Neha Shetty Song in OG: నేహాశెట్టి రెమ్యునరేషన్ ఎంత? ఓజీలో స్పెషల్ సాంగ్ ఎక్కడ షూట్ చేశారంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ (OG) చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజై 300 కోట్ల మైలురాయి వైపు పరుగులు పెడుతున్నది. ఈ సినిమా ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకొని భారీ లాభాల వైపు దూసుకుపోతున్నది. అయితే పవర్ స్టార్ అభిమానుల డిమాండ్ మేరకు ఈ సినిమాలో తాజాగా ఓ స్పెషల్ సాంగ్‌ను జోడించారు. ఈ పాటలో స్టెప్పులు వేసిన టాలీవుడ్‌ రాధికగా పేరు తెచ్చకొన్న అందాల భామ, యువ హీరోయిన్ నేహా శెట్టి గురించి, ఆ పాటలో నర్తించినందుకు ఏ మేరకు పారితోషికం చెల్లించారు అనే వివరాల్లోకి వెళితే..

సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్ నటించిన ఈ మూవీ మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు నటించారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ, సంగీతం థమన్ ఎస్ బాధ్యతలను నిర్వర్తించారు. అయితే ఈ సినిమా కోసం స్పెషల్ సాంగ్‌ను థమన్ రూపొందించగా.. సుజిత్ దానిని క్రేజీగా చిత్రీకరించారు. అయితే ఈ పాట సినిమాలో లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు.

Neha Shetty s Remuneration

అయితే పబ్లిక్ డిమాండ్ మేరకు నేహా శెట్టిపై చిత్రీకరించిన కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ అనే పాటను తాజాగా ఈ సినిమాకు జోడించారు. ఓజీలో అదనంగా ఓ పాటను మంగళవారం సాయంత్రం నుంచి చేర్చడం జరిగింది. ఆ పాటను మీరు ఆస్వాదించడం అంటూ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించింది. దాంతో మరోసారి ఈ పాటను చూసేందుకు సిద్దమయ్యారు.

అయితే ఈ సినిమా కోసం నేహా శెట్టికి భారీగా పారితోషికాన్ని చెల్లించారు. ఈ పాటను థాయ్‌లాండ్‌లో చిత్రీకరించారు. దాదాపు రెండు రోజులపాటు మాస్‌గా, యూత్‌ఫుల్‌గా పబ్ బ్యాక్ డ్రాప్‌లో చిత్రీకరించారు. ఈ పాటలో డ్యాన్స్ చేసిన ఆమెకు సుమారుగా 35 లక్షల రూపాయల రెమ్యునరేషన్ చెల్లించినట్టు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం అవుతున్నది. అయితే ఈ పాట పూర్తిగా యూత్‌ను టార్గెట్ చేసి షూట్ చేశారు అని తెలిసింది.

అయితే ముందుగా కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ పాటను ఓ చోట ప్లేస్ చేయాలని అనుకొన్నాం. కానీ స్టోరీకి, సినిమాలో ఉండే ఎమోషన్స్, యాక్షన్ సన్నివేశాలకు బ్రేక్ వేస్తుందని తొలగించాం. సుజిత్ ఈ విషయాన్ని తీవ్రంగా ఆలోచించి తీసేశారు అని థమన్ అన్నారు. సినిమాకు ఎలాంటి ఇబ్బంది కలిగించిన తాము తీసేయడానికి వెనుకాడం.. అలాగంటే.. హీరోలపై చాలా సీన్లు షూట్ చేస్తారు. కానీ సినిమాకు ఎంత వరకు ఉపయోగపడుతాయో అలాంటి హీరో సీన్లనే పెడుతారు. వాటి కంటే ఓపాటను తీసేయడం నష్టమేమి కాదు అని అన్నాడు. అయితే ఈ పాట సెకండాఫ్‌లో ఓ కీలకమైన పాయింట్‌లో సెట్ చేశామని తెలిపారు.

More from Filmibeat

Read more about: neha shetty pawan kalyan og
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X