Nayanathara with Prabhas: 16 ఏళ్ల తర్వాత ప్రభాస్‌తో నయనతార.. రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
.మంచు విష్ణు హీరోగా ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా తన తండ్రి మోహన్ బాబు నిర్మాణంలో భక్త కన్నప్ప అనే సబ్జెక్టు రూపొందుతోంది. శ్రీకాళహస్తీశ్వరుడు మహాత్యం తెలిపే విధంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఇప్పటికే భాగమవుతున్నట్లు క్లారిటీ వచ్చేయగా... ఆయన సరసన మరో స్టార్ హీరోయిన్ నటిస్తుందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు నిలబడిన తర్వాత ఎందుకో ఆయన ఎక్కువగా ట్రోలర్స్ కు టార్గెట్ అయ్యాడు. ఆ తర్వాత మోహన్ బాబు చేసిన సన్నాఫ్ ఇండియా, మంచు విష్ణు చేసిన జిన్నా అనే సినిమాలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ లుగా మారడమే కాక దారుణమైన ఫలితాన్ని కూడా అందుకోవాల్సి వచ్చిన పరిస్థితులు కనిపించాయి.

అయితే ఎట్టకేలకు ఆయన ఇప్పుడు భక్తకన్నప్ప అనే ఒక భక్తి రసమైన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కొన్నాళ్ల క్రితం శ్రీకాళహస్తి దేవాలయంలో పెద్ద ఎత్తున పూజలు చేసి ఈ సినిమా లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు రాగా... ఆ విషయాన్ని మంచు విష్ణు కన్ఫర్మ్ చేశాడు.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ శివుడు పాత్రలో నటిస్తుండగా పార్వతి పాత్ర కూడా బలమైనదే కాబట్టి... ఆ పాత్ర కోసం మరో స్టార్ హీరోయిన్ తీసుకోవాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో నయనతారను సంప్రదిస్తే ఆమె ముందు కాస్త తట పటాయించిన తర్వాత భారీ ఎత్తున రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడంతో పాటు ప్రభాస్ పక్కన పాత్ర అనగానే ఆమె కూడా ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. విష్ణు సినిమాలో వీరు ఇద్దరు శివపార్వతుల్లా కనిపించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

అయితే నిమిషాల వ్యవధిలో ఉండే ఈ పాత్ర కోసం కూడా ఆమె కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ అంతగా ఛార్జ్ చేయకపోయినా పరిచయం బట్టి సినిమా చేస్తున్నాడు. కానీ నయనతార మాత్రం పెద్ద ఎత్తున ఛార్జ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక 16 ఏళ్ల తర్వాత వీరి జోడి సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుంది. అప్పుడెప్పుడో బిల్లా సినిమాలో వీరు ఇద్దరు కలిసి నటించారు. ఇప్పుడు మళ్లీ తెరపై కనిపిస్తుండటం.. ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

వాస్తవానికి సినిమా అనౌన్స్ చేసినప్పుడు నుపూర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు నుపుర్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా మంచు విష్ణు అధికారికంగా ప్రకటించాడు. మరి హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనే విషయం మీద ప్రస్తుతానికి అదే క్లారిటీ లేదు. ఇక మంచు విష్ణు కెరియర్ లోనే ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది మంచు కుటుంబం.


Click it and Unblock the Notifications











