కుక్క పిల్లతో పాయల్ పాడుపనులు.. షర్ట్‌ లోపలికి పంపి, ఏకీపారేస్తోన్న నెటిజన్లు

అందం , అభినయం ఉన్నప్పటికీ కొందరు హీరోయిన్లకు కాలం కలిసి రావడం లేదు. ఇదే కోవలోకి వస్తారు పాయల్ రాజ్‌పుత్. ఆర్ఎక్స్ 100 మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పాయల్ తొలి చిత్రంతోనే యూత్‌ని ఊపేశారు. ఇందులో అందాల ఆరబోతతో పాటు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించి మెప్పించారు. చాలా కాలం వరకు ఆర్ఎక్స్ 100 ఇందూ అంటే కుర్రాళ్లు వణికిపోతారంటే పాయల్ నటనను అర్ధం చేసుకోవచ్చు.

బుల్లితెర ద్వారా ఎంట్రీ

ఢిల్లీకి చెందిన పాయల్ రాజ్‌పుత్ తొలుత బుల్లితెర ద్వారా కెరీర్ ప్రారంభించారు. సప్నోన్ సే భరే నైనా సీరియల్‌లో సోనాక్షి పాత్రతో ఆమె టెలివిజన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వరుస సీరియళ్లతో పాపులరైన ఈ ముద్దుగుమ్మ 2017లో చెన్నా మెరయా అనే పంజాబీ చిత్రం ద్వారా సినీ ప్రవేశం చేశారు. ఆ తర్వాత వీరే కీ వెడ్డింగ్ అనే హిందీ సినిమాలో నటించారు. ఈ క్రమంలో దర్శకుడు అజయ్ భూపతి కళ్లలో పడటంతో ఆమెకు ఆర్ఎక్స్ 100లో హీరోయిన్‌గా అవకాశం దక్కింది.

Netizens are trolling heroine Payal Rajput for her behavior while playing with her puppy

యువతలో పాయల్ క్రేజ్

అనంతరం ఎన్టీఆర్ కథానాయకుడు, సీత, ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, అనగనగా ఒక అతిథి, తీస్‌మార్ ఖాన్, మాయాపేటిక, మంగళవారం, రక్షణ వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రస్తుతం తమిళంలో గోల్‌మాల్, ఏంజెల్ .. తెలుగులో కిరాతక సినిమాలలో పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, పంజాబీ, హిందీ భాషలలో ఆమె బిజీ అయ్యారు. చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయినా పాయల్‌కు మాత్రం యువతలో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

నెపోటిజంపై పాయల్ ఘాటు వ్యాఖ్యలు

ఏ విషయంపై అయినా మొహమాటం లేకుండా మాట్లాడటం పాయల్ స్టైల్. కొద్దిరోజుల క్రితం పరిశ్రమలో నెపోటిజం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నటీనటులను ప్రతిరోజూ అనిశ్చితి వెంటాడుతూనే ఉంటుందని.. బంధుప్రీతి, వివక్ష పైచేయి సాధించే లోకంలో టాలెంట్ ఉన్నా నిరూపించుకోవడం కష్టమని పాయల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో వారసులు, బంధువులదే రాజ్యమని.. టాలెంట్ ఉన్నా సరైన గుర్తింపుప దక్కడం లేదని పాయల్ రాజ్‌పుత్ పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది.

క్యాన్సర్ బారినపడ్డ పాయల్ తండ్రి

తన కెరీర్ వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని పలుమార్లు చెప్పారు పాయల్ రాజ్‌పుత్ అలాంటిది ఆమె తండ్రి క్యాన్సర్ బారినపడటంతో ఆమె తట్టుకోలేకపోయారు. తన తండ్రి ఎసోఫెగల్ బారినపడ్డారని, చికిత్స తీసుకుంటున్నారని ఇటీవల పాయల్ ప్రకటించి కన్నీటి పర్యంతమయ్యారు. ఇంత బాధలోనూ తనను షూటింగ్‌కు వెళ్లమని తండ్రి చెబుతున్నారంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు.

Take a Poll

కుక్కపిల్లతో అలాంటి పనులు

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే పాయల్ రాజ్‌పుత్ తన వ్యక్తిగత వివరాలు, సినిమాలు, ఇతర సంగతులను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్‌లతో ఆమె కుర్రాళ్లకు సెగలు రేపుతుంటారు. తాజాగా పాయల్ రాజ్‌పుత్ షేర్ చేసిన వీడియో దుమారం రేపుతోంది. తొలి నుంచి తన పెట్ డాగ్స్‌తో గడపడం, వాటితో ఆడుకోవడం పాయల్‌కు చాలా ఇష్టం. ఈ క్రమంలోనే యెల్లో కలర్ షర్ట్ ధరించిన ఈ ముద్దుగుమ్మ.. ఓ కుక్కపిల్లని తన షర్ట్ లోపలికి పంపించి దానికి ముద్దులు పెట్టి మురిసిపోయారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా అది కాస్తా వైరల్ అయ్యింది. కుక్కపిల్లతో అలాంటి పనులేంటీ అంటూ నెటిజన్లు పాయల్ రాజ్‌పుత్‌ను ఏకీపారేస్తున్నారు.

More from Filmibeat

Read more about: payal rajput movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X