Happy Birthday Shruti hasan: బాలయ్య సినిమాలో పవర్ఫుల్ రోల్.. బ్యూటీఫుల్ ఫొటో వైరల్!

సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న బ్యూటీ శ్రుతి హాసన్. స్టార్ హీరోల వారసత్వం నుంచి వచ్చిన హీరోయిన్స్ గతంలో వెండితెరపై అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయారు. ఇక శృతిహాసన్ మాత్రం మంచి నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కమల్ హాసన్ కూతురు గా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ను ఏర్పాటు చేసుకుంది అనే చెప్పాలి.

ప్రస్తుతం అయితే ఆమె చేతిలో చాలా మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. కేవలం చిన్న సినిమాలు మాత్రమే కాకుండా అతి పెద్ద పాన్ ఇండియా సినిమాలను కూడా చేస్తోంది. ఈ బ్యూటీకి ఒక్కసారి కథ నచ్చితే సినిమా చేయడానికి తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినా కూడా ఓకే చేస్తోందట. ఆ విధంగా మంచి హీరోయిన్ గా క్రేజ్ అందుకుంటోంది.

Nbk 107 project latest update shruti hasan birthday pic viral

ఇక శృతి హాసన్ ప్రస్తుతం కేవలం తమిళ్ ఇండస్ట్రీ లోనే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా చాలా మంచి ప్రాజెక్టులు చేస్తోంది ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న NBK 107వ సినిమాలో కూడా ముఖ్యమైన హీరోయిన్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తుండగా మేయిన్ హీరోయిన్ కోసం శృతి హాసన్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

అనంతపురం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరపైకి రానున్నట్లు టాక్. ఇక నేడు శృతిహాసన్ పుట్టిన రోజు కావడంతో చిత్ర యూనిట్ సభ్యులు ఒక ప్రత్యేకమైన పోస్టర్ కూడా విడుదల చేశారు. అందమైన పోస్టర్లో శృతిహాసన్ మరింత అందంగా కనిపిస్తోంది అని నెటిజన్లు చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. శ్రుతిహాసన్ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కనిపించబోతోంది.

బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తుండగా అతి ముఖ్యమైన పాత్ర కోసం శృతి హాసన్ ను సెలక్ట్ చేసుకున్నట్లు సమాచారం. దర్శకుడు గోపీచంద్ మలినేని ఇదివరకే శృతిహాసన్ తో రెండు సినిమాలు చేసిన అనుభవం ఉంది. మొదట మాస్ మహారాజా రవితేజ బలుపు సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Nbk 107 project latest update shruti hasan birthday pic viral

ఆ తర్వాత మళ్ళీ అదే కాంబినేషన్లో లో వచ్చిన క్రాక్ సినిమాలో కూడా శృతి హాసన్ మెయిన్ హీరోయిన్ గా నటించి హిట్ కాంబినేషన్ ను రిపీట్ చేసింది. వీరి కలయిక సక్సెస్ కావడంతో మరొకసారి గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు శృతిహాసన్ వెంటనే ఒప్పేసుకుంది.

నందమూరి బాలకృష్ణతో గోపిచంద్ చేస్తున్న మొదటి ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు మామూలుగా లేవు. ఇక కథ నచ్చడంతో శృతిహాసన్ NBK 107 ప్రాజెక్టు కోసం మొదటి సిట్టింగ్ లోనే శృతి హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇక ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమా కూడా ఉంది.

ఆ సినిమాలో ఒక సీరియస్ జర్నలిస్టుగా ఆమె కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. మరి ఈ సినిమాలతో శృతి హాసన్ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X