సోకులతో మంటపెట్టేస్తున్న టిల్లూగాడి గర్ల్‌ఫ్రెండ్ .. హాఫ్ శారీలో జిగిల్‌మనేలా!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు డామినేషన్ అంతా కన్నడ బ్యూటీలదే. ఇప్పుడే కాదు.. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు శాండిల్‌వుడ్ హీరోయిన్లు టాలీవుడ్‌ను మహారాణుల్లా ఏలారు. సౌందర్య, అనుష్క శెట్టి, కృతి శెట్టి, ఆషిక రంగనాథ్, శ్రీలీల వంటి వారి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి బాటలోనే తెలుగు ఇండస్ట్రీలో వెలిగిపోవడానికి వచ్చింది నేహా శెట్టి.
కర్ణాటకలోని మంగుళూరులో పుట్టిన నెహాశెట్టి అక్కడే పెరిగారు. తల్లి డెంటిస్ట్ కాగా, తండ్రి వ్యాపారవేత్త. ఈమెకు ఒక చెల్లి కూడా ఉంది. చిన్న వయసులోనే మోడలింగ్‌లో దిగిన నేహా శెట్టి 2014లో మిస్ మంగళూరుగా కిరీటాన్ని దక్కించుకున్నారు. అలాగే 2015లో మిస్ సౌతిండియా పోటీల్లో రన్నరప్‌గా నిలిచారు . మోడల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నేహాశెట్టికి సినిమాల్లోనూ అవకాశాలు వెల్లువెత్తాయి.

కన్నడ చిత్రం ముంగరు మేల్ 2 చిత్రం ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన నేహా శెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ దశలో ఎంతో మంది అందగత్తెలను, ప్రతిభ గల అమ్మాయిలను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన పూరి జగన్నాథ్ కళ్లలో నేహ పడింది. దీంతో ఆయన దర్శకత్వంలో వచ్చిన మెహబూబాలో ఆమకు హీరోయిన్‌గా అవకాశం కల్పించారు పూరి. ఆ తర్వాత మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌లో సెకండ్ హీరోయిన్ రోల్‌లో నటించారు నేహా.
ఈ క్రమంలో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన డీజ టిల్లు మూవీ నేహా శెట్టి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో రాధికగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన నేహా .. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇందులో లిప్ లాక్ సీన్స్‌లో రెచ్చిపోవడంతో పాటు తన పుట్టుమచ్చల గురించి పెద్ద కాంట్రవర్సీ కూడా జరిగింది. అనంతరం బెదురులంక, రూల్స్ రంజన్ సినిమాలలో నటించినా అవి నిరాశపరిచాయి.
డీజే టిల్లూకు సీక్వెల్‌గా టిల్లూ స్వ్కేర్ రూపొందినా అందులో ఆమెకు హీరోయిన్‌గా అవకాశం దక్కలేదు. ఈమెకు బదులుగా అనుపమ పరమేశ్వరన్ ఫిమేల్ లీడ్ దక్కించుకుని తన కెరీర్‌లో భారీ విజయాన్ని వేసుకున్నారు. కాకపోతే నేహాకు మాత్రం ఓ గెస్ట్ రోల్ ఇచ్చారు మేకర్స్. తర్వాత విష్వక్‌సేన్ హీరోగా వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిపై నేహాశెట్టి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా స్టేజ్‌పై విష్వక్‌తో కలిసి చేసిన రొమాంటిక్ డ్యాన్స్ వివాదాస్పదమైంది.
అయితే 2025లో ఆమె మరో కొత్త సినిమాకు కమిట్ కాలేదు. అయితే స్టోరీ డిస్కషన్స్‌లో నేహా ఉన్నట్లు.. త్వరలోనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే నేహా శెట్టి.. ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా మెరుపుల డ్రెస్‌లో ఎద, నడుము అందాలను చూపిస్తూ ఆమె చేసిన ఫోటో షూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. మరి ఇంకేందుకు ఆలస్యం నేహాశెట్టి అందాలను మీరూ చూసేయండి.


Click it and Unblock the Notifications











