సెక్స్ లేకుండా ఉండలేవా: నెటిజన్ సూటి ప్రశ్న.. శృతి హాసన్‌ షాకింగ్ ఆన్సర్!

సౌతిండియన్ లెజెండరీ యాక్టర్, విశ్వనాయకుడు కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది హాట్ బ్యూటీ శృతి హాసన్. అదిరిపోయే అందం.. మెస్మరైజ్ చేయగల యాక్టింగ్‌తో సత్తా చాటుతోన్న ఈ భామ.. వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే దక్షిణాదిలోని భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోంది. అదే సమయంలో ఇండిపెండెంట్ సింగర్‌గా పలు ఆల్బమ్‌లను కూడా క్రియేట్ చేసిందీ బ్యూటీ.

ఇలా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోన్న శృతి హాసన్.. పర్సనల్ లైఫ్‌నూ బాగానే ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్ ఆమెను ఇన్‌స్టాగ్రామ్ చాట్‌లో ఊహించని ప్రశ్న అడిగాడు. దీనికి శృతి ఎలా రియాక్ట్ అయిందో చూడండి!

అలా ఎంటర్.. తెలుగు మూవీతో అవార్డు

అలా ఎంటర్.. తెలుగు మూవీతో అవార్డు

ఆరేళ్ల వయసులోనే గాయనిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది శృతి హాసన్. ఆ తర్వాత ఇండిపెండెంట్ సింగర్‌గా ఎన్నో పాటలను ఆలపించింది. అలాగే సొంతం కొన్ని ఆల్బమ్‌లను కూడా కంపోజ్ చేసింది. ఈ క్రమంలోనే 2000లో వచ్చిన 'హే రామ్' అనే చిత్రంలో కామియో రోల్ చేసింది.

అనంతరం 'లక్' అనే హిందీ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. ఇక, తెలుగులో వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు' అనే సినిమాతో శృతి హాసన్ హీరోయిన్‌గా మారింది. ఇందులో అదరగొట్టేసిన ఈ బ్యూటీ పలు అవార్డులను అందుకుంది. అదే సమయంలో వరుసగా ఆఫర్లనూ దక్కించుకుంది.

టాలీవుడ్‌లో అప్పుడూ.. ఇప్పుడూ సత్తా

టాలీవుడ్‌లో అప్పుడూ.. ఇప్పుడూ సత్తా

ఒకపక్క తెలుగు సినిమాలు చేస్తూనే మాతృభాష తమిళం, హిందీల్లోనూ ఎన్నో చిత్రాల్లో నటించింది. మరీ ముఖ్యంగా మన స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సహా ఎంతో మందితో స్క్రీన్ షేర్ చేసుకుంది. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే చాలా కాలం పాటు గ్యాప్‌ తీసుకుంది.

ఈ క్రమంలోనే సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది ఆరంభంలో రవితేజ నటించిన 'క్రాక్'తో రీఎంట్రీ ఇచ్చి సక్సెస్‌ను అందుకుంది. దీని తర్వాత శృతి నటించిన 'వకీల్ సాబ్' కూడా హిట్టే. ఇప్పుడామె ప్రభాస్‌తో 'సలార్‌' మూవీ చేస్తోంది.

ఒకరితో బ్రేకప్.. ఇంకొకరి ప్రేమలో బ్యూటీ

ఒకరితో బ్రేకప్.. ఇంకొకరి ప్రేమలో బ్యూటీ

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే శృతి హాసన్ కొన్నేళ్ల క్రితం ఇంగ్లండ్ గాయ‌కుడు మైకేల్ కోర్స‌లేతో ప్రేమ‌లో ప‌డిన విషయం తెలిసిందే. అంతేకాదు.. అతడు క‌మ‌ల్‌ హాసన్‌తో క‌లిసి ఒక వేడుక‌లో కూడా పాల్గొన్నాడు. దీంతో తన కూతురి పెళ్లికి విశ్వనాయకుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అన్నారు. కానీ, ఊహించని విధంగా అతడికి బ్రేకప్ చెప్పేసింది. దీంతో ఆమె డిప్రెషన్‌లోకి కూడా వెళ్లిపోయిందనే టాక్ బాగా వినిపించింది. ఇక, మైకేల్‌తో బ్రేకప్ తర్వాత శృతి హాసన్ మరొకరితో లవ్ ట్రాక్ నడపడం కూడా మొదలెట్టింది.

ఇద్దరూ కలిసి ఒకేచోట... రచ్చ చేస్తోందిగా

ఇద్దరూ కలిసి ఒకేచోట... రచ్చ చేస్తోందిగా

బ్రేకప్ తర్వాత శృతి హాసన్ కెరీర్ మీద ఎక్కువగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోంది. ఇలాంటి సమయంలో ఈ కోలీవుడ్ బ్యూటీ శాంతను హజారికా అనే పెయింటింగ్ ఆర్టిస్టుతో ప్రేమలో పడిపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన ఆమె.. ప్రియుడితో తిరుగుతూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. అదే సమయంలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోకుండానే ముంబైలో కలసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇక, త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

అందులో ఎప్పుడూ బిజీగానే ఉంటోందిగా

అందులో ఎప్పుడూ బిజీగానే ఉంటోందిగా

చేతి నిండా సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ, అవకాశాలు లేక ఖాళీగా ఉన్నా హాట్ హీరోయిన్ శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది.

అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటోంది. ఈ కారణంగానే ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ భారీ స్థాయిలో పెరిగిపోతోంది.

సెక్స్ లేకుండా ఉండగలవా అంటూ ప్రశ్న

సెక్స్ లేకుండా ఉండగలవా అంటూ ప్రశ్న

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది హీరోయిన్ శృతి హాసన్. ఇందులో భాగంగానే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోని తన ఫాలోవర్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఇందులో చాలా మంది పలు రకాల ప్రశ్నలు అడగగా.. వాటికి ఆమె సమాధానం చెప్పింది. మరీ ముఖ్యంగా పలువురు ఔత్సాహికులు ఆమె పర్సనల్ లైఫ్ గురించి కూడా చిత్ర విచిత్రమైన ప్రశ్నలను అడుగుతుంది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ 'ఆహారం, సెక్స్.. ఈ రెండింటిలో ఏది లేకుండా మీ రోజు గడవదో చెప్పండి' అంటూ శృతి హాసన్‌ను దారుణమైన ప్రశ్నను అడిగాడు.

చీకట్లో ఉన్న వాళ్లందరూ అలానే అంటూ

చీకట్లో ఉన్న వాళ్లందరూ అలానే అంటూ

నెటిజన్ అడిగిన ప్రశ్నకు శృతి హాసన్ షాక్ అయిపోయింది. ఈ నేపథ్యంలో దానిపై స్పందిస్తూ.. 'ఇందులో చెప్పడానికి ఏముంది? ఆహారం లేకుండా మీరైతే బతకగలరా? మిమ్మల్ని ఫుడ్ లేకుండా చూడాలని ఉంది. తిండి లేకపోతే చనిపోతాం అన్న విషయం మీకు తెలియదు అనుకుంటా. అయినా చీకట్లో సొరంగంలోకి దిగితే చీకటి తప్ప ఏమీ కనిపించదు' అంటూ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. తద్వారా ఎలాంటి వాళ్లకు అలాంటి ఆలోచనలే వస్తాయి అంటూ శృతి హాసన్ మొట్టికాయలు వేసింది. దీంతో దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X