హీరోయిన్‌ను అవి చూపించమన్న నెటిజన్.. ఫొటో షేర్ చేసి కోరిక తీర్చిన బ్యూటీ

సాధారణంగా సినీ రంగంలో వరుసగా మూవీలు చేస్తేనే తరచూ వార్తల్లో ఉండేవారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో దీని ద్వారానే ఎంతో మంది భామలు హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో కన్నడ బ్యూటీ నభా నటేష్ ఒకరు.

సుదీర్ఘమైన కెరీర్‌లో ఆమె తక్కువ సినిమాలే చేసినా ఇలానే ఎక్కువగా పేరు తెచ్చుకుంది. అదే సమయంలో అడపాదడపా ఆఫర్లను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా నభా నటేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో లైవ్ చాట్ నిర్వహించగా.. నెటిజన్ వింత కోరిక కోరాడు. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!

Netizen Unexpected Request To Heroine Nabha Natesh

అలా వచ్చిన హీరోయిన్
బెంగళూరకు చెందిన నభా నటేష్ మోడలింగ్ రంగంలో తనదైన అందచందాలతో సెన్సేషన్ అయింది. దీంతో ఎంతో మంది ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించింది. ఇలా 'వజ్రకాయ' అనే చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలెట్టింది. ఆ తర్వాత కూడా శాండిల్‌వుడ్‌లో కొన్ని చిత్రాలు చేసింది. ఈ క్రమంలోనే 'నన్ను దోచుకుందువటే' మూవీతో నభా తెలుగులోకి వచ్చింది.

Netizen Unexpected Request To Heroine Nabha Natesh

ఇస్మార్ట్ హిట్‌తో గుర్తింపు

ఫస్ట్ మూవీతోనే తెలుగు ప్రేక్షకుల చూపును తనవైపు లాగేసుకున్న నభా నటేష్‌కు ఆ తర్వాత ఇక్కడ ఎన్నో అవకాశాలు వచ్చాయి. దీంతో ఆ వెంటనే 'అదిగో' అనే చిత్రంలో నటించింది. అనంతరం నభా నటేష్ 'ఇస్మార్ట్ శంకర్' మూవీలోనూ చేసింది. ఈ క్రేజీ సినిమా ఆమె కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడంతో పాటు ఆమెకు మరింత టాలీవుడ్‌లో మంచి పేరును తెచ్చింది.

Netizen Unexpected Request To Heroine Nabha Natesh

ఆ మూవీలు.. డార్లింగ్‌గా
'ఇస్మార్ట్ శంకర్' తర్వాత కూడా నభా నటేష్‌కు తెలుగులో ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే వరుసగా 'డిస్కో రాజా', 'సోలో బ్రతుకే సో బెటర్', 'అల్లుడు అదుర్స్', 'మాస్ట్రో' వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఎందుకనో సిని కెరీర్‌కు బ్రేక్ ఇచ్చేసింది. అయితే, ఇప్పుడు ప్రియదర్శితో కలిసి 'డార్లింగ్' అనే సినిమాలో నభా నటేష్ నటిస్తోంది.

Netizen Unexpected Request To Heroine Nabha Natesh

సోషల్ మీడియా ద్వారా

హీరోయిన్‌గా వచ్చిన తర్వాత కొన్ని సినిమాలు మాత్రమే చేసినప్పటికీ నభా నటేష్ ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అప్పుడు వరుసగా సినిమాలు చేసింది. కానీ, ఇప్పుడు కెరీర్‌ను కంటిన్యూ చేయట్లేదు. అయినప్పటికీ నభా నటేష్ సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.

Netizen Unexpected Request To Heroine Nabha Natesh

నెటిజన్ వింత కోరికతో
సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే నభా నటేష్ తరచూ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. అదే సమయంలో అప్పుడప్పుడూ ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తోంది. ఇలా ఇటీవలే ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో లైవ్ చాట్ నిర్వహించింది. ఇందులో ఓ నెటిజన్ 'నీ గోర్లు చూపించు' అంటూ నభా నటేష్ ముందు ఎవరూ ఊహించని విధంగా వింత కోరికను కోరుకున్నాడు.

Netizen Unexpected Request To Heroine Nabha Natesh

కోరికను తీర్చిన బ్యూటీ

సదరు నెటిజన్ తన గోర్లను చూపించమని అడగ్గానే ఏమాత్రం సంకోచించకుండా నభా నటేష్ ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె తన చేతి గోర్లు కనిపించేలా ముడుచుకుని ఉంది. అంతేకాదు, ఇప్పుడు చూసినవి షేప్ లేకుండా మామూలుగా ఉన్నవి అన్నట్లుగా క్యాన్షన్ కూడా ఇచ్చింది. అంతే.. ఇప్పుడు ఇదంతా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X