పొట్టి నిక్కరులో.. బటన్స్ తీసేసి కిక్కిచ్చిన బాలయ్య హీరోయిన్.. స్టన్నింగ్ లుక్!
సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా కంటే కూడా గ్లామరస్ బ్యూటీగా మంచి క్రేజ్ అందుకుంది. మోడల్ గా మొదలైన ఆమె ప్రయాణం నటనవైపు యూ టర్న్ తీసుకుంది. ఆమె తన నటనా నైపుణ్యంతో అద్భుతమైన గ్లామర్ తో విపరీతమైన ప్రజాదరణ పొందింది. సోషల్ మీడియాలో అయితే గ్లామర్ తోనే రోజురోజుకు తన ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటోంది. ఇక అమ్మడు ఇటీవల పోస్ట్ చేసిన ఒక ఫొటోను చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో: 2008లో జన్నత్ చిత్రంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది సోనాల్. మొదట్లోనే ఆమె ఇమ్రాన్ హష్మీతో కలిసి నటించడంతో బాలీవుడ్ లో మంచి క్రేజ్ అందుకుంది. ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ కావడంతో సోనాల్ తన నటనకు విస్తృతమైన ప్రశంసలు అందుకుంది. జన్నత్ విజయం తర్వాత, సోనాల్ చౌహాన్ అనేక హిందీ తెలుగు సినిమాల్లో కనిపించింది.

మంచి క్రేజ్ తీసుకొచ్చిన చిత్రాలు: ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చిన కొన్ని చిత్రాలలో బ్బుద్దా... హోగా టెర్రా బాప్, 3G అలాగే లెజెండ్ ఉన్నాయి. ముఖ్యంగా బాలకృష్ణతో చేసిన లెజెండ్ సినిమా ఈ బ్యూటీకి మంచి హైప్ తీసుకోచ్చింది.ఆ సినిమా తరువాత తెలుగులో అమ్మడికి కమర్షియల్ సినిమాలలో మరిన్ని ఆఫర్స్ వచ్చాయి. కానీ అమ్మడు తొందర పడకుండా కొంత డిఫరెంట్ సినిమాలను సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసింది.

అనేక ఫ్యాషన్ షోలలో: ఇక సోనాల్ కొన్ని మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపించింది. తన నటనా వృత్తితో పాటు, సోనాల్ చౌహాన్ ఫ్యాషన్ పరిశ్రమలో కూడా చురుకుగా కనిపిస్తూ ఉంటుంది. ఆమె అనేక ఫ్యాషన్ షోలలో కోసం ర్యాంప్‌పై అందంగా నడిచింది. అనేక ఫ్యాషన్ మ్యాగజైన్‌లలో కూడా ఫొటో షూట్స్ తో మెరిసింది. అలాగే అనేక ఫ్యాషన్ బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉంది.

చేదు అనుభవాలను దాటుకుంటు: ఇక సోనాల్ చౌహాన్ విజయ ప్రయాణం అంత సులభం కాదు. ఆమె మొదట్లో ఆడిషన్స్ లో పాల్గొన్నప్పుడు చేదు అనుభవాలను ఎదుర్కొంది. చిత్ర పరిశ్రమలో స్థిరపడటానికి చాలా కష్టపడిందట. అయితే ఆమె పట్టుదల, కృషి ఫలించడంతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ విషయాలను ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఇక సోనాల్ క్రేజ్ ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువగా పెరుగుతోంది.

లేటెస్ట్ స్టన్నింగ్ గ్లామరస్ లుక్: ఇక ఎప్పటికప్పుడు సోనాల్ చౌహన్ సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. ప్రతి ఫోటోలో కూడా తన గ్లామర్ హైలైట్ అయ్యే విధంగా అమ్మడు స్టిల్స్ ఇచ్చే విధానం కూడా హైలెట్ అవుతూ ఉంటుంది. ఇక రీసెంట్ గా అమ్మడు ఒక చొక్కాలో అలాగే చిన్న నిక్కరులో కనిపించిన విధానం కూడా ఫాలోవర్స్ కు మంచి కిక్ అయితే ఇచ్చింది.
అమ్మడి గ్లామర్ డోస్ మరింత ఎక్కువగా పనిచేస్తున్నట్లుగా అర్థమవుతుంది. గతంలో చాలాసార్లు సోనాల్ చౌహాన్ బికినీలో కూడా కనిపించింది. అయితే ఇటీవల ఆమె పోస్ట్ చేసిన ఈ ఫోటోలో మాత్రం అంతకంటే ఎక్కువ అందంగా ఉంది అని నెటిజన్స్ చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక సోనాల్ చౌహాన్ ఎలాంటి ఫోటో పోస్ట్ చేసిన కూడా వైరల్ అవుతుంది అని మరోసారి నిరూపించింది.


Click it and Unblock the Notifications











