సుశాంత్ కేసులో ముదురుతున్న డ్రగ్స్ వివాదం.. సోదరుడితో చిక్కుల్లో పడిన రియా చక్రవర్తి
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు మిస్టరీని చెందించే క్రమంలో అనేక రకాల కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా డ్రగ్స్ వివాధాలపై ఇప్పుడు ఫోకస్ ఎక్కువైంది. నెపోటిజమ్ నుంచి రియా చక్రవర్తి వరకు అనేక రకాల ఆరోపణలు వచ్చిన క్రమంలో సుశాంత్ కేసులో డ్రగ్స్ కూడా కీలక అంశంగా మారింది. ఇక నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కూడా రియాకు మరో షాక్ ఇచ్చింది. అమే డ్రగ్స్ తీసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో అనేక రకాల ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.

నార్కోటిక్స్ రెయిడ్
ముఖ్యంగా రియా చక్రవర్తి డ్రగ్స్ డీలర్స్ తో సీక్రెట్ వాట్సాప్ చాట్ లీక్ అయ్యిందంటూ ఒక ప్రముఖ నేషనల్ మీడియా ఛానెల్ బయటపెట్టడం అందరిని షాక్ కి గురి చేసింది. ఇక ఫైనల్ గా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు చెందిన అధికారులు రియా చక్రవర్తి ఇంటిపై కొద్దీ సేపటి క్రితమే సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎన్‌డిపిఎస్ చట్టం నిబంధనల ప్రకారం ఇంటి శోధనను ఎన్‌సిబి నిర్వహిస్తోంది.

డ్రగ్ డీలర్ తో సంబంధం..
రియా అపార్ట్‌మెంట్‌పై ఒక్కసారిగా ఎన్‌సిబి ఉన్నతాధికారులు, మహిళా సిబ్బందితో పాటు సోదాలు నిర్వహించడంతో మరోసారి రియా పేరు నేషనల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రియాకు అలాగే డ్రగ్ డీలర్ కి మధ్య సంబంధం ఉన్నందువల్ల పక్కా ఆదారాలతోనే రేయిడ్స్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో రియా మాజీ మేనేజర్ శ్రుతి మోడీని కూడా విచారించారు.

రియా సోదరుడితో డ్రగ్ డీలర్..
ముంబైకి చెందిన డ్రగ్ పెడ్లర్ జైద్ విలాత్రాకు అలాగే రియా చక్రవర్తి సోదరుడైన షోయిక్ చక్రవర్తితో సంబంధం ఉందని ఎన్‌సిబి కనుగొంది. షోయిక్ చాట్ ప్రకారం మార్చ్ లోనే వారు 5 గ్రాములకు 10,000 చెల్లించి డ్రగ్స్ డీల్ సెట్ చేసుకున్నారని పలుమార్లు వీరు పర్సనల్ గా కలుసుకొని మాట్లాడుకున్నట్లు కూడా అధికారులు ఆధారాలతో కనుగొన్నారు. దీంతో ఒక్కసారిగా అధికారులు దాడులు నిర్వహించారు.
Recommended Video

ఇంట్లో ఎల్లప్పుడూ డ్రగ్స్..?
రియా సోదరుడు షోయిక్ ద్వారా ఎప్పుడూ తన ఇంట్లో డ్రగ్స్ ఉంచుకుంటారని, అలాగే సుశాంత్ మాదకద్రవ్యాలకు బానిసయ్యాడని ఊహాగానాలు కూడా వస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక మరోవైపు సీబీఐ అధికారులు కూడా కేసును అనేక కోణాల్లో విచారిస్తున్నారు. రియాను అలాగే వారి కుటుంబ సభ్యులను కూడా ఇటీవల వరుసగా కొన్ని రోజుల పాటు విచారించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











