66 ఏళ్ల వయసులో తల్లికాబోతోన్న హీరోయిన్? ఈ ఏజ్‌లోనూ అది కావాలంటూ నటి రియాక్షన్

తన మాటలు, చేతలతో నిత్యం వార్తల్లో ఉండేవారు సినీ పరిశ్రమలో ఎంతోమంది ఉన్నారు. వీరు ఏం చేసినా అది వివాదంలా మారుతుంది. ఈ కోవలోకే వస్తారు సీనియర్ నటి నీనా గుప్తా. ఈ ఏజ్‌లోనూ యాక్టీవ్‌గా ఉంటూ కుర్ర హీరోయిన్లకు పోటీ వస్తున్నారు ఈ ముదురుభామ. 70కి చేరువ అవుతున్నా ఇప్పటికీ హాట్ హాట్ ఫోటో షూట్‌లతో తగ్గేదే లేదని అంటుంటారు నీనా. మనసులో ఏం దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం నీనా గుప్తా స్టైల్. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

బెంగాల్‌కు చెందిన నీనా గుప్తా ఢిల్లీలో పెరిగారు. 1982లో సాథ్ సాథ్ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన ఆమె నాటి నుంచి నుంచి వరకు దాదాపు 44 ఏళ్లుగా నటిస్తూనే ఉన్నారు. హిందీతో పాటు ఒడియా, మలయాళం భాషలలో నటించారు. వెండితెరతో పాటు బుల్లితెరపైనా పలు సీరియల్స్, సిరీస్‌లలో నటించి దర్శకురాలిగానూ సత్తా చాటారు. అయితే నీనా గుప్తా.. వ్యక్తిగత జీవితం మాత్రం వివాదాలమయం. తొలుత అమ్లాన్ కుసుమ్ ఘోష్‌తో నీనా గుప్తా పెళ్లి జరిగింది. వీరి కాపురం కొన్నాళ్లకే పెటాకులైంది.

Neena Gupta Reacts to Pregnancy Rumours at 66 Says I m Not Pregnant It s Just the Saree

అనంతరం సారంగ్‌దేవ్ పండిట్‌‌తో ప్రేమాయణం నడిపారు. ఇక వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్‌తో నీనా ప్రేమాయణం క్రికెట్, సినీ రంగాలను కుదిపేసింది. ఆయన కారణంగా గర్బం దాల్చిన నీనా గుప్తా.. మసాబా గుప్తాకు జన్మనిచ్చారు. అయితే రిచర్డ్స్‌ను పెళ్లి చేసుకోకుండా ఒంటరి తల్లిగానే జీవితాన్ని కొనసాగించారు. ఒంటరి తల్లిగానే తన కుమార్తెను పెంచి పెద్ద చేశారు. 2008లో 40 ఏళ్ల వయసులో ఢిల్లీకి చెందిన వివేక్ మెహ్రాను పెళ్లి చేసుకుని కలకలం రేపింది నీనా గుప్తా.

దేశంలో మహిళ హక్కులు, సమానత్వం, మహిళా సాధికారత వంటి అంశాలపై గళమెత్తే అతికొద్దిమంది సినీ ప్రముఖులలో నీనా గుప్తా కూడా ఒకరు. కొద్దిరోజుల క్రితం కన్యత్వ పరీక్షల గురించి ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇప్పటికే దేశంలో చాలా మంది పురుషులు తమకు కాబోయే భార్య కన్యగానే ఉండాలని కోరుకుంటున్నారని నీనా బాంబు పేల్చారు. బాగా చదువుకుని అభ్యదయ భావాలు ఉన్నట్లుగా నటించే మగాళ్ల మైండ్ సెట్ కూడా ఇలాగే ఉందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా 66 ఏళ్ల వయసులో నీనా గుప్తా తల్లికాబోతోందని వార్తలు చక్కర్లు కొట్టాయి.

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నలు ఫిబ్రవరి 26వ తేదీన వివాహ బంధం ద్వారా ఒక్కటైన సంగతి తెలిసిందే. అనంతరం మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన నీనా గుప్తా.. విజయ్, రష్మికలను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. వీటిలో నీనా కాస్త బొద్దుగా ఉండి.. పొట్ట భాగం ఎత్తుగా కనిపించడంతో అది బేబీ బంప్ అంటూ సోషల్ మీడియాలో పుకార్లు వైరల్ అయ్యాయి. 66 ఏళ్ల వయసులో నీనా తల్లికాబోతోందంటూ సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోలింగ్ జరిగింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

ఈ ట్రోలింగ్ నేపథ్యంలో నీనా గుప్తా స్పందించారు. ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. నేను గర్భవతిని కాదు, నేను ధరించిన ఐవరీ చీర ఫ్యాబ్రిక్ చాలా మందంగా ఉంది. దానిని కట్టుకోవడం వల్ల నేను కాస్త బొద్దుగా కనిపించాను. దానిని చూసి నేను నెల తప్పానని భావించడం ఆశ్చర్యంగా ఉంది. ఈ పుకార్లు నన్ను బాధించడానికి బదులు, నవ్వు తెప్పిస్తున్నాయి. ఈ ఏజ్‌లోనూ నేను గర్భంగా దాల్చినట్లు పుకార్లు రావడంతో బాగుంది, ఇలాంటి నాకు కూడా చాలా ఇష్టం అంటూ నీనా గుప్తా వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నీనా క్లారిటీతోనైనా ఈ రూమర్స్‌కు చెక్ పడుతుందేమో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X