Neha Shetty: చిలుకపచ్చ చీరలో నేహా శెట్టి - ఘాటు అందాలు చూపిస్తూ హీటెక్కిస్తోంది!
నేహా శెట్టి.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు. 2018లో మెహబూబా సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ క్యూట్ బ్యూటీ తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించి మెప్పించింది. ఇక డీజే టిల్లు సినిమాలో రాధికగా కనిపించిన ఈ హాట్ బ్యూటీ తన అందంతో అందరినీ కవ్వించింది. సిద్ధూ జొన్నలగడ్డతో ఫుల్ రొమాన్స్ చేసి కుర్రకారు హాట్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత బెదురులంక, రూల్స్ రంజన్ చిత్రాల్లోనూ నటించి తనదైన మార్కును చూపించింది.
ఓ వైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఫొటోలు మాత్రమే కాకుండా తనకు సంబంధించిన సినీ అప్ డేట్లతో పాటు పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా వెల్లడిస్తుంటుంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అందమైన ఫొటోలను షేర్ చేసింది. చిలుక పచ్చ రంగు చీర కట్టుకున్న ఈ చిన్నది హాట్ హాట్ యాంగిల్స్ లో ఫొటోలు దిగింది.

అదిరిపోయే ఫోజులు ఇస్తూ.. అందాలన్నీ ఆరబోసింది. నేహా శెట్టి షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి. సింపుల్ గా ఉండే గ్రీన్ కలర్ చీరలో నేహా చాలా హాట్ గా కనిపిస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకొని క్లీవేజ్ షో చేసింది రాధిక. అలాగే జర్మన్ సిల్వర్ ఇయర్ రింగ్స్, గాజులు వేసుకొని చాలా స్టైలిష్ లుక్ లో దర్శనం ఇచ్చింది. నెట్టెడ్ చీర కట్టుకున్న ఈ ముదదుగుమ్మ పైనుంచి కింద వరకు అందాలన్నీ కనిపించేలా ఫొటోలు దిగింది. ఈమె ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల్లో లైకులు వచ్చాయి.
నేహా శెట్టి 1999లో డిసెంబలర్ ఆరో తేదీన బెంగళూరులో జన్మించింది. ఈమె తల్లి ఓ డెంటిస్ట్. తండ్రి బిజినెస్ మ్యాన్. ఈ క్యూట్ బ్యూటీకీ అందమైన చెల్లెలు కూడా ఉంది. 2014లో మిస్ మంగళూరుగా ఎంపికైంది. ఈ తర్వాతే న్యూయార్క్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో నటనలో శిక్షణ తీసుకుంది. ఇక ఆ తర్వాత తన మాతృభాష కన్నడలో ముంగారు మేల్ 2సినిమాతో తెరంగ్రేటం చేసింది. ఆ తర్వాత గ్రేట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కంట పడగా... మెహబూబా సినిమాలో ఛాన్స్ ఇచ్చి టాలీవుడ్ కు పరిచయం చేశారు.

ఇక ఆ తర్వాత నుంచి నేహా శెట్టి తన అందం, అభినయంతో ఛాన్సులు దక్కించుకుంటూ.. ముందుకెళ్తోంది. చేసినవి కొన్ని సినిమాలే అయినా ఆమె తన మార్కును చూపిస్తోంది. ముఖ్యంగా నెట్టింట గ్లామర్ షో చేస్తూ.. కుర్రకారుకు ఫీవర్ తెప్పిస్తుంటుంది. తన అందాన్ని ఎరగా వేస్తూ.. అవకాశాలను దక్కించుకోవాలని చాలానే ప్రయత్నాలు చేస్తోంది. మరి చూడాలి ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ గా మారుతుందా లేదా అనేది.


Click it and Unblock the Notifications











