నయనతార జీవితంలో ఊహించని పరిణామం: అలా మేటర్ లీక్ చేసిన ప్రియుడు.. అది చూసి షాక్‌లో ఫ్యాన్స్!

ఏమాత్రం అంచనాలు లేకుండానే సినిమాల్లోకి ప్రవేశించి.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని స్థాయికి ఎదిగిపోయింది దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార. సౌత్‌లోని అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ.. దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ ఆడిపాడిందామె. ఈ కారణంగానే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. సినిమాల పరంగా ఎలా ఉన్నా.. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన ఈ బ్యూటీ.. కొన్నేళ్లుగా దర్శకుడు విఘ్నేష్‌తో ప్రేమాయణం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మేటర్ లీక్ చేశాడు నయనతార ప్రియుడు. ఆ వివరాలు మీకోసం!

ఎక్కడ చూసినా ఆమెదే హవా... సూపర్ స్టార్‌గా

ఎక్కడ చూసినా ఆమెదే హవా... సూపర్ స్టార్‌గా

ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన వెంటనే సక్సెస్ అయింది నయనతార. కెరీర్ ఆరంభంలోనే వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇలా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం భాషలన్నిట్లోనూ నటిస్తూ హవాను చూపిస్తోంది. అదే సమయంలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం సంపాదించుకుని సూపర్ స్టార్‌గా ఎదిగిపోయింది.

తెలుగులో అలా వచ్చింది.. ఇప్పుడు ఆమెతోనే

తెలుగులో అలా వచ్చింది.. ఇప్పుడు ఆమెతోనే

కెరీర్ తొలినాళ్లలోనే 'గజినీ', 'చంద్రముఖి' వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది నయనతార. ఆ తర్వాత వెంకటేష్ నటించిన 'లక్ష్మీ'తో టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. అప్పటి నుంచి దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే తెలుగులో ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్‌గా రికార్డును సాధించిందామె.

ఇద్దరితో లవ్ ట్రాకులు.. మధ్యలోనే మిగిశాయిగా

ఇద్దరితో లవ్ ట్రాకులు.. మధ్యలోనే మిగిశాయిగా


కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్న సమయంలోనే నయనతారను ప్రేమ వ్యవహారాలు కృంగిపోయేలా చేశాయి. సుదీర్ఘమైన ప్రస్థానంలో పలు ట్రాకులు గాడి తప్పాయి. మొదట్లో ఓ యంగ్ హీరోతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ భామ.. ఆ తర్వాత ప్రభుదేవాతోనూ లవ్ ట్రాక్ నడిపింది. అయితే, ఈ రెండు వ్యవహారాలు పెళ్లి వరకూ వెళ్లకుండానే ఆగిపోవడం ఆమెకు ఇబ్బందులు తెచ్చాయి.

ఆ డైరెక్టర్‌తో ప్రేమాయణం... స్వయంగా ప్రకటన

ఆ డైరెక్టర్‌తో ప్రేమాయణం... స్వయంగా ప్రకటన

రెండు బ్రేకప్‌ల తర్వాత నయనతార మూడో వ్యక్తితోనూ ప్రేమలో పడింది. అతడే యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్. 'నానుమ్ రౌడీ దాన్' మూవీ షూటింగ్ టైంలో వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ చాలా కాలం పాటు సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించారు. పలుమార్లు కెమెరాల కంట పడ్డా దీనిపై నోరు మెదపలేదు. కానీ, కొద్ది రోజుల క్రితం తమ ప్రేమను ప్రకటించారు.

పెళ్లి విషయంలో పుకార్లు.. క్లారిటీ మాత్రం లేదు

పెళ్లి విషయంలో పుకార్లు.. క్లారిటీ మాత్రం లేదు

తమ బంధం బయట పడినప్పటి నుంచి నయనతార - విఘ్నేష్ శివన్ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. హాలీడే ట్రిప్పులను ఎంజాయ్ చేయడంతో పాటు దేవాలయాలను సైతం సందర్శిస్తున్నారు. వీటికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ జంట పెళ్లి గురించి ఎన్నో ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. దీంతో ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Recommended Video

కరోనా రూమర్స్ ని వెరైటీ గా ఖండించిన Nayanthara , Vignesh Shivan
మధుర ఘట్టం.. అలా మేటర్ లీక్ చేసిన లవర్

మధుర ఘట్టం.. అలా మేటర్ లీక్ చేసిన లవర్


కొద్ది రోజులుగా నయనతార పెళ్లి హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా విఘ్నేష్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేశాడు. అందులో నయన్ అతడిపై చేయి వేసి హత్తుకుని కనిపిస్తోంది. అంతేకాదు, ఆమె చేతికి ఎంగేజ్‌మెంట్ రింగ్ కూడా ఉంది. దీనికితోడు అదే అర్థం వచ్చేలా విఘ్నేష్ క్యాప్షన్ కూడా పెట్టడంతో నిశ్చితార్థం అయిందని అంతా అనుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X