రీ ఎంట్రీకి సిద్దమైన రవితేజ హీరోయిన్.. మళ్ళీ 11 ఏళ్ల తరువాత
టాలీవుడ్ ఇండస్ట్రీలో నార్త్ హీరోయిన్స్ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసిన విషయం తెలిసిందే. ముంబైకి చెందిన మోడల్స్ చాలా మంది టాలీవుడ్ నుంచే బాలీవుడ్ కు ఒక ట్రాక్ సెట్ చేసుకునేవారు. ఇక కొంతమంది మొదట్లోనే ప్లాప్స్ వలన స్టార్ డమ్ చూడకుండానే వెళ్లిపోయిన వారు కూడా ఉన్నారు. అలాంటి నటీమణుల్లో నేనింతే హీరోయిన్ ఒకరు.
రవితేజ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన నేనింతే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ముంబై భామ సియా గౌతమ్. ఈ హీరోయిన్ చివరగా తెలుగులో వేదం సినిమాలో ఒక సైడ్ రోల్ లో మాత్రమే కనిపించింది. ఆ తరువాత మళ్ళీ కనిపించని సియా అప్పుడప్పుడు బాలీవుడ్ సినిమాలలో కొన్ని స్పెషల్ రోల్స్ చేస్తూ వచ్చింది. ఆ మధ్య సంజయ్ దత్ బయోపిక్ సంజూలో ప్రియా దత్ పాత్రలో కనిపించింది.

ఇక మళ్ళీ 11 ఏళ్ల తరువాత తెలుగు సినిమాలో నటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. గోపిచంద్ సంపత్ నంది కాంబినేషన్ లో రూపొందుతున్న సీటిమార్ సినిమాలో సియా ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ పాత్ర ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి. ఇక సీటీమార్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.


Click it and Unblock the Notifications











