హాట్ బ్యూటీకి ఎంత ధైర్యం.. తను చేయడమే కాదు, అందరినీ చేయమంటోంది!
నేల టికెట్టు భామ మాళవిక శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ సరసన నెల టికెట్టు రూపంలో మొదటి సినిమాతో హాట్ బ్యూటీగా టాలీవుడ్ ఆడియన్స్ ని బుట్టలో వేసుకుంది. లేలేత అందాలతో పలకరించిన ఈ భామ ఆ తర్వాత ఆశించిన మేర ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ అమ్మడి అందాలు తెలుగు ప్రేక్షకులు మరువలేదు. ఈ మధ్యనే సోషల్ మీడియాలో యాక్టీవ్ నెస్ పెంచిన మాళవిక తాజాగా కొన్ని ఫొటోలు షేర్ చేసి ఆశ్చర్యపరిచింది. ఈ ఫొటోలు చూసి అమ్మడికి హాట్‌నెస్‌తో పాటు డేర్‌నెస్ కూడా ఎక్కువే.. అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
రీసెంట్ గా థాయిలాండ్ వెళ్లిన మాళవిక శర్మ.. అక్కడి నాచురల్ అందాలను ఆస్వాదిస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది. టూర్ లో భాగంగా అక్కడి పట్టాయా అనే టైగర్ జూకు వెళ్లి ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ హాట్ భామ. అయితే ఇవి మామూలు పోజులు కాదండోయ్.. ఏకంగా రియల్ పులితో సరసాలు ఆడేస్తూ కెమెరాకే షాకిచ్చిన పోజులు. ఏకంగా పులి పక్కన పాడుకోవడమే గాక దానిపై చేతులేసి ఆశ్చర్యపరిచింది మాళవిక. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

థాయిలాండ్ దేశంలోని పట్టాయా అనే టైగర్ పార్క్‌కి ఓ ప్రత్యేకత ఉంది. అందులోని పులులు మనుషులతో సన్నిహితంగా ఉంటాయి. క్రూర మృగాలైనప్పటికీ మనుషులపై ప్రేమను కురిపిస్తాయి. వాటికి చిన్నప్పటి నుంచి మనుషులతో కలసిమెలసి తిరగడం నేర్పుతారు. అందుకే అవి మనుషులతో స్నేహంగా ఉంటాయి. అయితే ఈ పార్క్ విసిట్ చేసి పులులతో ఎంజాయ్ చేసిన చేసిన మాళవిక శర్మ.. వాటిని ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. ''మీరెప్పుడైనా థాయిలాండ్ వెళ్తే పట్టాయా టైగర్ పార్క్ కి ఖచ్చితంగా వెళ్లండి. ఆ పార్క్‌లో పూలతో ఫుల్లుగా ఎంజాయ్ చేయొచ్చు. అవి అందమైనవే కాదు కొంటెవి కూడా'' అని పేర్కొంది.


Click it and Unblock the Notifications











