For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బికినీ ఫొటో అడిగిన కుర్రాడికి అనుపమ ఆఫర్: అడ్రెస్ పంపమంటూ లైవ్‌లోనే ఊహించని విధంగా!

  |

  సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది హీరోయిన్లు సినిమాలు చేసినా.. చేయకపోయినా నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో విషయాలను పంచుకోవడంతో పాటు అందాల విందు చేస్తూ వాళ్లను ఫుల్ ఖుషీగా ఉంచుతున్నారు. దీంతో భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సైతం సొంతం చేసుకుంటున్నారు. ఇక, కొంత కాలంగా టాలీవుడ్‌లో సత్తా చాటుతూ వరుస ఆఫర్లను అందుకుంటోన్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ఆమెను బికినీ ధరించిన ఫొటో పంపమని కోరాడు. దీనికి లైవ్‌లోనే ఈ సుందరాంగి ఊహించని ఆన్సర్ ఇచ్చింది. దీంతో ఇది చూసిన వారంతా షాక్‌కు గురవుతున్నారు. ఇంతకీ ఆమె ఏమన్నదంటే!

  చిన్న వయసులోనే మొదలుపెట్టింది

  చిన్న వయసులోనే మొదలుపెట్టింది

  కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ చిన్న వయసులోనే 'ప్రేమమ్' అనే సినిమాతో నటిగా ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత అక్కడ మరో చిత్రంలోనూ నటించింది. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ నటించిన 'అఆ' సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అనుపమ పరమేశ్వరన్.. నాగ చైతన్య 'ప్రేమమ్'తో హీరోయిన్‌గా మారింది. అప్పటి నుంచి ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఆ సమయంలోనే 'ఉన్నది ఒకటే జిందగీ', 'హలో గురూ ప్రేమకోసమే', 'కృష్ణార్జున యుద్ధం' వంటి సినిమాల్లో నటించింది.

  షర్ట్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ సరయు: బ్రాతో ఘాటు ఫోజులిస్తూ.. వామ్మో చూస్తే తట్టుకోలేరు

  కెరీర్‌లో భారీ హిట్.. ఫుల్ బిజీగా మారి

  కెరీర్‌లో భారీ హిట్.. ఫుల్ బిజీగా మారి

  తెలుగులో అనుపమ పరమేశ్వరన్ చేసిన సినిమాలు తక్కువే. కానీ, భారీ స్థాయిలో గుర్తింపును దక్కించుకుంది. 'అఆ' తర్వాత ఆమె కెరీర్‌లో పలు సినిమాలు చేసినా భారీ విజయం మాత్రం దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 2019లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన 'రాక్షసుడు' అనే సినిమాతో భారీ హిట్ కొట్టింది. దీంతో తెలుగులో మళ్లీ ఫుల్ బిజీ అయిపోయింది. ఇప్పుడు దిల్ రాజు తమ్ముడు కొడుకుతో 'రౌడీ బాయ్స్' అనే సినిమా చేస్తోంది. దీనితో పాటు నిఖిల్ '18 పేజెస్'లోనూ నటిస్తోందీ కేరళ కుట్టి. మరికొన్ని ప్రాజెక్టులనూ లైన్‌లో పెడుతోంది.

  ఇక్కడే కాదు.. అక్కడ కూడా దూకుడు

  ఇక్కడే కాదు.. అక్కడ కూడా దూకుడు

  మలయాళీ అమ్మాయే అయినా అనుపమ పరమేశ్వరన్ దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది. తెలుగులో ఏ రేంజ్‌లో పాపులారిటీని అందుకుందో.. అన్ని భాషల్లోనూ అదే విధంగా సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుని దూకుడు చూపిస్తోంది. ఇలా మరెన్నో అవకాశాలను అందుకుంటూ అన్ని భాషల్లోనూ హవా చూపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో రెండు సినిమాలను చేస్తున్న అనుపమ.. మలయాళంలో 'కురుప్పు', తమిళంలో 'తల్లి పొగతే' అనే సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు మరిన్ని చిత్రాల్లోనూ భాగం అవుతోంది.

  Bigg Boss: నాలుగో వారం ఆ ఇద్దరిలో ఒకరు ఔట్.. ఒక్కరోజులో మారిన ఓటింగ్.. టైటిల్ ఫేవరెట్లకు బిగ్ షాక్

  క్రికెటర్‌తో ప్రేమాయణంతో ఫుల్ ఫేమ్

  క్రికెటర్‌తో ప్రేమాయణంతో ఫుల్ ఫేమ్

  అనుపమ పరమేశ్వరన్ దక్షిణాది వ్యాప్తంగా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అదే సమయంలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అయితే, ఈ బ్యూటీ ఓ ప్రచారం కారణంగా ఆ మధ్య దేశ వ్యాప్తంగానూ ఫేమస్ అయింది. దీనికి కారణం ఆమె టీమిండియా క్రికెటర్ జస్ప్రీత్ బూమ్రాతో ప్రేమాయణం సాగిస్తోందన్న వార్తలు రావడమే. సోషల్ మీడియాలో వీళ్లిద్దరూ ఒకరినొకరు ఫాలో అవడం వల్లే ఈ పుకార్లు షికార్లు చేశాయి. అయితే, ఇటీవల ఆ ఇండియన్ క్రికెటర్ వేరే అమ్మాయిని వివాహం చేసుకోవడంతో దీనికి పుల్‌స్టాప్ పడింది.

  అందులో మాత్రం అను ఎప్పుడూ బిజీ

  అందులో మాత్రం అను ఎప్పుడూ బిజీ

  వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటోంది. ఈ కారణంగానే అనుపమ పరమేశ్వరన్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్యను రోజు రోజుకూ భారీ స్థాయిలో పెంచుకుంటోంది.

  మహేశ్ బాబు కోసం రాజమౌళి డేరింగ్ స్టెప్: స్టోరీ విషయంలో ప్లాన్ మార్చేసి.. స్వయంగా రంగంలోకి!

  అనును బికినీ ఫొటో అడిగిన నెటిజన్

  అనును బికినీ ఫొటో అడిగిన నెటిజన్

  అనుపమ పరమేశ్వరన్‌ మిగిలిన హీరోయిన్లతో పోలీస్తే మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ దిగిన పిక్స్ ఉంటాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తద్వారా ఈ బ్యూటీ దేశ వ్యాప్తంగా పాపులారిటీని మరింతగా పెంచుకుంటూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా అనుపమ నెటిజన్లతో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా ఓ కుర్రాడు ఏకంగా ఆమెను బికినీ వేసుకున్న ఫొటో పెట్టమని అడిగేశాడు.

  నెటిజన్‌కు అనుపమ ఆఫర్ ఇస్తూ అలా

  నెటిజన్‌కు అనుపమ ఆఫర్ ఇస్తూ అలా

  అనుపమ పరమేశ్వరన్‌ను సదరు నెటిజన్ బికినీ ఫొటో పెట్టమని కోరగానే ఊహించని విధంగా రిప్లై ఇచ్చి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆ సమయంలో ఆమె ఎంతో కామ్‌గా కనిపిస్తూనే 'నీ అడ్రెస్ సెండ్ చెయ్.. నా బికినీ ఫొటోను పంపిస్తాను. దాన్ని నువ్వు ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో' అంటూ బదులిచ్చింది. ఇది చూసిన వాళ్లంతా భిన్నంగా స్పందిస్తున్నారు. అలాంటివి అడిగిన వాళ్లకు గట్టిగా బుద్ది చెప్పాల్సింది పోయి ఆఫర్ ఇస్తున్నావేంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అనుపమ పరమేశ్వరన్ ఇచ్చిన ఆన్సర్‌కు ఆ కుర్రాడి మతిపోయి ఉంటుంది.

  English summary
  Tollywood Heroine Anupama Parameshwaran Very Active in Social Media. Now Netizen Asked Bikini Photo to her.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X