For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'ఆ' సజేషన్స్ అడిగిన ఎన్టీఆర్ హీరోయిన్.. నెటిజన్ షాకింగ్ కౌంటర్.. వామ్మో ఇది మామూలుగా లేదు!

  |

  'అంతకు ముందు ఆ తర్వాత' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈషా రెబ్బా. ఆ తర్వాత 'బందిపోటు', 'అమీ తుమీ', వంటి సినిమాల్లో నటించినా ఎందుకో కానీ ఈ భామకు సరైన బ్రేక్ రాలేదు. ఐతే నాని నిర్మాణంలో తెరకెక్కిన 'అ', త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబో లో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాల్లో అవకాశాలు రావడంతో ఈమెకు కాస్త గుర్తింపు లభించింది. అయితే ఈ భామ ఇప్పుడు సోషల్ మీడియాలో చేసిన ఒక ఇంటరాక్టివ్ సెషన్ ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

  గ్లామర్‌ కంచెలు తెంచేసి

  గ్లామర్‌ కంచెలు తెంచేసి

  టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు క్లిక్ అవ్వరు అని అంటూ ఉంటారు, అందుకు తగ్గట్టుగానే వాళ్ళు గ్లామర్‌కి దూరం ఉంటూ వస్తారు. కానీ ట్రెండ్ మారింది. ఇప్పుడు ఒక్కొక్కరుగా తెలుగమ్మాయిలు కూడా గ్లామర్‌ డోస్ పెంచేసి వేడి పెంచేస్తూ సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నారు. అదే కోవలో నిన్న మొన్నటి దాకా ట్రెడిషనల్‌గా ఉంటూ, గ్లామర్‌కి దూరంగా తెలుగమ్మాయి ముద్ర వేసుకున్న ఈషా రెబ్బ కూడా గ్లామర్‌ కంచెలు తెంచేసింది.

  హాట్ హాట్ ఫొటోలతో

  హాట్ హాట్ ఫొటోలతో

  ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తో కుర్రకారులో ఫాలోయింగ్ పెంచుకుంటోంది. కథానాయికగా తాను చేస్తున్న సినిమాలతో మెప్పించినా.. ఈ అమ్మడికి ఆశించిన స్ధాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదనే చెప్పాలి. అందుకే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ హీరోయిన్ గా మాత్రమే కాక సెకండ్ హీరోయిన్ పాత్రలు చేయడానికి కూడా ఏమాత్రం వెనుకాడడం లేదు.

   పిట్టకధలతో

  పిట్టకధలతో

  చివరిగా ఈ భామ నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ అయిన పిట్ట కధలులో నటించింది. పెళ్ళయినా ప్రేమను మర్చిపోలేక ప్రియుడితో సంబంధం పెట్టుకున్న పాత్రలో నటించింది. ఈ పాత్రలో ఆమె నటన అందరినీ మెప్పించింది. ఇక ఆ విషయం పక్కన పెడితే ఆమె అంతకు ముందు శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన రాగల 24 గంటల్లో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు.

   సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్

  సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్

  ఇక ఈషా రెబ్బాకు సోషల్‌మీడియాలో ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటివి అనే సంగతి పక్కన పెడితే ఈ అమ్మడు ఫోటోలు పెట్టిందంటే చాలు ఆమె ఫాలోవర్లు తెగ లైకులు, కామెంట్లు చేస్తుంటారు. ఈ మధ్య కూడా ఈషా కింద కూర్చొని, నవ్వులు చిందిస్తూ ఫోటోషూట్ నిర్వహించి.. ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

  వరల్డ్ టూర్ కౌంటర్

  వరల్డ్ టూర్ కౌంటర్

  ఇక తాజాగా ఆమె ట్విట్టర్ లో తన అభిమానులతో ఒక ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించింది. టెక్నాలజీలో కొత్త విషయాలు ఏమైనా ఉంటే సజేషన్స్ ఇవ్వమని ఆమె కోరింది. ఈ క్రమంలో ఆమెతో నెటిజన్లు ఆసక్తికరంగా స్పందించారు. అందులో ఒక నెటిజన్ వీపీఎన్(వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్) ఆన్ చేయండి అలా చేస్తే వరల్డ్ టూర్ చేసి రావచ్చు అని ఎద్దేవా చేశాడు. పాపం వీపీఎన్ అంటే తెలియదు ఏమో కానీ ఆమె మొబైల్ కి మంచి వీపీఎన్ ఉంటే సజెస్ట్ చేయండి అని మళ్ళీ కోరింది. నిజానికి బ్రౌస్ చేస్తున్న లొకేషన్ తెలియకుండా కన్ఫ్యూజ్ చేసి బ్రౌస్ చేయడానికి ఈ వీపీఎన్ ను వాడుతుంటారు. ఆ విషయం తెలియక ఆమె పాపం అమాయకంగా తిరిగి ప్రశ్నించింది.

  లస్ట్ స్టోరీస్.. దానికి సిద్ధమైన ఈషా రెబ్బా..!!

  లక్కీ ఛాన్స్

  ఇక ఈ భామ అక్కినేని అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాలో నటిస్తోంది. మరో పక్క ఈషాకు మరో లక్కీ ఛాన్స్ కూడా వచ్చిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. సమంత టైటిల్ రోల్ లో నటిస్తున్న శాకుంతలం సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ కూడా మొదలయిన ఈ సినిమాలో నటించే ఛాన్స్ ను ఈషా రెబ్బా దక్కించుకుందని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.

  English summary
  Tollywood actress Eesha Rebba started her career as a model and later established herself as a leading actress in Telugu. Eesha is famous for Anthaka Mundu Aa Tarvatha, Ami Thumi, Awe, Aravinda Sametha Veera Raghava, and Raagala 24 Gantallo. She will be next seen in Akhil Akkineni starrer Most Eligible Bachelor and Tamil film Aayiram Jenmangal. Her latest twitter interaction session gone viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X