నువ్వు ఆ పని బాగా చేస్తావా? నా X ప్లేస్‌లోకి వస్తావా: కేతిక శర్మను అడగకూడనిది అడిగిన కుర్రాడు
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది భామలు తమదైన సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే హిట్లతో దూసుకుపోతుండగా.. మిగిలిన వాళ్లు మాత్రం వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నారు. అలాంటి వారిలో బొద్దుగుమ్మ కేతిక శర్మ ఒకరు. చాలా కాలంగా టాలీవుడ్‌లో మూవీలు చేస్తోన్న ఈ చిన్నది.. ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా ఖాతాలో వేసుకోలేదు. అయినా వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. ఇక, తాజాగా సోషల్ మీడియాలో చేసిన చిట్ చాట్‌లో కేతిక శర్మకు ఓ నెటిజన్ బిగ్ షాక్ ఇచ్చాడు. అసలేమైందో మీరే చూడండి!
అలా సెన్సేషన్.. సినిమాల్లో
మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే కేతిక శర్మ పాపులర్ అయింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ముఖ్యంగా 2016లో వచ్చిన 'థగ్ లవ్' అనే యూట్యూబ్ వీడియోతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. అలా పూరీ జగన్నాథ్ కొడుకు నటించిన 'రొమాంటిక్'తో కేతిక హీరోయిన్‌గా పరిచయం అయింది.

వరుస ఆఫర్లు.. హిట్ రాలే
'రొమాంటిక్' మూవీతో కేతిక శర్మకు గ్రాండ్ ఎంట్రీ సొంతం కాలేదు. అయినప్పటికీ ఆమెకు ఆఫర్లు వచ్చాయి. ఇలా వెంటవెంటనే నాగశౌర్యతో కలిసి 'లక్ష్య', వైష్ణవ్ తేజ్‌తో కలిసి 'రంగరంగ వైభవంగా' మూవీలోనూ చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు విజయాన్ని మాత్రం అందించలేదు. ఫలితంగా టాలీవుడ్ హీరోయిన్‌గా కేతిక శర్మ కెరీర్ ముగిసిపోతుందని అంతా అనుకున్నారు.

పవన్ కూడా గట్టెక్కించలే
తెలుగు చిత్ర పరిశ్రమలో కేతిక శర్మ చాలా సినిమాల్లోనే హీరోయిన్‌గా చేసింది. కానీ, ఆమెకు విజయం మాత్రం అందని ద్రాక్షలా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో గత ఏడాది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన 'బ్రో' మూవీలో కేతిక హీరోయిన్‌గా చేసింది. ఇందులో తనదైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది కానీ సక్సెస్ ట్రాక్ మాత్రం ఎక్కలేదు.

అందులో యమ యాక్టివ్‌గా
హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన కేతిక శర్మ.. అప్పటి నుంచి అందులో ఫుల్ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో ఈ బ్యూటీ తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలతో ఫ్యాన్స్‌కు ఖుషీ చేస్తూ... తరచూ వార్తల్లోనే హెడ్‌లైన్ అయిపోతోంది.

ఇన్‌స్టాలో షాకిచ్చేశాడుగా
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కేతిక శర్మ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో చిట్ చాట్ (Ask Me Session) నిర్వహించింది. ఇందులో తన పర్సనల్ లైఫ్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ అడగకూడనిది అడిగి కేతిక శర్మకు బిగ్ షాక్ ఇచ్చాడు.

నువ్వు ఆ పని బాగా చేస్తావా?
కేతిక శర్మ సెషన్‌లో ఓ నెటిజన్ 'నువ్వు ఆల్‌జీబ్రాలో గుడ్‌యేనా? ఒకవేళ నిజం అయితే.. నువ్వు ఎందుకు అని అడగకుండా వెంటనే నా ఎక్స్ (మాజీ ప్రేయసి) స్థానంలోకి వచ్చేయ్. లవ్ యూ' అని కామెంట్ పెట్టాడు. దీంతో షాకైన కేతిక శర్మ వెంటనే సిగ్గుతో నోరు మూసుకుంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











