డ్రగ్స్ కేసులో ట్విస్ట్: 24న రకుల్ ప్రీత్‌‌ విచారణకు హాజరుకావడం లేదు.. ఎందుకంటే

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రకుల్ ప్రీత్ సింగ్‌ విషయంలో ట్విస్టు చోటుచేసుకొన్నది. డ్రగ్ రాకెట్‌తో సంబంధాల విషయంలో విచారణకు హాజరుకావాలని బాలీవుడ్ అగ్ర తారలు సారా ఆలీ ఖాన్, శ్రద్దాకపూర్, దీపిక పదుకోన్, రకుల్ ప్రీత్ సింగ్‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమన్లు జారీ చేసింది. అయితే ఎన్సీబీ జారీ చేసిన సమన్లు రకుల్‌కు చేరకపోవడం ఈ కేసు దర్యాప్తులో ట్విస్టుగా మారింది. రకుల్ టీమ్ వెల్లడించిన ప్రకారం..

రకుల్‌తోపాటు మరో ముగ్గురికి సమన్లు

రకుల్‌తోపాటు మరో ముగ్గురికి సమన్లు

ఎన్సీబీ సమన్లు జారీ చేసిన ప్రకారం.. రకుల్ ప్రీత్ సింగ్, డిజైనర్ సైమన్ కంబట్టా సెప్టెంబర్ 24న, దీపిక పదుకోన్ సెప్టెంబర్ 25వ తేదీన విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. ఇక సారా ఆలీ ఖాన్, శ్రద్దా కపూర్‌కు సెప్టెంబర్ 26వ తేదీన విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. స్వయంగా ఎన్సీబీ అధికారులు సారా, శ్రద్దాకపూర్‌ నివాసాలకు వెళ్లి సమన్లు అందిచారు.

సమన్లు అందలేదు అంటూ రకుల్

సమన్లు అందలేదు అంటూ రకుల్

డ్రగ్స్ రాకెట్ కేసులో ఎన్సీబీ సమన్లు జారీ చేసినప్పటికి అవి తమకు అందలేదు. సమన్ల కోసం వేచి చూస్తున్నాం అని రకుల్ ప్రీత్ సింగ్ మేనేజర్ వెల్లడించారు. బుధవారం రోజు రకుల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో క్రిష్ దర్శకత్వంలోని ఓ సినిమా షూటింగులో పాల్గొన్నారు.

ముంబైకి చేరుకొన్న రకుల్ ప్రీత్ సింగ్

ముంబైకి చేరుకొన్న రకుల్ ప్రీత్ సింగ్

బాలీవుడ్ హీరోయిన్లతోపాటు తనకు సమన్లు జారీ చేశాయనే వార్తను జాతీయ, స్థానిక మీడియాలో జారీ చేసిన క్రమంలో రకుల్ వెంటనే హైదరాబాద్ నుంచి ముంబైకి బయలుదేరి వెళ్లినట్టు తెలిసింది. అయితే రకుల్ సమన్ల విషయంలో ఎన్సీబీ అధికారులు కూడా స్పందించారు.

కమ్యునికేషన్ గ్యాప్ వల్ల సమన్లు ఇవ్వలేకపోయాం

కమ్యునికేషన్ గ్యాప్ వల్ల సమన్లు ఇవ్వలేకపోయాం

డ్రగ్స్ కేసులో రకుల్‌ ప్రీత్ సింగ్‌కు సమన్లు అందించే ప్రయత్నం చేశాం. ముంబైలోని ఆమె నివాసంలోను అందించడానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. అలాగే మొబైల్ ఫోన్‌లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. అలాగే ఆమె నుంచి ఎలాంటి స్పందన మాకు రాలేదు అని ఎన్సీబీ అధికారులు పేర్కొన్నారు. ఇది కమ్యూనికేషన్‌లో ఓ చిన్న సమస్య కారణంగా సమన్లు అందిచడానికి వీలు కాలేదు. సెప్టెంబర్ 24వ తేదీన ఆమె విచారణకు హాజరుకారు అని తెలిపారు.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
సెప్టెంబర్ 24 కాదు.. సెప్టెంబర్ 25న రకుల్ విచారణ

సెప్టెంబర్ 24 కాదు.. సెప్టెంబర్ 25న రకుల్ విచారణ

అయితే ముంబై చేరుకొన్న తర్వాత సమన్లు స్వీకరించిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ముంబైలో లేని కారణంగా సమన్లు అందుకోలేకపోయాను. బుధవారం అర్ధరాత్రి ముంబై చేరుకొన్న తర్వాత సమన్లు అందాయి. సెప్టెంబర్ 24న కాకుండా, సెప్టెంబర్ 25వ తేదీన విచారణకు హాజరు అవుతున్నాను అని రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X