అనసూయ నుంచి ఊహించని వీడియో: వాళ్లందరి కంటే నేనే బాగుంటా అంటూ నాటీగా.. పెళ్లైంది కదా లేకుంటే!

అనసూయ భరద్వాజ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు అనడంలో సందేహమే లేదు. అంతలా ఈ అమ్మడు దాదాపు ఐదారేళ్లుగా బుల్లితెరపై తన హవాను చూపిస్తోంది. అదే సమయంలో సినిమాల్లోనూ రాణిస్తూ సత్తా చాటుతోంది. అందుకే వరుస ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతోంది. దీంతో ఈ అమ్మడు తరచూ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది అనసూయ. అందులో ఆమె నాటీ కామెంట్లు చేయడంతో అది వైరల్ అవుతోంది. ఆ వివరాలు మీకోసం!

కెరీర్ మొదలైందిలా.. జబర్ధస్త్‌తో పాపులర్

కెరీర్ మొదలైందిలా.. జబర్ధస్త్‌తో పాపులర్

చిన్న చిన్న పాత్రలతో కెరీర్‌ను ఆరంభించింది తెలుగు అందం అనసూయ భరద్వాజ్. అదే సమయంలో ఓ న్యూస్ చానెల్‌లో ప్రజెంటర్‌గా పని చేసింది. అప్పుడే జబర్ధస్త్ నిర్వహకుల దృష్టిలో పడి.. అందులోకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఆమె కెరీర్‌ ఒక్కసారిగా మారిపోయింది. ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన హోస్టింగ్‌తో ఫుల్ పాపులర్ అయిపోయిందీ బ్యూటీ.

సినిమాల్లోకి ఎంట్రీ.. తక్కువే కానీ గుర్తింపు

సినిమాల్లోకి ఎంట్రీ.. తక్కువే కానీ గుర్తింపు

జబర్ధస్త్ షో ద్వారా దక్కిన గుర్తింపుతో అనసూయ భరద్వాజ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటోంది. 'సోగ్గాడే చిన్ని నాయన' అనే సినిమాతో టాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం' సహా ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలను పోషించింది. వీటన్నింటిలోనూ అత్యద్భుతమైన నటనను కనబరిచి ప్రశంసలు అందుకుంది.

ఫుల్ బిజీగా అనసూయ.. పవన్‌ మూవీలో

ఫుల్ బిజీగా అనసూయ.. పవన్‌ మూవీలో


అనసూయ ప్రస్తుతం జబర్ధస్త్ సహా పలు షోలను హోస్ట్ చేస్తోంది. అదే సమయంలో కొన్ని చిత్రాల్లోనూ మంచి మంచి పాత్రలను పోషిస్తోంది. ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న 'రంగమార్తాండ', 'థ్యాంక్యూ బ్రదర్'లో నటిస్తోంది. అలాగే సునీల్ 'వేదాంతం రాఘవయ్య', రవితేజ 'ఖిలాడీ'లోనూ కీలక పాత్రలు చేస్తోంది. అలాగే, పవన్ - క్రిష్ సినిమాలోనూ నటిస్తోందీ అమ్మడు.

ఎప్పుడూ అందులోనే... ట్రోల్స్... కౌంటర్లతో

ఎప్పుడూ అందులోనే... ట్రోల్స్... కౌంటర్లతో

వరుస సినిమాలు, షోలు చేస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది అనసూయ భరద్వాజ్. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, గ్లామరస్ ఫొటోలు, వీడియోలనూ వదులుతోంది. ఈ క్రమంలోనే ఆమె నెటిజన్ల నుంచి ట్రోల్స్‌కు గురవుతోంది. వాటికి స్ట్రాంగ్ కౌంటర్లు కూడా ఇస్తోంది.

అనసూయ నుంచి ఓ ఊహించని వీడియో

అనసూయ నుంచి ఓ ఊహించని వీడియో


సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ ఎంతో బిజీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ఓ వీడియోను అప్‌లోడ్ చేసిందామె. అందులో 'నాకెందుకు ప్రపోజ్ చేయలేదురా.. దానికి చేశావ్.. శృతికి చేప్పావ్.. గీతకు చెప్పావ్.. వాళ్లందరి కన్నా నేనే బాగుంటాను కదరా' అనే డైలాగ్‌ చెప్పింది అనసూయ భరద్వాజ్.

పెళ్లైపోయింది కదా.. రిప్లైలు మాత్రం అదుర్స్

పెళ్లైపోయింది కదా.. రిప్లైలు మాత్రం అదుర్స్

అనసూయ అప్‌లోడ్ చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. దీంతో దీనికి అప్పుడే దాదాపు యాభై వేల లైకులు వచ్చాయి. అదే సమయంలో ఈ వీడియోను ఉద్దేశించి 'నీకు పెళ్లైపోయింది కదా.. అందుకే ప్రపోజ్ చేయలేదు' అని ఒకరు కామెంట్ చేయగా.. 'భరద్వాజ్ గారు ఫీల్ అవుతారేమోనని చెప్పలేదనుకుంటా మేడమ్' అంటూ మరొకరు రిప్లై ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X