For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శ్రీముఖికి కోలుకోలేని షాక్: అతడిని గుర్తు చేస్తూ కొంటె ప్రశ్నలు.. ఆ ఫొటోలు బయట పెట్టిన రాములమ్మ

  |

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా వెలుగొందుతున్నారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్నారు. అలాంటి వారిలో నిజామాబాద్ పిల్ల శ్రీముఖి ఒకరు. చూపు తిప్పుకోకుండా చేయగల అందంతో పాటు అద్భుతమైన టాలెంట్‌తో అలరిస్తోన్న ఈ బ్యూటీ.. వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకెళ్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ఇలాంటి సమయంలో తాజాగా కొందరు నెటిజన్లు శ్రీముఖికి కోలుకోలేని షాక్ ఇచ్చారు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  సినిమా నటిగా ప్రయాణం మొదలెట్టింది

  సినిమా నటిగా ప్రయాణం మొదలెట్టింది

  సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రయత్నాలు సాగించిన శ్రీముఖి.. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'జులాయి'తో శ్రీముఖి నటిగా పరిచయం అయింది. దీని తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్', 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' సహా పలు చిత్రాల్లో మంచి మంచి పాత్రలతో మెప్పించింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో లీడ్ రోల్ చేసి తన సత్తాను నిరూపించుకుంది.

  అదుర్స్‌తో యాంకర్‌గా మారిన శ్రీముఖి

  అదుర్స్‌తో యాంకర్‌గా మారిన శ్రీముఖి

  నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న శ్రీముఖి.. 'అదుర్స్' అనే షోతో బుల్లితెర యాంకర్‌గానూ మారింది. అందులో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత. 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది' సహా ఎన్నో కార్యక్రమాలను హోస్ట్ చేసింది. సుదీర్ఘమైన కెరీర్‌లో 'పటాస్' ఆమెకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది.

  బిగ్ బాస్ నుంచి ఆమెకు బ్రేక్ వచ్చింది

  బిగ్ బాస్ నుంచి ఆమెకు బ్రేక్ వచ్చింది

  'పటాస్'లో సందడి చేస్తూ దూసుకుపోతోన్న సమయంలోనే శ్రీముఖికి బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. దీంతో ఆ షోకు గుడ్‌బై చెప్పేసి.. రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆమె.. రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ క్రేజ్‌ను మాత్రం దక్కించుకుంది. ఫలితంగా భారీ ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోందీ బ్యూటీ.

  ఇప్పుడలా బిజీ.. వరుస అవకాశాలతో

  ఇప్పుడలా బిజీ.. వరుస అవకాశాలతో

  బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రీముఖి కొంత కాలం ఖాళీగానే ఉంది. కానీ, ఇప్పుడు మాత్రం వరుస అవకాశాలతో రచ్చ చేస్తోంది. సినిమా ఫంక్షలు, ఇంటర్వ్యూలు, షోలు, సినిమాలు ఇలా అన్నింట్లోనూ కనిపిస్తూ సత్తా చాటుతోంది. అదే సమయంలో లూవీ అనే బిజినెస్‌ను ప్రారంభించింది. ఇక, 'క్రేజీ అంకుల్స్', 'మాస్ట్రో' సినిమాల్లో నటిస్తూ సందడి చేయబోతుంది.

  ఎప్పుడూ అందులోనే రచ్చ చేస్తుందిగా

  ఎప్పుడూ అందులోనే రచ్చ చేస్తుందిగా

  ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోన్న శ్రీముఖి సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. ఫలితంగా ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

  శ్రీముఖికి కోలుకోలేని షాకిచ్చిన నెటిజన్స్

  శ్రీముఖికి కోలుకోలేని షాకిచ్చిన నెటిజన్స్

  తాజాగా శ్రీముఖి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతలో ఫాలోవర్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌ను నిర్వహించింది. ఇందులో నెటిజన్లు వింత వింత ప్రశ్నలతో ఆమెకు చుక్కలు చూపించారు. ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన పర్సనల్ విషయాలను సైతం అడుగుతూ చిరాకు తెప్పించారు. అదే సమయంలో ఆమె తమ్ముడు సుష్రుత్ గురించి కూడా ప్రశ్నిస్తూ శ్రీముఖికి కోలుకోలేని షాక్ ఇచ్చారు.

  Recommended Video

  Alia Reza About Nagarjuna | Wild Dog Interview Part 5
  అతడిని గుర్తు చేస్తూ కొంటె ప్రశ్నలతో

  అతడిని గుర్తు చేస్తూ కొంటె ప్రశ్నలతో

  ఈ సెషన్‌లో 'మీ బ్రదర్ సుష్‌ను ప్రేమిస్తున్నాను' అని ఓ నెటిజన్ అంటే.. 'మీ బ్రదర్‌ను పెళ్లి చేసుకోవచ్చా' అని మరో నెటిజన్ శ్రీముఖిని ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. 'నీతో యూట్యూబ్ వీడియోలు చేయాలంటేనే భయమేస్తుంది. సగం కామెంట్లు నీ గురించే వస్తున్నాయ్' అని ఒకరికి.. 'నేను పోతా.. తమ్ముడు పోతా.. నాకు ఈ అకౌంట్ వద్దు' అంటూ మరొకరికి రిప్లై ఇచ్చింది.

  English summary
  Actress and Television Presenter Sreemukhi Conduct Question And Answer Session in her Instagram. In This Session Netizens Ask her Brother Sushruth
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X