ఆ ఫ్లాట్‌లోనే బాయ్‌ఫ్రెండ్‌తో రకుల్ ప్రీత్ సింగ్.. సమన్ల బుకాయింపుపై ఎన్సీబీ భారీ షాక్

డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాలున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరో సమస్యల్లో చిక్కుకున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు జారీ చేసిన సమన్లు అందలేదని రకుల్ చెప్పడంపై అధికారులు భగ్గుమన్నారు. తప్పుడు సమాచారంతో తమను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని ఎన్సీబీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను కూడా వివాదంలోకి లాగింది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

రకుల్ ప్రీత్ సింగ్ తప్పుదారి పట్టించేందుకు

రకుల్ ప్రీత్ సింగ్ తప్పుదారి పట్టించేందుకు

రకుల్ ప్రీత్ సింగ్ సమన్లు అందలేదనే విషయంపై ఎన్సీబీ ఉన్నతాధికారి కేపీఎస్ మల్హోత్రా స్పందించారు. హీరోయిన రకుల్ తమను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించారు. కరోనా పరిస్థితుల్లో తాము డిజిటిల్ రూపంలో సమన్లు జారీ చేయడమే కాకుండా ముంబైలోని రెండు నివాసాల్లో సమన్లు అందజేసే ప్రయత్నం చేశాం అని ఆయన అన్నారు.

సమన్లు అందలేదని బుకాయింపు

సమన్లు అందలేదని బుకాయింపు

రకుల్‌కు సమన్లు జారీ చేయడానికి మొబైల్ ఫోన్‌తోపాటు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ద్వారా ప్రయత్నించాం. పలు రకాలుగా ప్రయత్నించిన తర్వాత రకుల్ ప్రీత్ టీమ్ మాకు సమన్లు అందలేదని బుకాయించడంపై కేపీఎస్ మల్హోత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. సమన్లు డిజిటల్‌గా జారీ చేసినా ఆమె టీమ్ స్పందించలేదు అని అన్నారు.

ముంబైలోనా? హైదరాబాద్‌లోనా

ముంబైలోనా? హైదరాబాద్‌లోనా

ఎన్సీబీ అధికారులు ఫోన్‌లో సంప్రదిస్తే రకుల్ ప్రీత్ స్పందించలేదు. ముంబైలో ఉన్నారా? లేక హైదరాబాద్‌లో ఉన్నారా అనే విషయాన్ని ఆమె ధృవీకరించలేదు. ఒకవేళ ముంబైలో ఉంటే హెచ్ అండ్ ఎం అపార్ట్‌మెంట్‌లో ఉన్నారా? లేక గార్డెన్ అపార్ట్‌మెంట్‌లో ఉన్నారా అనే విషయాన్ని వెల్లడించలేదని ఎన్సీబీ పేర్కొన్నట్టు జాతీయ టెలివిజన్ ఛానెల్ రిపబ్లిక్ టీవీ కథనంలో పేర్కొన్నది.

మూడు నెలల నుంచి బాయ్‌ఫ్రెండ్‌తో అక్కడే

మూడు నెలల నుంచి బాయ్‌ఫ్రెండ్‌తో అక్కడే

రకుల్ ప్రీత్ సింగ్ మూడు నెలల క్రితం ముంబైలోని హెచ్ అండ్ ఎం అపార్ట్‌మెంట్‌లోకి మారారు. ఆమె తన ఫ్లాట్‌కు బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి రెగ్యులర్‌గా వెళ్లున్నారనే సమాచారం మా వద్ద ఉంది. అంతేకాకుండా తన బాయ్‌ఫ్రెండ్‌తో అక్కడే ఉంటుందనే సమాచారం కూడా మాకు తెలుసు. అందుకే ఆ ఫ్లాట్ వద్దకు వెళ్లి సమన్లు అందించాలని ప్రయత్నించాం. అంతేకాకుండా ఆమె వాట్సప్ ద్వారా కూడా సమన్లు పంపించాం అని కేపీఎస్ మల్హోత్రా పేర్కొన్నారు.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తాం

నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తాం

డ్రగ్స్ కేసు విచారణకు హాజరుకాకుండా తప్పించుకొనే ప్రయత్నాలు చేస్తే నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తామని రకుల్ ప్రీత్ సింగ్‌ను ఎన్సీబీ హెచ్చరించింది. సమన్లు అందలేదనే నెపంతో విచారణకు హాజరుకాకుండా ఆమె ప్రవర్తించడం చట్టరీత్యా నేరం. ఈ విషయంలో ఆమెను క్షమిస్తున్నాం. డిజిటల్ రూపంలో సమన్లు జారీ చేసినప్పటికీ ఆమె అబద్దాలు ఆడటం దురదృష్టకరం అని కేపీఎస్ మల్హోత్రా పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X