రాముడు సరే.. నీ భర్త కట్టిన తాళి ఏది? అనసూయ శ్రీరామనవమి పోస్టుపై దారుణంగా ట్రోల్స్

యాంకర్ నుంచి యాక్టర్‌గా మారిన అనసూయ భరద్వాజ్ తెలుగు సినిమా రంగంలో టాలెంటెడ్ ఫిలిం పర్సనాలిటీలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఇటీవల కాలంలో ఆమె పోషించిన పాత్రలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నది. రంగస్థలం సినిమాకు ముందు ఆ తర్వాత అనే విధంగా అనసూయ కెరీర్ ముందుకు సాగుతున్నది. అయితే తాజాగా శ్రీరామనవమి సందర్భంగా ఆమె ఇన్స్‌టాగ్రామ్‌లో చేసిన పోస్టుపై మిక్స్‌డ్ రియాక్షన్ వస్తున్నది. అయితే ఆమె పోస్టుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

కెరీర్ ఆరంభంలో అనసూయ గ్లామర్ తారగా అనేక మంది అభిమానులను సొంతం చేసుకొన్నది. రంగస్థంల సినిమా తర్వాత ఆమె నటించిన యాత్ర, పుష్ప, దర్జా, విమానం, రంగ మార్తండ, పెదకాపు, ప్రేమ విమానం, రజాకార్, పుష్ప 2 సినిమాలతో ఆమె నటిగా మరో రేంజ్‌కు వెళ్లారు. బరువైన పాత్రలతో నటిగా మెచ్యురిటీని ప్రదర్శిస్తున్నారు. నటిగా మంచి పాత్రలు ఆమెను వెతుక్కొంటూ వస్తున్నాయి.

Netizen trolls Anasuya Bharadwaj

నటిగానే కాకుండా యాంకర్‌గా అడపదడపా పాత్రలు పోషిస్తున్న అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఇన్స్‌టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో తన లేటెస్ట్ ఫోటోషూట్‌లతో అప్ టూ డేట్ ఉంటారు. తన అభిమానులకు ఫోటోలు షేర్ చేస్తూ ముచ్చట తీర్చేస్తుంటారు. ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉంటారు.

అయితే సోషల్ మీడియాలో వివాదాలకు మారుపేరుగా కూడా అనసూయ అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. ముక్కు సూటిగా వ్యవహరించే ఆమెను చాలా మంది హీరోలు ట్రోల్ చేస్తూ కనిపిస్తుంటారు. తెలుగులో ఓ హీరోను ఆమె కూడా టార్గెట్ చేస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటారు. ఆమె తీరును సోషల్ మీడియాలో కొందరు సమర్ధిస్తే.. మరి కొందరు ప్రతికూలంగా కామెంట్ చేస్తుంటారు.

అయితే శ్రీరామనవమి సందర్భంగా ఎప్పటిలానే తన లేటేస్ట్ ఫోటోషూట్‌ను ఇన్స్‌టాలో షేర్ చేశారు. తన భర్త భరద్వాజ్, తను అందంగా ముస్తాబై.. పండుగంతా వారిపైనే ఉట్టిపడేలా తయరయ్యారు. సీతారాములుగా పోల్చుకొంటూ ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఆ ఫోటోలతోపాటు నా రాముడితో నేను. శ్రీరామ నవమి పర్వదిన శుభాకాంక్షలు అంటూ మెసేజ్ కూడా పోస్టు చేశారు. ఓ ప్రముఖ టెలివిజన్ ఛానెల్ కోసం రూపొందించిన కార్యక్రమం కోసం అంటూ పోస్టు పెట్టారు. ఆ పోస్టుకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అనసూయ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ.. మీరిద్దరూ చూడముచ్చటగా ఉన్నారు. మీరు కలకాలం చల్లగా ఉండాలని కోరుకొంటున్నాం. సూపర్ జోడి అంటూ కామెంట్లు పెట్టారు. మీరు ఎలాంటి పార్టీ చేసుకొన్నా.. మీ ఫ్యామిలీతోనే.. భర్తతోనే చేసుకొంటారు అని నెటిజన్లు కామెంట్ చేశారు. అయితే ఓ తుంటరి నెటిజన్ మాత్రం మరోలా స్పందిస్తూ... మీరు రాముడు కట్టిన తాళిని వేసుకొంటే ఇంకా బాగుంటుంది అని కామెంట్ చేయడం, దానికి భారీగా లైకులు రావడం కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X