బీచ్‌లో నిహారిక సెక్సీ లుక్.. ఇదీ మెగా ఫ్యాన్స్ రియాక్షన్
కొణిదెల ఫ్యామిలీ వారసురాలు, మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక సెక్సీ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా సెక్సీ ఫోజులకు, హాట్ డ్రెస్సులకు దూరంగా ఉండే మెగా డాటర్ ఒక్కసారిగా సెక్సీ లుక్‌లో దర్శనమిచ్చే సరికి ఆశ్చర్యపోయారు మెగా ఫ్యాన్స్. నెట్టింట తెగచక్కర్లు కొడుతున్న ఈ పిక్ చూసి భిన్నంగా స్పందిస్తున్నారు నెటిజన్లు.
వైజాగ్ బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ దిగిన తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది కొణిదెల నిహారిక. ఇన్నాళ్లు హోమ్లీ లుక్‌లో కనిపించిన ఆమె ఇందులో సెక్సీ లుక్‌తో దర్శనమిచ్చింది. పొడవాటి తెల్లటి షర్టు ధరించిన నిహారిక ప్యాంట్ ఏమీ వేసుకోలేదు. ఆరెంజ్ షార్ట్ మాత్రమే వేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఆమె లోని హాట్‌నెస్ అంతా బయటపడింది. బీచ్ సరదాగా ఎంజాయ్ చేస్తూ నిహారిక తన అమ్మతో తీయించుకున్న ఫోటోనే ఇది. ఈ ఫోటోకు 'బీచ్‌లో ఎంజాయ్ చేయడం కంటే ఆనందమైన రోజు మరొకటి లేదు' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఇప్పటివరకూ నిహారిక నటించిన సినిమాల్లో ఎక్కడా హాట్‌గా కనిపించిన సందర్భాలు లేవు. ఈ రకమైన గ్లామర్ పోజు ఇవ్వడం ఆమెకు ఇదే తొలిసారి. ఇలా ఆమెను చూసిన కొందరు మెగా అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. మెగా కుటుంబం నుంచి వచ్చి వారి పరువు తీసేలా డ్రెస్ వేసుకుంటావా..? అంటూ ఫైర్ అవుతున్నారు. మరోవైపు ఇదే పిక్ పై.. నిహారిక లైన్ లోకి వచ్చేసింది, ఇక నుంచి మెగా వారసురాలి పవరేంటో తెలుస్తుంది అని కూడా కామెంట్స్ పెడుతున్నారు. సినీ కెరీర్ పరంగా ఒకటి, రెండు సినిమాల్లో నటించినప్పటికీ మెగా హీరోయిన్ కొణిదెల నిహారికకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఇటీవలే సూర్యకాంతం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆమె ప్రస్తుత ఓ నూతన వెబ్ సిరీస్‌లో నటించేందుకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











