‘పెళ్లి కాకుండానే స్టార్ క్రికెటర్‌తో బిడ్డకు జన్మనిచ్చా.. ఆ కారణంగానే బ్రేకప్ చెప్పా’

సినీ తారలకు, క్రికెటర్లకు మధ్య సంబంధాలు ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉన్నాయి. సినీ స్టార్స్‌తో క్రికెటర్లు డేటింగ్ చేయడం, క్రికెటర్లతో అందాల భామలు అఫైర్లు నడపడం 70 దశకం నుంచే కొనసాగుతున్నాయి. సైఫ్ ఆలీ ఖాన్ తల్లిదండ్రులు మన్సూర్ ఆలీ ఖాన్ పటౌడీ, షర్మిలా టాగూర్ లాంటి ప్రముఖులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం అప్పట్లో సంచలనం రేపింది.

అయితే వారి దారిలోనే చాలా మంది క్రికెటర్లు, సినీ తారల మధ్య అఫైర్లు డేటింగ్ వ్యవహారాలు తెరపైకి వచ్చాయి. కానీ పెళ్లి వరకు రాకుండానే ఆగిపోయాయి. అలాంటి కోవలో రవిశాస్త్రి, అమృతా సింగ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. అయితే వీరిందరికి భిన్నంగా నీనా గుప్తా, వివ్ రిచర్డ్స్ ప్రేమ కథ, డేటింగ్ వ్యవహారంలో చాలా ట్విస్టులు ఉన్నాయి. తాజాగా ఆమె నటించిన వధ్ 2 అనే సినిమా ప్రమోషన్స్‌లో వివ్ రిచర్డ్స్‌తో బంధం గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. జర్నలిస్ట్ శుభాంకర్ మిశ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నీనా గుప్తా చెప్పిన విషయాల్లోకి వెళితే..

Neena Gupta Relationship with Viv Richards

క్రికెట్ ప్రపంచాన్ని వెస్టిండీస్ గడగడ లాడిస్తున్న రోజుల్లో ఆ జట్టుకు కెప్టెన్ వివియన్ రిచర్డ్స్ బ్యాటింగ్, స్టైల్, యాటిట్యూడ్ అంటే క్రికెట్ అభిమానులందరికీ ఇష్టంగా ఉండేది. అలాంటి డాషింగ్, డేరింగ్ క్రికెటర్‌తో నీనా గుప్తా లవ్‌లో పడింది. ఆ తర్వాత ఇద్దరు చాలా కాలం డేటింగ్ చేశారు. 80వ దశకంలో ఆ ఇద్దరి ప్రేమకథ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే మీడియా కథనాలు పట్టించుకోకుండా తమ లివింగ్ టుగెదర్ లైఫ్‌ను కొనసాగించారు.

వివ్ రిచర్డ్స్‌తో బంధం గురించి నీనా గుప్తా మాట్లాడుతూ.. ఆ సమయంలో ఆయనంటే పిచ్చి ప్రేమ. గుడ్డిగా ప్రేమలో పడ్డాను. నా స్నేహితులు, సన్నిహితులు, పేరెంట్స్ చెప్పినా వినలేదు. ఆయనతో పెళ్లి కాకుండానే బిడ్డను కనాలని అనుకొన్నాను. ఆ విషయం గురించి వివ్‌ను అడిగితే.. నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అని అన్నాడు. దాంతో మేము ముందుకు వెళ్లి బిడ్డకు జన్మనిచ్చాం. మసాబా గుప్తా జననం వెనుక అసలు కథ అదే అంటూ నీనా గుప్తా చెప్పారు.

Neena Gupta Relationship with Viv Richards

అయితే వివ్ రిచర్డ్స్‌కు నేనంటే ప్రేమ.. నాకు ఆయనంటే ప్రేమ. కానీ మేము పరస్పర అంగీకారంతో విడిపోయాం. ఆయన తన కెరీర్, వెస్టిండీస్‌ను వదులుకొని ఇండియాకు రాలేడు. నేను ఇండియాను వదిలి ఆయన కోసం వెళ్లలేను. ఆ కారణంగానే మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకొన్నాం. అలా ప్రాక్టికల్‌గా ఆలోచించి బ్రేకప్ చెప్పుకొన్నాం అని నీనా గుప్తా చెప్పారు.

అయితే మసాబా గుప్తా నా సంరక్షణలోనే పెరిగింది. ఆమె పోషణ బాధ్యతలన్నీ నేనే నా సొంత డబ్బులతో చూసుకొన్నాను. వివ్ నుంచి ఎలాంటి డబ్బు ఆశించలేదు. నా తల్లిదండ్రులను కూడా ఆర్థికంగా సహాయం అడగలేదు. ఆ విషయంలో నేను గర్వంగా ఫీలవుతాను. మసాబాకు ఎలాంటి లోటు రాకుండా నేను చూసుకొన్నాననే సంతృప్తి ఇప్పటికీ ఉంది అని నీనా గుప్తా అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X