నా క్యారెక్టర్ అలాంటిది.. షాకింగ్‌గా నోయల్ సీన్ మాజీ భార్య.. తొలిసారి మీడియా ముందుకు..
బిగ్‌బాస్ ద్వారా మరింత చేరువైన యువ నటుడు నోయల్ సీన్ మాజీ భార్య ఎస్తేరా నొరోన్హా మరోసారి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆమె కీలక పాత్ర పోషించిన షకీలా మూవీ ఇప్పటికే హిందీ, కన్నడ, తమిళ భాషల్లో రిలీజైంది. తెలుగులో జనవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ నేపథ్యంలో తెలుగు షకీలా సినిమా ప్రమోషనల్‌లో మాట్లాడుతూ...

షకీలా సినిమాలో భాగం కావడం
షకీలా సినిమాలో భాగం కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో షకీలాకు ఎంత ప్రాముఖ్యత ఉందో.. నా క్యారెక్టర్‌కు అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. గతంలో ఇంద్రజిత్ లంకేష్‌తో సినిమా చేయాల్సింది. కానీ ఎందుకో వర్కువుట్ కాలేదు. ఆ కారణంగా నాకు షకీలా ఫ్రెండ్ క్యారెక్టర్‌ను ఆఫర్ చేశారు అని ఎస్తేరా నొరొన్హా తెలిపారు.

షకీలాకు స్నేహితురాలి పాత్రలో
షకీలా చిత్రంలో నేను పోషించిన పాత్ర నాకు చాలా సంతృప్తిని, హ్యాపీని ఇచ్చింది. ట్రైలర్, పాటలో కనిపించే పాత్ర. షకీలాకు బ్యాక్‌గ్రౌండ్‌లో నీడలా ఉండే పాత్రను చేశాను. షకీలా జీవితంలో ఆది నుంచి అంతం వరకు కీలకంగా ఉండే క్యారెక్టర్‌ను ప్లే చేశాను. ఆ పాత్రకు నేను చాలా కనెక్ట్ అయ్యాను అని ఎస్తేరా పేర్కొన్నారు.

హిందీ, తమిళ, కన్నడ భాషల్లో రిలీజై
హిందీ, కన్నడ, తమిళ భాషల్లో రిలీజై మంచి రెస్పాన్స్‌ను కూడగట్టుకొంటున్నది. నా పాత్రకు మంచి రివ్యూలు వస్తున్నాయి. ఆ పాత్రను నాకే ఎందుకు ఇచ్చారో ఇప్పుడే అర్ధం అవుతున్నది. తెలుగులో వస్తున్న షకీలా మూవీని ప్రతీ ఒక్కరు చూడాలి. అందరికీ నచ్చుతుంది అని ఎస్తేరా అభిప్రాయపడ్డారు.

తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తే..
తెలుగు సినిమా ప్రేక్షకులకు మంచి అభిరుచి ఉన్న ఆడియెన్స్. ప్రతీ సినిమాను ఇష్టపడి..డిటేయిల్‌గా చూస్తారు. అలా మీరు చూస్తే షకీలా సినిమా మంచి చిత్రం అవుతుంది. కాబట్టి ప్రతీ ఒక్కరు ఈ సినిమా చూసి ఆదరించాలి. వారు ఆదరిస్తే మంచి సినిమా అవుతుంది అని ఎస్తేరా అన్నారు.

బ్రిటన్‌లో పుట్టి గోవాలో స్థిరపడి
ఎస్తేరా నోరాన్హా విషయానికి వస్తే.. బ్రిటన్‌లో పుట్టిన ఎస్తేరా నటిగా, గాయకురాలిగా పరిచయం. తెలుగు కన్నడ, కొంకిణి, తమిళ్, హిందీ, మరాఠీ భాషల్లో నటించారు. గోవాలో స్థిరపడిన పోర్చుగీస్ కుటుంబం ఆమెది. కెరీర్ కోసం గోవా నుంచి కర్ణాటకలోని ఉడిపికి ప్రాంతానికి షిప్టు అయ్యారు.

నోయల్ సీన్‌తో పెళ్లి.. విడాకులు
కెరీర్ పీక్‌లో ఉండగానే.. జనవరి 2019న ర్యాపర్, నటుడు నోయల్ సీన్‌ను ఎస్తేరా పెళ్లి చేసుకొన్నారు. అయితే వారి మధ్య పరిష్కరించలేని విభేదాలు తలెత్తడంతో వారిద్దరు కోర్గు ద్వారా విడిపోయారు. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆమె ముఖ్య పాత్ర పోషించిన షకీలా జనవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.


Click it and Unblock the Notifications











