For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తెలుగు హీరోయిన్‌కు నెటిజన్ షాక్: నువ్వు నా లవర్‌లా ఉన్నావు.. ఆ ఫొటోలు చూపించు అంటూ!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు విపరీతంగా సందడి చేశారు. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకున్నారు. కానీ, కొందరు మాత్రం అందం, అభినయం ఉన్నా ఎందుకనో అవకాశాలను దక్కించుకోలేకపోయారు. అలా తమ కెరీర్‌లను ప్రశ్నార్థకం చేసుకున్నారు. అలాంటి వారిలో తెలుగు హీరోయిన్ పూనమ్ బజ్వా ఒకరు.

  అన్నీ ఉన్నా అదృష్టం లేక ఎక్కువ కాలం టాలీవుడ్‌లో కొనసాగలేకపోయింది. తద్వారా తెలుగు ప్రేక్షకులకు దూరం అయిపోయింది. కానీ, సోషల్ మీడియా ద్వారా ఈ అమ్మడు నిత్యం టచ్‌లోనే ఉంటూ మజాను పంచుతోంది. ఈ క్రమంలోనే తాజాగా పూనమ్ బజ్వాకు పలువురు నెటిజన్లు షాక్ మీద షాక్ ఇచ్చారు. ఆ వివరాలేంటో మీరే చూడండి!

  వైజాగ్ బ్యూటీ.. అప్పుడే ఫేమస్

  వైజాగ్ బ్యూటీ.. అప్పుడే ఫేమస్


  పూనమ్ బజ్వా విశాఖపట్నంలో జన్మించింది. చదువును కూడా అక్కడే పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడు మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన పూనమ్.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. తద్వారా ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా చేసింది. దీంతో ఫుల్ ఫేమస్ అయిపోయింది.

  స్టేజ్ మీదే హీరోయిన్‌కు ముద్దులు: ఏకంగా ఇద్దరితో.. ఆమె రియాక్షన్ చూశారంటే!

  మొదటి సినిమానే ఫస్ట్ చిత్రం

  మొదటి సినిమానే ఫస్ట్ చిత్రం


  మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే పూనమ్ బజ్వా.. కూచిపూడి వెంకట్ తెరకెక్కించిన ‘మొదటి సినిమా'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో నవదీప్ హీరోగా నటించాడు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం అంతగా ఆడలేదు. కానీ, నటిగా పూనమ్ బజ్వాకు మాత్రం మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఫలితంగా ఆమెకు ఆఫర్లు వచ్చాయి.

  వరుస సినిమాలు... బ్రేక్ లేదు

  వరుస సినిమాలు... బ్రేక్ లేదు

  పూనమ్ బజ్వా ‘మొదటి సినిమా' తర్వాత.. నవదీప్‌తో కలిసి ‘ప్రేమంటే ఇంతే', అక్కినేని నాగార్జున సరసన ‘బాస్' అనే సినిమాల్లో మాత్రమే హీరోయిన్‌గా నటించింది. వీటితో పాటు ‘వేడుక', ‘పరుగు' సినిమాల్లోనూ సపోర్టింగ్ రోల్స్ చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు హిట్‌ను అందించలేకపోయాయి. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ అమ్మడు గ్యాప్ తీసుకుంది.

  షార్ట్ డ్రెస్‌లో యాంకర్ హరితేజ రచ్చ: నడిరోడ్డు మీదే అలా.. వీడియో వైరల్

  అక్కడ మాత్రం యమ సక్సెస్

  అక్కడ మాత్రం యమ సక్సెస్


  పూనమ్ బజ్వా తెలుగులో సినిమాలు చేయకున్నా.. దక్షిణాదిలోని మిగిలిన భాషల్లో మాత్రం వరుస పెట్టి ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే తమిళం, మలయాళం, కన్నడంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. దీంతో ఆయా ఇండస్ట్రీల్లో స్టార్ హీరోయిన్ అయింది. ఇక, సుదీర్ఘ కాలం తర్వాత ‘ఎన్.టీ.ఆర్' బయోపిక్‌తో రీఎంట్రీ ఇచ్చేసింది.

  సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

  సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

  గతంలో వరుసగా సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో పెద్దగా సినిమాలు చేయకున్నా.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది పూనమ్ బజ్వా. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడిస్తోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను వదులుతూ హైలైట్ అవుతోంది.

  Mehreen Kaur Pirzada: మెహ్రీన్ అందాల విందు.. అబ్బో ఆమె డ్రెస్ చూస్తే!

  స్విమ్ సూట్ ఫొటోలు అడగ్గా

  స్విమ్ సూట్ ఫొటోలు అడగ్గా


  తాజాగా టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ బజ్వా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ASK ME సెషన్ నిర్వహించింది. ఇందులో ఓ నెటిజన్ ఆమెను ‘మీరు రీసెంట్‌గా దిగిన స్విమ్ సూట్ ఫొటోలను మేము చూడొచ్చా' అని అడిగాడు. దీంతో పూనమ్ స్విమ్ సూట్‌లో దిగిన ఫొటోను షేర్ చేసింది. అంతేకాదు, మరికొన్నింటిని త్వరలోనే వదులుతా అని సమాధానం కూడా ఇచ్చేసింది.

  నా లవర్‌లా ఉన్నావని చెప్తూ

  నా లవర్‌లా ఉన్నావని చెప్తూ


  ఇక, ఇదే సెషన్‌లో మరో నెటిజన్ పూనమ్ బజ్వాను ఉద్దేశిస్తూ ‘నువ్వు చూడ్డానికి అచ్చం మా గర్ల్‌ఫ్రెండ్‌లా ఉన్నావు' అని అన్నాడు. దీనికి ఆ హీరోయిన్ ‘ఇప్పుడు నేనేం చేయాలి. నీ గర్ల్‌ఫ్రెండ్‌కు హాయ్ చెప్పానని చెప్పు' అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో పూనమ్ షేర్ చేసిన ఈ ఫొటోలు, సమాధానాలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తూ వైరల్ అవుతున్నాయి.

  English summary
  Tollywood actress and a former model Poonam Bajwa Full Active In Social Media. Now Netizens Gave Shocks in Instagram Chat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X