For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రేణు దేశాయ్‌కు షాకిచ్చిన నెటిజన్: ఏకంగా అది కావాలంటూ అడిగేశాడు.. నటి షాకింగ్ డెసీషన్

  |

  రేణు దేశాయ్.. కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో బాగా వైరల్ అవుతోన్న పేర్లలో ఇది ఒకటి. దీనికి కారణం ఆమె వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలు కాదు.. ఈ మధ్య కాలంలో కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడుతోన్న ఎంతో మందికి తన వంతు సహాయం చేస్తుండడమే. సోషల్ మీడియా వేదికగా అవసరం కోసం వేచి చూస్తున్న వారికి హెల్ప్ చేస్తోన్న ఆమె.. తాజాగా ఓ షాకింగ్ డెసీషన్ తీసుకున్నారు. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియో చేస్తుండగా.. మరో నెటిజన్ రేణు దేశాయ్‌కు బిగ్ షాక్ ఇచ్చాడు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

  శృంగారపు ఫోజులతో నైనా గంగూలీ అలజడి.. వైరల్‌గా ఫోటోలు

  ఇప్పుడు ఆ షోతో ఫుల్ బిజీగా రేణు

  ఇప్పుడు ఆ షోతో ఫుల్ బిజీగా రేణు

  ఒకప్పుడు హీరోయిన్‌గా చేసిన రేణు దేశాయ్.. ఈ మధ్య కాలంలో బుల్లితెరపై వచ్చే షోలలో కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘డ్రామా జూనియర్స్ - ద నెక్ట్స్ సూపర్ స్టార్' అనే పిల్లల కార్యక్రమానికి జడ్జ్‌గా చేస్తున్నారు. ఆమెతో పాటు దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి, సింగర్ సునీత కూడా ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నా.. రేణునే హైలైట్ చేస్తున్నారు.

  ఎప్పుడూ అందులోనే ఉంటోన్న నటి

  ఎప్పుడూ అందులోనే ఉంటోన్న నటి

  రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్ సంబంధించిన విశేషాలను తరచూ ప్రస్తావిస్తుంటారు. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తున్నారు. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే రేణు దేశాయ్ కొన్ని లక్షల ఫాలోవర్లను సంపాదించారు.

  కోవిడ్ బాధితుల కోసం ముందుకొచ్చి

  కోవిడ్ బాధితుల కోసం ముందుకొచ్చి

  ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విపరీతంగా విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో ఎంతో మంది సినీ ప్రముఖులు బాధితుల కోసం ముందుకు వచ్చి తమ వంతు సహాయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే రేణు దేశాయ్ కూడా సోషల్ మీడియా వేదికగా బాధితులకు అండగా నిలవాలని డిసైడ్ అయిపోయారు. ఇందుకోసం తన ఇన్‌స్టాగ్రామ్‌ను వాడుకుంటున్నారు.

  ఎంతో మందికి సహాయం చేసిన రేణు

  ఎంతో మందికి సహాయం చేసిన రేణు

  కరోనా చుక్కలు చూపిస్తోన్న తరుణంలో రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోని ఇన్‌బాక్స్‌ను ఓపెన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో అవసరం ఉన్న ఎవరైనా మెసేజ్ చేయొచ్చని సూచించారు. అందుకు అనుగుణంగానే సహాయం కోసం వేచి చూస్తున్న చాలా మంది ఆమెకు మెసేజ్‌లు చేశారు. దీంతో రేణు దేశాయ్ వీలైనంత ఎక్కువ మందికి తన వంతుగా హెల్ప్ చేశారు.

  రేణుకు విసుగు తెప్పించిన నెటిజన్లు

  రేణుకు విసుగు తెప్పించిన నెటిజన్లు

  మంచి పని కోసం ముందుకు వచ్చిన రేణు దేశాయ్‌కు చాలా మంది ఆకతాయిలు చిరాకు తెప్పించారు. హాయ్, బాయ్ అంటూ పిచ్చి పిచ్చి మెసేజ్‌లు చేయడంతో పాటు డబ్బులు కావాలని అడగడం మొదలు పెట్టారు. అదే సమయంలో కొందరు ‘ఉన్నవాళ్లకే సహాయం చేస్తారు' అంటూ కోపం తెప్పించారు. ఇక, ఇటీవల డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు.

  సెల్ఫీ వీడియో.. నటి షాకింగ్ డెసీషన్

  సెల్ఫీ వీడియో.. నటి షాకింగ్ డెసీషన్

  సహాయం కావాల్సిన వాళ్ల కోసం ముందుకొచ్చిన రేణు దేశాయ్‌కు కొందరు నెటిజన్లు చేసిన పని అస్సలు నచ్చడం లేదట. ఈ విషయాన్ని పలుమార్లు ఆమెనే స్వయంగా చెప్పారు. అయినప్పటికీ అలాంటివి తగ్గకపోవడంతో తాజాగా ఆమె లైవ్‌లోకి వచ్చి షాకింగ్ డెసీషన్ తీసుకున్నారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌బాక్స్‌ను క్లోజ్ చేసేశారు. ఏదైనా ఉంటే కామెంట్ చేయాలని చెప్పారు.

  Bigg Boss ని కోర్టుకు ఈడుస్తా.. వాళ్ళు రాజకీయాల్లో ఫెయిల్ అవుతారు - CPI Narayana
  రేణు దేశాయ్‌కు షాకిచ్చిన నెటిజన్

  రేణు దేశాయ్‌కు షాకిచ్చిన నెటిజన్

  ఇన్‌స్టాగ్రామ్‌కు సంబంధించిన కామెంట్ బాక్స్‌లో ఎవరైనా సహాయం అడగొచ్చు అని చెప్పిన రేణు దేశాయ్.. డబ్బులు ఇవ్వలేనని.. ఆహారము.. నిత్య అవసరాలు.. మెడిసిన్ మాత్రం అందించగలనని చెప్పారు. ఈ సమయంలోనే ఓ నెటిజన్ ఆమె పర్సనల్ నెంబర్ అడిగి షాకిచ్చాడు. అప్పుడు సహనం కోల్పోకుండా ఎన్జీవో మొదలెట్టాక దాని నెంబర్ ఇస్తానంటూ బదులిచ్చారు.

  English summary
  Renu Desai is Very Active in Social Media. Recently She Shared a Selfie Video. In This Session a Netizen Ask Renu Desai Phone Number.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X