నయనతార, విఘ్నేష్ శివన్ రిలేషన్... పెళ్లి తప్ప అన్నీ జరిగిపోతున్నాయి!

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార తమిళ యువ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో లవ్ రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరు కలిసి సహజీవనం చేస్తున్నారు. ఇరు కుటుంబాలు కలిసే అన్ని వేడుకలు జరుపుకుంటున్నారు. వీరి మధ్య పెళ్లి అనే ఒక ఘట్టం తప్ప... పెళ్లి తర్వాత జరిగే అన్ని ఘట్టాలు జరిగిపోతున్నాయి.

నయనతార, విఘ్నేష్ శివన్ ఇద్దరూ వేర్వేరు రాష్ట్రాలకు సంబంధించిన వారు కావడంతో ఇద్దరికీ సంబంధించి పండుగలు, ఆచారాలను ఫాలో అవుతూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తాజాగా వీరు 'పూతండు', 'విషు' వేడుకలు జరుపుకున్నారు. మనకు తెలుగు సంవత్సరం ఉగాది ఎలాగో... తమిళ, కేరళ వారికి అవి అలా అన్నమాట.

రెండు కుటుంబాలు కలిసి

రెండు కుటుంబాలు కలిసి

అంతా కలిసి ‘పూతండు', ‘విషు' వేడుకలు జరుపుకున్న ఫోటోలను విఘ్నేష్ శివన్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఇందులో నయనతారతో పాటు విఘ్నేష్ శివన్ తల్లి, నయనతార సిస్టర్, ఆమె భర్త కూడా ఉండటం గమనార్హం.

పెళ్లి జరిగితే అదే సమస్య

పెళ్లి జరిగితే అదే సమస్య

నయనతార, విఘ్నేష్ శివన్ కావాలనే పెళ్లికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నయనతార సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. పెళ్లయితే ఆమె కెరీర్ మీద ప్రభావం పడే అవకాశం ఉండటంతో వివాహం చేసుకోకుండా సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పట్లో ఆ ఛాన్సే లేదు..

ఇప్పట్లో ఆ ఛాన్సే లేదు..

గతేడాది నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ జరుగలేదు. వీరికి రహస్యంగా పెళ్లి జరిగినట్లు కూడా పుకార్లు షికార్లు చేశాయి. ఆ ప్రచారం ఎలా ఉన్నా వీరి వివాహం ఇప్పట్లో జరిగే అవకాశం లేదు అనేది విస్పష్టం.

వరుస సినిమాలతో నయనతార బిజీ

వరుస సినిమాలతో నయనతార బిజీ

నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. చిరంజీవి ‘సైరా'లో నటిస్తున్నారు. దీంతో పాటు ఇటీవల మొదలైన రజనీ-మురుగదాస్ మూవీ ‘దర్బార్'లో కూడా హీరోయిన్‌గా చేస్తోంది. ఇంకా విజయ్ మూవీ, శివకార్తికేయన్ ఫిల్మ్, మరో మలయాళ చిత్రంలో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X