For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పెళ్లి విషయంలో నయనతార సంచలన నిర్ణయం: ప్రియుడి కుటుంబం నుంచి వ్యతిరేకత రావడంతో!

  |

  ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది లేడీ సూపర్ స్టార్ నయనతార. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం ఇలా దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటిస్తూ హవాను చూపిస్తోంది. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ సత్తా చాటుతోంది. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. ప్రియుడితో తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తన పెళ్లి విషయంలో నయనతార సంచలన నిర్ణయం తీసుకుందట. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  కరోనా రూమర్స్ ని వెరైటీ గా ఖండించిన Nayanthara , Vignesh Shivan
  ఎవరి నోట విన్నా నయనతార పేరే

  ఎవరి నోట విన్నా నయనతార పేరే

  దాదాపు రెండు దశాబ్దాలుగా దక్షిణాది భాషల్లో స్టార్ హీరోయిన్‌గా తన మార్క్ చూపిస్తోంది నయనతార. వరుసగా స్టార్ హీరోలకు చెందిన భారీ ప్రాజెక్టుల్లో నటించడంతో పాటు చిన్న చిత్రాల్లోనూ భాగం అవుతోంది. ఫలితంగా అందరి హీరోయిన్‌గా మన్ననలు అందుకుంటోంది. దీంతో అన్ని భాషలకు చెందిన దర్శక నిర్మాతలు ఈ లేడీ సూపర్ స్టార్ డేట్స్ కోసం పోటీ పడుతున్నారు.

  తెలుగులో వచ్చింది.. అలా ఫేమస్

  తెలుగులో వచ్చింది.. అలా ఫేమస్

  కెరీర్ ఆరంభంలో నటించిన ‘గజినీ', ‘చంద్రముఖి' వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు వాళ్లకు పరిచయం అయింది నయనతార. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ నటించిన ‘లక్ష్మీ'తో టాలీవుడ్‌లోకి నేరుగా ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించింది. ఈ క్రమంలోనే తెలుగులో ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్‌గా రికార్డులకెక్కింది.

  పర్సనల్ లైఫ్‌లో వరుస దెబ్బలు

  పర్సనల్ లైఫ్‌లో వరుస దెబ్బలు

  సినిమా పరంగా ఫుల్ ఫామ్‌ను చూపిస్తోంది నయనతార. అయితే, పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కెరీర్ ఆరంభంలో ఓ స్టార్ హీరోతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ అమ్మడు మధ్యలోనే అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాత ప్రభుదేవాతో నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ, ఈ బంధాన్ని పెళ్లి వరకూ తీసుకెళ్లకుండా చివరి క్షణంలో యూటర్న్ తీసుకుంది.

  ఆ డైరెక్టర్‌తో సీక్రెట్‌గా ప్రేమాయణం

  ఆ డైరెక్టర్‌తో సీక్రెట్‌గా ప్రేమాయణం

  రెండు బ్రేకప్ స్టోరీలతో హాట్ టాపిక్ అయిపోయింది నయనతార. ఇలాంటి పరిస్థితుల్లో ‘నానుమ్ రౌడీ దాన్' అనే మూవీ షూటింగ్ సమయంలో దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడింది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించారు. పలుమార్లు కెమెరాల కంట పడినప్పటికీ ఈ విషయంపై నోరు మెదపలేదు. కానీ, కొద్ది రోజుల క్రితం తమ ప్రేమను ప్రకటించారీ ఇద్దరు.

   పెళ్లిపై నయనతార సంచలన నిర్ణయం

  పెళ్లిపై నయనతార సంచలన నిర్ణయం

  తమ బంధం బయట పడిన తర్వాత బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు నయనతార - విఘ్నేష్ శివన్. ఈ క్రమంలోనే హాలీడే ట్రిప్పులను ఎంజాయ్ చేయడంతో పాటు దేవాలయాలను సైతం సందర్శిస్తున్నారు. దీంతో వీళ్ల పెళ్లిపై ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తన వివాహం గురించి నయనతార సంచలన నిర్ణయం తీసుకుందట.

  ప్రియుడి కుటుంబం నుంచి వ్యతిరేకత

  ప్రియుడి కుటుంబం నుంచి వ్యతిరేకత

  వాస్తవానికి నయన్.. విఘ్నేష్ ఎప్పుడో పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ, వీళ్లు దాన్ని 2021 చివరికి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో విఘ్నేష్ కుటుంబ సభ్యులు వివాహం చేసుకోమని అతడిపై ఒత్తడి తెస్తున్నారట. దీంతో నయన్ కూడా దీనికి ఒప్పుకోవాల్సి వచ్చిందని సమాచారం. వీళ్ల పెళ్లి వచ్చే ఫిబ్రవరిలో జరగనుందని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

  English summary
  Diana Mariam Kurian, known professionally as Nayanthara, is an Indian actress who primarily works in Tamil, Malayalam and Telugu-language films. Nayanthara made her acting debut in the 2003 Malayalam film Manassinakkare with Jayaram. She made her debut in Tamil cinema with Ayya and Telugu with Lakshmi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X