Neha Sharma: సోదరితో కలిసి రామ్ చరణ్ హీరోయిన్ అందాల రచ్చ.. బికినీ కంటే ఘాటుగా..
కొంతమంది హీరోయిన్స్ దురదృష్టం ఏమిటో కానీ మొదట్లో చాలా మంచి అవకాశాలు అందుకుంటూ ఆ తర్వాత మెల్లగా ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు. ఇక ఆ తరహాలో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నేహా శర్మను వచ్చిన కొత్తలో అయితే చాలా అదృష్టవంతురాలు అని అందరూ అనుకున్నారు. కానీ ఈ బ్యూటీ బ్యాడ్ లక్ వలన ఎక్కువకాలం స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకోలేకపోయింది. ఇంకా స్టార్ హోదా ఉన్నా లేకపోయినా కూడా ఈ బ్యూటీ తన గ్లామర్ తో మాత్రం ఎప్పటికప్పుడు మంచి క్రేజ్ అందుకుంటుంది. ఇక రీసెంట్ గా మరోసారి తన సిస్టర్ తో కలిసి ఘాటైన ఫోటోషూట్ లో పాల్గొంది. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట్లో లక్కీ అనుకున్నారు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన మొట్టమొదటి సినిమా చిరుత సినిమాలో నటించిన నేహా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ బ్యూటీ చాలా అదృష్టవంతురాలు అని అప్పట్లో చాలా కథనాలు వచ్చాయి. ఎందుకంటే మెగా హీరో ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో తప్పకుండా అమ్మడు భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటుంది అని అనుకున్నారు. కానీ ఆ సినిమా తప్పితే మల్లి ఆమెకు తెలుగులో నటించే అవకాశం రాలేదు.

నేహా చేసిన పొరపాటు
ఇక చిరుత సినిమా సక్సెస్ అయినప్పటికీ కూడా నేహా శర్మకు మొదట్లో అంతగా పెద్ద హీరోలతో అయితే అవకాశాలు రాలేదు. అయితే మీడియం రేంజ్ హీరోలతో మాత్రం ఆమెకు నటించే అవకాశాలు కొన్ని వచ్చాయి. కానీ ఆమె తొందరపాటు నిర్ణయాల వలన అవి మిస్ అయ్యాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చేయాలని అనుకుని అతిగా ఆలోచించి కొన్ని కమర్షియల్ సినిమాలను కూడా ఆమె వదిలేసుకుంది.

దెబ్బ పడిన తరువాత
కొన్నిసార్లు కమర్షియల్ సినిమాలు కూడా హీరోయిన్స్ కు చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. కానీ ఈ బ్యూటీ తన పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగా ఉండాలి అని అనవసరపు కండిషన్స్ పెట్టి మొదట్లో చాలా కమర్షియల్ సినిమాలను కూడా వదిలేసుకుంది. ఇక ఆ దెబ్బ పడిన తర్వాత కూడా ఈ బ్యూటీ హిందీలో మాత్రం నిలదొక్కుకునే ప్రయత్నం చేసింది. ఇక తెలుగులో వరుణ్ సందేశ్ తో కుర్రాడు అనే సినిమా చేసిన తర్వాత మళ్లీ పెద్దగా హైలెట్ అయ్యింది లేదు.

సోదరి కూడా..
ఇక తెలుగులో అవకాశాలు వచ్చినా రాకపోయినా కూడా హిందీలో మాత్రం నేహా శర్మ అప్పుడప్పుడు సినిమాలు చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక ఆమె సోదరీ ఐషా శర్మ కూడా మోడలింగ్లో ఉండడంతో ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆమె మొదట నటించిన బాలీవుడ్ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. అయినప్పటికీ కూడా సోదరి తరహాలోనే గ్లామర్ తో హీటెక్కిస్తోంది.

ఘాటైన ఫొటో షూట్
ఇక వీరిద్దరూ కలిసి ఫోటోషూట్స్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరోసారి ఒక మ్యాగజైన్ కోసం ఇద్దరు కలిసి బికినీ కంటే హై డోస్ లో ఉండే విధంగా గ్లామర్ లుక్ తో ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా ఐషా శర్మ అయితే క్లివెజ్ అందాలతో మరోసారి స్టన్ అయ్యేలా చేసింది. ఈ బ్యూటీలు ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా వైరల్ అవుతుంది అని మరోసారి నిరూపించారు. ఇక ప్రస్తుతం అయితే నేహా శర్మ ఒక వెబ్ సిరీస్ లో నటించేందుకు అడుగులు వేస్తోంది.


Click it and Unblock the Notifications











