమ మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించిన ఫుటేజ్‌నే వాడుకున్నామంటూ నయన్ వివరణ ఇచ్చినా ధనుష్ వినిపించుకోలేదు. కోలీవుడ్ పెద్దల జోక్యంతో ఈ ఇద్దరు సూపర్‌స్టార్ల మధ్య వివాదం సద్దుమణిగిందని చెబుతారు.

పెళ్లితో తప్పు చేశానంటూ పోస్ట్
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే నయనతార ఎప్పటికప్పుడు సినిమాలు, షూటింగ్స్ తన వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే రెండ్రోజుల క్రితం పెళ్లి చేసుకోవడం జీవితంలో పెద్ద తప్పని, తనను ఒంటరిగా వదిలేయాలంటూ పెట్టిన పోస్ట్ కలకలం రేపింది. దీంతో నయనతార- విఘ్నేష్ శివన్‌లు విడాకులు తీసుకోబోతున్నారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై తాజాగా నయనతార స్పందించారు. తన భర్త విఘ్నేష్ శివన్, పిల్లలతో కలిసి పళనిలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని దర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిలో విఘ్నేష్‌తో నయన్ ఎంతో క్లోజ్‌గా కనిపించారు. ఈ ఫోటోలతో తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, విడాకులు తీసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు నయనతార.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X