11ఏళ్ళ తరువాత మళ్ళీ తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న చిరుత పాప!
కొంతమంది హీరోయిన్స్ అదృష్టం ఏమిటో గాని ఎంత అందంగా ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్ గా క్లిక్కవ్వలేరు. గ్లామర్ విషయంలో అలాగే నటనలో మంచి క్రేజ్ అందుకున్నప్పటికి సరైన అవకాశాలు దొరక్క ఊహించని విధంగా మాయమవుతుంటారు. ఇక 11 ఏళ్ళ క్రితం తెలుగులో కాస్త హడావుడి చేస్తూ అప్పుడే మాయమైన నేహా శర్మ మళ్ళీ టాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత సినిమాలో గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్న నేహా శర్మ ఆ సినిమాలో రిచ్ పాపగా చేసిన యాక్టింగ్ కి మంచి గుర్తింపు దక్కింది. కానీ ఎందుకో గాని ఈ బ్యూటీకి సరైన ఛాన్సులు అందలేదు. ఆ తరువాత వరుణ్ సందేశ్ తో కుర్రాడు అనే సినిమా చేసింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అనంతరం తెలుగులో మళ్ళీ సినిమా చేయలేదు.

బాలీవుడ్ లోనే గ్లామర్ రోల్స్ చేస్తూ ఇన్నాళ్లు బాగానే నెట్టుకొచ్చింది. కేవలం హీరోయిన్ గానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తోంది. ఇక ఇన్నాళ్లకు అమ్మడు తెలుగులో కూడా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ కి చెందిన మూడు ప్రొడక్షన్ హౌజ్ ల నుంచి వచ్చిన ఆఫర్స్ కి నేహా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
అలాగే వెబ్ కంటెంట్ లు చేయడానికి కూడా ఈ బ్యూటీ సిద్ధమవుతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో ఈసారి తెలుగు సినిమాలతోనే సక్సెస్ కొట్టి మళ్ళీ సౌత్ లో బలంగా నిలదొక్కుకోవాలని చూస్తోంది. మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో నేహా ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











