ఉప్పొంగే అందాలతో మత్తెక్కిస్తోన్న చిరుత బ్యూటీ .. టాప్ యాంగిల్‌లో హాట్ ఫోజులు

అభినయం కంటే గ్లామర్ షోతో బండి నెట్టుకొచ్చే కొందరు హీరోయిన్లు కొందరు భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్నారు. వీరికి యాక్టింగ్‌తో పనిలేదు.. స్కిన్ షోతోనే స్టార్ డమ్ సంపాదిస్తుంటారు. కానీ కొందరు మాత్రం ఎంతంగా అందాలు ఆరబోసినా వర్కవుట్ కాదు. ఈ కోవలోకే వస్తారు నేహా శర్మ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ డెబ్యూ మూవీ చిరుతతో తెలుగు వారిని మెరుపులా పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత మళ్లీ కనిపించలేదు.

21 నవంబర్ 1987లో బీహార్‌లో భాగల్‌పూర్‌లో జన్మించారు నేహా శర్మ. స్థానికంగా విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకున్నారు. దీనికి అనుగుణంగానే న్యూఢిల్లీలోని ప్రఖ్యాత నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్‌టీ)లో చదుకున్నారు. అయితే చిన్నతనంలో ఆస్తమా సహా ఇతర అనారోగ్యంతో బాధపడ్డారు నేహా. ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి ఆమెకు చాలా ఏళ్లే పట్టిందట.

Neha Sharma PhotoShoot with two piece bikini at swimming pool Her latest photos here

భారతదేశ శాస్త్రియ నృత్యాల్లో ఒకటైన కథక్‌లో నేహా శర్మ ప్రావీణ్యురాలు. అలాగే హిప్ హాప్, సల్సా, జాజ్ వంటి వెస్ట్రన్ డ్యాన్స్ కూడా అద్భుతంగా చేయగలదు. లండన్‌లోని ప్రఖ్యాత పైనాపిల్ డ్యాన్స్ స్కూల్‌లో ఆమె వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకున్నారు. 2007లో మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రాంచరణ్‌ను అరంగేట్రం చేయించాలని భావించారు. దీనికి సంబంధించిన బాధ్యతను పూరి జగన్నాథ్ చేతుల్లో పెట్టారు.

చిరంజీవి కొడుకు ఎంట్రీ మూవీ అంటే మామూలుగా ఉండకూడదు కదా. దానికి తగినట్లుగానే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు పూరి జగన్నాథ్. ముఖ్యంగా హీరోయిన్‌ ఎవరన్న దానిపై చాలా పేర్లు వినిపించగా .. నేహా శర్మ ఈ ఛాన్స్ కొట్టేశారు. ఇందులో యాటిట్యూడ్ చూపించే డబ్బున్న యువతి క్యారెక్టర్‌లో నేహా శర్మ ఆకట్టుకున్నారు. ఆమె నటన, బాడీ లాంగ్వేజ్ ఆ క్యారెక్టర్‌కు బాగా సెట్ అయ్యింది. చిరుత విజయం సాధించడంతో నేహా కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుందని అంతా భావించారు.

చిరుత తర్వాత నేహా శర్మకు వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కుర్రాడులో ఆఫర్ దక్కింది. అయితే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో టాలీవుడ్‌కు ఆమె దూరమైంది. తర్వాత హిందీలో అడుగుపెట్టినప్పటికీ బాలీవుడ్‌లోనూ నేహా శర్మకు కలిసి రాలేదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 17 ఏళ్లు కావొస్తున్నా ఆమెకు చెప్పుకోదగ్గ బ్రేక్ దగ్గలేదు. హిందీతో పాటు తమిళ్, మలయాళం, పంజాబీ చిత్రాలే కాకుండా మాండరిన్ భాషలోనూ నేహా శర్మ నటించారు. 2023లో నాని హీరోగా వచ్చిన హాయ్ నాన్నలో మోడల్‌గా గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు నేహ.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే నేహా శర్మ ఎప్పటికప్పుడు తన సినిమాలు , వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రాళ్లను రెచ్చగొడుతుంటారు. తాజాగా యెల్లో కలర్ బికినీ వేసుకుని స్విమ్మింగ్ పూల్‌లో జలకాలు ఆడారు నేహా శర్మ. ఎద అందాలు దానిపై లాకెట్ కనిపించేలా టాప్ యాంగిల్‌లో ఫోజులిస్తూ వింటర్‌లోనూ సెగలు రేపుతున్నారు. ప్రస్తుతం నేహా శర్మ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: neha sharma movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X