నువ్వు కన్యవేనా? .. లైవ్‌లో హీరోయిన్‌పై పచ్చిగా.. నీ అంతు తేలుస్తానంటూ
సోషల్ మీడియా రాకతో సెలబ్రెటీలతో సామాన్యులు కనెక్ట్ కావడానికి బాగా ఉపయోగపడుతోంది. ఫోటోలు, వీడియోలతో పాటు వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ నటీనటులు యాక్టీవ్‌గా ఉంటున్నారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల ద్వారా లైవ్‌లోకి వచ్చి అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటారు. అయితే కొందరు ఆకతాయిల కారణంగా వీరు ఇబ్బంది పడుతున్నారు. లైవ్‌లోకి వచ్చి అభ్యంతర ప్రశ్నలు అడుగుతూ వేధిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఆకతాయికి చిక్కారు హీరోయిన్ మాళవిక మోహనన్. ఈ వివరాల్లోకి వెళితే..

రాజా సాబ్‌లో ప్రభాస్‌కు జోడీగా
కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ తన మాతృభాష మలయాళంతో పాటు తమిళం, హిందీ భాషలో పలు సినిమాల్లో నటించింది. ఏకంగా సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన పేట సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇళయ దళపతి విజయ్‌తో మాస్టర్, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో మారన్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ది రాజా సాబ్ చిత్రంలో నటిస్తున్నారు. అప్పటి నుంచి మాళవిక పేరు మారుమోగుతోంది.
తంగలాన్‌లో యోధురాలిగా
గ్లామరస్ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు పోషిస్తున్నారు. గతేడాది విక్రమ్ హీరోగా వచ్చిన తంగలాన్‌లో యోధురాలిగా కనిపించి యాక్షన్ సీన్స్‌లో ఇరగదీశారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రతో మాళవికకు మంచి పేరొచ్చింది. దురదృష్టవశాత్తూ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది లేదంటే ఈమె కెరీర్ మరోలా ఉండేదనే కామెంట్స్ వినిపించాయి. ప్రస్తుతం ది రాజా సాబ్‌తో పాటు కార్తీ సరసన సర్దార్ -2లో నటిస్తున్నారు మాళవిక.
బోల్డ్ కామెంట్స్ చేసే మాళవిక
ఏ విషయంపై అయినా మొహమాటం లేకుండా మాట్లాడే నటీమణుల్లో మాళవిక మోహనన్ కూడా ఒకరు. అలా కొన్నిసార్లు వివాదంలో సైతం మాళవిక చిక్కుకున్నారు. ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడుతూ.. నటులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొందరు నటులు మహిళలను గౌరవించే ముసుగులో పేరు కొట్టేస్తున్నారని మండిపడ్డారు. తన కెరీర్‌లో ఇలాంటి ముసు మనుషుల్ని చాలా మందిని చూశానని.. అయితే చాకచక్యంగా వ్యవహరించే వీరిని పట్టుకోవడం చాలా కష్టమని మాళవిక చెప్పారు. కెమెరా వెనుక ఒకలా, ముందు మరోలా నటిస్తున్నారని ఆమె మండిపడ్డారు.
నువ్వు కన్యవేనా అంటూ నెటిజన్ ప్రశ్న
తరచుగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించడం మాళవికకు అలవాటు. తాజాగా ట్విట్టర్‌లో ఓ నెటిజన్ ఆమె పట్ల దారుణంగా వ్యవహరించారు. మీరు వర్జినేనా అని నేరుగా ప్రశ్నించాడు. అతని ప్రశ్నతో మాళవిక షాకయ్యారు. వెంటనే తేరుకుని ఇలాంటి చెత్త ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు.. దయచేసి మారేయండి అంటూ గట్టిగా కౌంటరిచ్చారు మాళవిక. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు నీ అంతు చూస్తామంటూ సదరు వ్యక్తిపై మండిపడుతున్నారు. ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వొద్దంటూ మాళవికకు కూడా వారు సూచిస్తున్నారు. హీరోయిన్లు కూడా మన తల్లి, అక్క, చెల్లిలాంటి వాళ్లేనని వాళ్లని గౌరవించాలని చురకలంటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











