Just In
- 1 hr ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 1 hr ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 10 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
- 12 hrs ago
అభిమాని పెళ్లిలో సడన్‌గా ప్రత్యక్షమైన స్టార్ హీరో.. అతిధులంతా షాక్!
Don't Miss!
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Sports
ISL 2020 21: చెన్నయిన్ X ముంబై మ్యాచ్ డ్రా
- News
రిపబ్లిక్ డే : ఏపీ లేపాక్షి,యూపీ రామ మందిర శకటాలు.. ఈసారి ఢిల్లీ పరేడ్‌లో స్పెషల్ ఎట్రాక్షన్స్ ఇవే
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గుంజన్ సక్సేనాకు ప్రమోషన్ లేనట్టే... డైలమాలో జాన్వీ కపూర్
సుబ్బి పెళ్లి ఎంకి చావుకు వచ్చినట్లు, నెపోటిజంపై సాగుతున్న ఎడతెగని చర్చ అతిలోక సుందరి కూతురుకి తలనొప్పి తెచ్చిపెడుతోంది. అసలే స్టార్ కిడ్ అయిన జాన్వీ కపూర్ గుంజన్ సక్సేనాకు ప్రమోషన్ చేసుకోలేని పరిస్థితి తలెత్తగా... ఈ సినిమా నిర్మాత, ఇండస్ట్రీలో బంధుప్రీతిని పెంచి పోషిస్తున్న కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని పూర్తిగా గాలికి వదిలేయడంతో గుంజన్ సక్సేనా డైలమాలో పడిందనే చెప్పాలి.
ఇక జాన్వీ బాలీవుడ్ కెరీర్ పై ముందు నుంచీ బెంగ పెట్టుకున్న బోణీ కపూర్ తాజా పరిణామాలతో మరింత కలత చెందుతున్నాడని తెలుస్తోంది. ఎంత మంది ఎన్ని విధాలుగా జాన్వీకి బ్రేక్ ఇస్తామని ముందుకు వచ్చినా కరణ్ జోహార్ నే నమ్ముకుని కూతురి భవిష్యత్తు అతడి చేతిలో పెట్టాడు. కానీ, కరణ్ రొటీన్ కు భిన్నంగా జాన్వీతో అన్నీ మీడియం బడ్జెట్ చిత్రాలనే నిర్మించి ఆమెకు పెద్ద బ్రేక్ ఇవ్వలేకపోయాడు.

బాలీవుడ్ లో పరిణామాలు ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో, బోణీ కూతురి కెరీర్ కోసం దక్షిణాది చిత్ర పరిశ్రమవైపు చూస్తున్నాడని తెలుస్తోంది. దక్షిణాదిన పెద్ద స్టార్స్ ను పట్టుకుంటే, రెండు సినిమాలకే అమ్మాయి సెటిల్ అయిపోతుందనే ఆలోచన చేస్తున్నాడట. ఏమైనా ఇదంతా జరగాలి అంటే, గుంజన్ సక్సేనాలో అమ్మడి నటనకు మంచి మార్కులు పడాలి. మరి, నిజజీవిత గాథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ రీతిన మెప్పిస్తుందో చూడాలి.