పాయల్ ప్రియుడికి నెటిజన్ ఝలక్: ఏకంగా ఆమె గురించి అలాంటి ప్రశ్న.. పోలీసుల దగ్గరకు చేరిన పంచాయతీ

హీరోయిన్‌గా పరిచయం అవ్వాలంటే మంచి పాత్ర ఉండాలనుకునే రోజులు పోయాయి. యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న ఎలాంటి రోల్ అయినా పర్లేదు అనుకుంటున్నారు ఇప్పటి అమ్మాయిలు. ఇలా మొదటి సినిమాలోనే బోల్డు పాత్రలో నటించి.. విమర్శకులు ప్రశంసలు సైతం అందుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. గ్లామర్‌కు గ్లామర్.. యాక్టింగ్‌కు యాక్టింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఈమె.. వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. అదే సమయంలో ఓ వ్యక్తితో ప్రేమాయణం కూడా సాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే అతడికి ఓ నెటిజన్ భారీ షాకిచ్చాడు. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళ్తే...

అలా మొదలైన కెరీర్.. వరుస సినిమాలు

అలా మొదలైన కెరీర్.. వరుస సినిమాలు

బోల్డు కంటెంట్‌తో వచ్చిన 'RX 100' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది పాయల్ రాజ్‌పుత్. ఆ తర్వాత 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి పలు సినిమాల్లో నటించింది. వీటిలో కొన్ని హిట్‌ అవగా.. మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. అయితే, వేరే భాషల్లో మాత్రం అమ్మడు వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె కొన్ని చిత్రాల్లో నటిస్తోంది.

లాక్‌డౌన్‌లో అలా కనిపించి మెప్పించింది

లాక్‌డౌన్‌లో అలా కనిపించి మెప్పించింది

తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పాయల్ రాజ్‌పుత్ వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అంతెందుకు లాక్‌డౌన్ సమయంలో షూటింగ్‌లు ఆగిపోయినప్పటికీ.. తెలుగు ఓటీటీ సంస్థ ఆహా రూపొందించిన 'అనగనగా ఓ అతిథి' అనే సినిమాలో నటించింది. ఇందులో ఆమె చేసిన డీ గ్లామర్ రోల్‌కు మంచి మార్కులే పడ్డాయి. దీని తర్వాత అదే సంస్థలో కొన్ని వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది.

స్పెషల్ సాంగ్స్‌తో రచ్చ చేస్తున్న బ్యూటీ

స్పెషల్ సాంగ్స్‌తో రచ్చ చేస్తున్న బ్యూటీ

వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తోన్న పాయల్ రాజ్‌పుత్.. స్పెషల్ సాంగ్స్‌కు సైతం సిద్ధం అవుతోంది. ఇప్పటికే తేజ దర్శకత్వంలో వచ్చిన 'సీత' సినిమాలో పాయల్ రాజ్‌పుత్.. 'బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి' అంటూ రచ్చ చేసింది. ఇప్పుడు శర్వానంద్, సిద్దార్ధ్ కాంబినేషన్‌లో అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న 'మహాసముద్రం'లోనూ ఆమె ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందని టాక్.

అందులో యమ యాక్టివ్.. ఏదీ వదల్లేదు

అందులో యమ యాక్టివ్.. ఏదీ వదల్లేదు

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో సైతం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది పాయల్ రాజ్‌పుత్. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా బట్టలు లేకుండా దిగిన ఫొటోలన షేర్ చేసింది పాయల్ రాజ్‌పుత్.

 బాయ్‌ఫ్రెండ్ పేరు.. ఫొటో రివీల్ చేసిందిగా

బాయ్‌ఫ్రెండ్ పేరు.. ఫొటో రివీల్ చేసిందిగా

సినిమాల పరంగా ఫుల్ బిజీగా ఉన్న పాయల్ రాజ్‌పుత్.. వ్యక్తిగత జీవితాన్ని కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం తన లవర్ పేరు సౌరబ్ డింగ్రా అని, అతడి ఫొటోను రివీల్ చేసింది. అంతేకాదు, ఈ మధ్య తరచూ అతడితో దిగుతోన్న ఫొటోలను సోషల్ మీడియాలో వదులుతోంది. ఈ క్రమంలోనే అతడితో ఏదో ఒక ప్రదేశాన్ని చూట్టేలా టూర్లు ప్లాన్ చేసుకుంటోంది.

పాయల్ ప్రియుడికి నెటిజన్ భారీ ఝలక్

పాయల్ ప్రియుడికి నెటిజన్ భారీ ఝలక్

పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో.. ఆమె ప్రియుడు సౌరబ్ డింగ్రా కూడా అలాగే ఉంటాడు. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక పోస్టు పెడుతున్నాడు. ఇక, తాజాగా అతడు తన ఫాలోవర్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ సౌరబ్ డింగ్రాను ఏకంగా పాయల్ రాజ్‌పుత్ ఫోన్ నెంబర్ అడిగి భారీ ఝలక్ ఇచ్చాడు.

Recommended Video

Actor Vivek మరణం: కంటతడి పెట్టిన Keerthy, త్రిష, సూర్య, ఈ తరం హాస్యనటుల్లో ఆ లక్షణాలు లేవు
ఏకంగా ఆమె గురించి అలాంటి ప్రశ్న వేసి

ఏకంగా ఆమె గురించి అలాంటి ప్రశ్న వేసి

సౌరబ్ డింగ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్ ఫోన్ నెంబర్ అడిగిన దానికి స్క్రీన్ షాట్ తీసుకున్న పాయల్ రాజ్‌పుత్.. దాన్ని తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. అంతేకాదు, దీనికి సమాధానంగా పోలీసు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ అయిన 100 అని కామెంట్ పెట్టింది. ఆమె ఇచ్చిన కౌంటర్‌కు నెటిజన్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. గతంలోనూ ఇలానే పలుమార్లు స్పందించిందీ బ్యూటీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X