టాలీవుడ్‌కు మరో మలయాళ ముద్దుగుమ్మ.. యంగ్ డైరెక్టర్ కోసం నానితో కలిసి..
మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి మరో అందాల భామ టాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నది. మాలీవుడ్‌లో అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న నాజ్రియా నాజిమ్ మైత్రీ మూవీస్ రూపొందించనున్న చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం కోసం నాజ్రియాను ఎంపిక చేసినట్టు మైత్రీ మూవీస్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ వివరాల్లోకి వెళితే..

మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి
మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి టాలీవుడ్‌లో అమలాపాల్, నయనతార, నివేదా థామస్, కీర్తీ సురేష్ లాంటి హీరోయిన్లు ఇప్పటికే తెలుగుతోపాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్రతారగా రాణిస్తున్నారు. వారి జాబితాలోకి ఇప్పుడు నాజ్రియా కూడా చేరబోతున్నది. నాజ్రియాకు తెలుగులో ఇదే మొదటి చిత్రం కానున్నది.

మైత్రీ మూవీస్, నాని సినిమా కోసం
ప్రతిభావంతుడైన యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ బ్యానర్స్‌పై నాని కెరీర్‌లో 28వ చిత్రంగా రూపొందనున్న చిత్రం కోసం నాజ్రియాను ఎంపిక చేసినట్టు చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను నవంబర్ 21వ తేదీన ప్రకటిస్తామని పేర్కొన్నారు.

మాలీవుడ్ స్టార్ హీరోతో వివాహం
ఇక నాజ్రియా వ్యక్తిగత విషయానికి వస్తే.. ప్రముఖ మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్‌ను వివాహం చేసుకొన్నది. 2014లో నిశ్చితార్థం జరుగగా.. 2014 ఆగస్టులో పెళ్లి చేసుకొన్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో ఈ పాపులర్ జంటకు విశేష ఆదరణ ఉంది.
Recommended Video

హీరోయిన్‌గా, నిర్మాతగా కెరీర్
నాజ్రియా కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల రిలీజైన ట్రాన్స్ చిత్రంలో తనదైన నటనతో మెప్పించింది. 2006లో మలయాళ చిత్ర పరిశ్రమలోకి పలుంకు అనే చిత్రం ద్వారా అడుగుపెట్టింది. యువ్, బెంగళూర్ డేస్, కూడి, రాజా రాణి, సాలయ్య మొబైల్ లాంటి చిత్రాల్లో నటించింది. నిర్మాతగా వరథాన్, కుంబలంగి నైట్స్, సీ యూ సూన్ లాంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించింది.


Click it and Unblock the Notifications











