అక్కా.. నాతో దానికి ఒప్పుకుంటావా? సమాజం సిగ్గుపడేలా హీరోయిన్‌తో కుర్రాడి ప్రవర్తన
గతంలో కంటే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చే హీరోయిన్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. అలా ఎంతో మంది వచ్చినప్పటికీ కొందరికి మాత్రమే సరైన గుర్తింపు లభిస్తోంది. అలాంటి వారిలో తమిళ చిన్నది తాన్యా రవిచంద్రన్ ఒకరు. మంచి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే మూవీల్లోకి వచ్చిన ఈ భామ.. తెలుగులో పలు చిత్రాల్లో తళుక్కున మెరిసింది. ఇప్పుడు మాత్రం మాతృ భాషలోనే మూవీలు చేస్తోంది. ఇలాంటి సమయంలో తాన్యా రవిచంద్రన్‌కు ఓ కుర్రాడు ఊహించని షాక్ ఇచ్చాడు. అసలు ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసమే!
అలా పరిచయం అయింది:తమిళ సీనియర్ నటుడు రవిచంద్రన్ మనవరాలే తాన్యా రవిచంద్రన్. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఇష్టం ఉన్న ఈ భామ.. 'బల్లే ఎల్లైయత్తేవా' అనే సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. దీని తర్వాత 'బృందావనం', 'కరుప్పన్' వంటి చిత్రాల్లో నటించింది. తద్వారా కోలీవుడ్‌లో విశేషమైన గుర్తింపును, ఫాలోయింగ్‌ను సైతం సొంతం చేసుకుంది.

తెలుగులో ఆ సినిమాలతో:తమిళ చిత్ర పరిశ్రమలో వరుసగా మూవీలు చేస్తోన్న సమయంలోనే తాన్యా రవిచంద్రన్ 'రాజా విక్రమార్క' అనే చిత్రంతో తెలుగులోకి అడుగు పెట్టింది. కార్తికేయ గుమ్మకొండ హీరోగా చేసిన ఈ చిత్రం ఆశించిన రీతిలో విజయాన్ని అందుకోలేదు. దీంతో ఆమె మరోసారి టాలీవుడ్‌లో హీరోయిన్‌గా నటించలేదు. కానీ, చిరంజీవి 'గాడ్ ఫాదర్' చిత్రంతో ఓ కీలక పాత్రను పోషించింది.
తమిళంలో రసవతిగా రాక:తెలుగులో సినిమాలు చేయకున్నా తాన్యా రవిచంద్రన్ తమిళంలో మాత్రం హవాను చూపిస్తోంది. ఇప్పటికే ఈ భామ 'నెంజుక్కు నీతి', 'మాయోన్', 'ట్రిగ్గర్', 'అగిలాన్' వంటి మూవీలు చేసింది. ఇక, ఇప్పుడు 'రసవతి' అనే చిత్రంలో నటించింది. ఈ మూవీ తాజాగా విడుదలైంది. దీనికి ముందు నుంచీ ఆశించినట్లుగానే డీసెంట్ టాక్ కూడా లభించింది.

మంచి పేరు వస్తుందని:కోలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతోన్న తాన్యా రవిచంద్రన్ 'రసవతి' సినిమా రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఇందులో భాగంగానే ఓ న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్బంగా 'రసవతి సినిమాలో నా పాత్ర అందరికీ నచ్చుతుంది. ఇది నాకు ఎంతో మంచి పేరును కూడా తీసుకు వస్తుంది' అంటూ తాన్యా రవిచంద్రన్ చెప్పుకొచ్చింది.

అక్కా పెళ్లి చేసుకుంటావా:ఇదే ఇంటర్వ్యూలో తానా రవిచంద్రన్ తన పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'గతంలో నేను ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చాట్ పెట్టాను. అప్పుడు అభిమాని అన్న మాటకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఒక కుర్రాడు నాతో ''అక్కా.. నన్ను పెళ్లి చేసుకుంటావా'' అని అడిగాడు' అంటూ ఆమె వెల్లడించింది.

నా మైండ్ బ్లాక్ అయింది:ఆ తర్వాత తాన్యా రవిచంద్రన్ కంటిన్యూ చేస్తూ.. 'సదరు అభిమాని అడిగిన ప్రశ్న మొదట నాకు అర్థం కాలేదు. తర్వాత మళ్లీ చూస్తే అర్థం అయింది. అక్క అనడం ఏంటి? పెళ్లి చేసుకోమనడం ఏంటి? నేను షాక్‌కు గురయ్యాను. అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. దీంతో అది స్కిప్ చేసేశాను' అంటూ తనకు జరిగిన వింత అనుభవాన్ని పంచుకుంది.


Click it and Unblock the Notifications











