ఇండియన్ సినిమా ఇజ్టత్ తీయకు తల్లి.. డయానా పెంటీ డ్రెస్‌పై నెటిజన్ల ట్రోలింగ్
ప్రపంచ సినిమాకు వేదికగా మారిన ది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 సినీ తారలు, సెలబ్రిటీలు, బిజినెస్ మాగ్నెట్స్‌తో కళకళలాడుతున్నది. ఈ వేదికపై భారతీయ సినీ తారలు సారా ఆలీ ఖాన్, మృణాళ్ థాకూర్, మనుషీ చిల్లార్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, దీపిక పదుకోన్, ఊర్వశీ రటేలా, విజయ్ వర్మ తమ ఉనికిని చాటుకొన్నారు.
తాజాగా కాన్స్ వేదికపై యువ నటి డయానా పెంటీ విచిత్ర వేషాధారణతో తన అందాలు ప్రదర్శించేందుకు ప్రయత్నించింది. అయితే ఆమె ధరించిన డ్రస్సులపై నెటిజన్లు చేసిన ట్రోలింగ్ ఎలా ఉందంటే?

డయానా పెంటీ విషయానికి వస్తే.. మోడల్‌గా వినోద పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 2012లో సైఫ్ ఆలీ ఖాన్, దీపిక పదుకోన్‌తో కలిసి కాక్ టెయిల్ సినిమాలో నటించింది. ఆ తర్వాత లక్నో సెంట్రల్, షిద్దత్, సెల్యూట్ చిత్రాల్లో నటించింది. తాజాగా అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీతో కలిసి మలయాళ చిత్రం డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా రూపొందిన సెల్ఫీ అనే రీమేక్‌లో నటించింది.
అయితే కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో తనదైన శైలిలో ప్రపంచ మీడియాను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. బ్లాక్ డ్రస్సులో వీపు వెనుక భాగం కనిపించేలా చాలా సెక్సీగా కనిపించింది. ఓ రకమైన స్టోన్స్ పొదిగిన టుక్సిడోను ధరించి ఫ్రెంచ్ రివీరాపై తన అందాలను ప్రదర్శించింది. అయితే ఆమె ధరించిన డ్రస్సుపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు.
కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో భారతీయ హీరోయిన్లు ధరిస్తున్న డ్రస్సులపై నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. తాజాగా డయానా పెంటీ నెటిజన్ల ట్రోలింగ్‌కు బలైపోయింది. హిందీ సినిమా పరిశ్రమకు గౌరవం ఉంది. దాన్ని కొంచెం కాపాడండి. బాలీవుడ్ ప్రతిష్టను భ్రష్టుపట్టించకండి అంటూ నెటిజన్లు డయానా పెంటిని ఉద్దేశించి కామెంట్ చేస్తున్నారు.
డయానా పెంటీ కెరీర్ విషయానికి వస్తే.. స్టార్ హీరోలతో జతకట్టినా..భారీ సక్సెస్ మాత్రం ఈ ముద్దుగుమ్మ ఖాతాలో పడలేదు. అయితే దశాబ్ద కాలం దాటినా ఇంకా మంచి గుర్తింపు కోసం బాలీవుడ్‌లో ప్రయత్నిసున్నది. తాజాగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో వోడ్కా కంపెనీ తరఫునల రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టింది.


Click it and Unblock the Notifications











