ఈ రాత్రి నాతో గడిపితే ఆఫర్ ఇస్తా.. టాలీవుడ్ నిర్మాత అరాచకం.. సుభాష్ ఘాయ్, డేవిడ్ ధావన్ తీరుపై నీనా గుప్తా ఫైర
ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా తన ఆత్మకథ సచ్ కహా తో అనే పుస్తకంలోని అంశాలు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బాలీవుడ్, దక్షిణాది నిర్మాత, దర్శకులు తనతో వ్యవహరించిన తీరును కుండ బద్దలు కొట్టినట్టు నీనా గుప్తా తన పుస్తకంలో వెల్లడించింది. సచ్ కహా తో పుస్తకంలో వెల్లడించిన క్యాస్టింగ్ కౌచ్ ఉదంతం ఏమిటంటే...

జీవితాన్ని వెంటాడే సంఘటనలు
సినిమా పరిశ్రమలో నాది పూలబాట కాదు. ఇండస్ట్రీలో స్థిరపడటానికి ఎన్నో ముళ్ల దారులను తప్పించుకొవాల్సి వచ్చింది. ఎన్నో చేదు అనుభవాలను దాటుకొంటు వచ్చాను. కొన్ని ఆవేదన కలిగిస్తే.. మరి కొన్ని నాకు కంటతడి పెట్టించాయి. దాదాపు 40 ఏళ్ల ప్రయాణంలో జీవితాన్ని వెంటాడే సంఘటనలు నా కెరీర్‌లో చోటు చేసుకొన్నాయి అని నీనా గుప్తా తన ఆత్మకథలో పేర్కొన్నారు.

దక్షిణాది నిర్మాత నుంచి కాల్
ఒక రోజు పృథ్వీ థియేటర్‌లో నా ఫెర్ఫార్మెన్స్ ముగించుకొన్న తర్వాత నాకు దక్షిణాదికి చెందిన ప్రముఖ నిర్మాత నుంచి నాకు కాల్ వచ్చింది. ఆయన చెప్పిన హోటల్ ఫృథ్వీ థియేటర్‌కు దగ్గరగానే ఉండటంతో ఆ హోటల్‌కు వెళ్లి కలిసేందుకు వెళ్లాను. నా గదిలోకి రమ్మని నిర్మాత అదో రకంగా మాట్లాడటంతో నాకు అనుమానం వచ్చింది అని నీనా గుప్తా తెలిపారు.

హోటల్ గదిలోకి రమ్మని...
అయితే నిర్మాత హోటల్ గదిలోకి రావాలని బలవంతం చేయడంతో తొలుత నేను లోనికి వెళ్లడానికి ప్రయత్నించాను. కానీ నా మనసు ఒప్పుకోలేదు. వెంటనే ఆయనకు ఫోన్ చేసి హోటల్ లాబీలోకి రమ్మని కోరాను. అక్కడే మాట్లాడుకొందామని చెప్పాను. అయితే ఆయన గదిలోకి రమ్మనమని చెప్పడంతో ఆఫర్ చేజారుతుందనే ఉద్దేశంతో హోటల్ రూమ్‌లోకి వెళ్లాను అని నీనా గుప్తా వెల్లడించారు.

ఎంతో మంది హీరోయిన్లను..
కానీ రూంలోకి వెళ్లగానే తను ఎంతో మంది హీరోయిన్లను వెండితెరకు పరిచయం చేశాను అని చెబుతుంటే.. మీరు తీయబోయే సినిమాలో నా రోల్ ఏమిటని అడిగాను. దాంతో ఆయన హీరోయిన్ ఫ్రెండ్ రోల్ అని చెప్పాడు. దాంతో ఒకే... ఇక నేను బయలుదేరుతా.. నా కోసం నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారని చెప్పడంతో సదరు నిర్మాత షాక్ అయ్యారు.

ఈ రాత్రికి నాతో గడపవా? అంటూ
హోటల్ రూమ్ నుంచి బయటకు వస్తుంటే.. ఈ రాత్రి నాతో గడపవా? అంటూ ప్రశ్నించాడు. అందుకు నేను ఒప్పుకోకపోవడంతో.. నిన్ను నేను బలవంతం చేయను. నీకు ఇష్టమైతే నాతో రాత్రంతా ఈ హోటల్‌లో గడుపు అని నిర్మాత అన్నారు. దాంతో నేను ఆయన ఆఫర్‌ను రిజెక్ట్ చేసి బయటకు వచ్చాను అని నీనా గుప్తా తెలిపారు.

ఖల్ నాయక్ షూటింగులో
అలాగే సంజయ్ దత్ నటించిన ఖల్ నాయక్ సినిమా షూటింగులో కూడా దర్శకుడు సుభాష్ ఘాయ్ కూడా నన్ను వేధించాడు. చోలీ కే పీచే క్యా హై పాట షూటింగ్ సందర్భంగా చాలా హెవీగా ప్యాడింగ్ చేసిన బ్రాను ధరించమని నన్ను బలవంతం పెట్టారు. అందరి ముందు అవమానించే మాదిరిగా మాట్లాడటంతో నేను కంటతడి పెట్టుకొన్నాను అని నీనా గుప్తా తెలిపారు.
Recommended Video

డేవిడ్ ధావన్ కూడా వేధిస్తే...
ఇక మరో బాలీవుడ్ సినిమా షూటింగులో కూడా దర్శకుడు డేవిడ్ ధావన్ కూడా నన్ను వేధించాడు. ఆయన వేధింపులు తట్టుకోలేక యూనిట్ సభ్యులందరూ ఉండగానే భోరుమని ఏడ్చాను. ఆ సమయంలో జుహీ చావ్లా వచ్చి నన్ను ఓదార్చారు. ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి అని నీనా గుప్తా చెప్పారు.


Click it and Unblock the Notifications











