ఆ పెళ్లికి ముఖం చాటేసి.. అంబానీ ఇంట్లో పెళ్లికి వచ్చావా? ప్రియాంక చోప్రాను చీల్చి చెండాడుతున్న నెటిజన్లు

By Lekhaka

బాలీవుడ్ దేశి గర్ల్ ప్రియాంక చోప్రాపై తాజాగా సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. అక్క పెళ్లికి దిక్కులేదు గాని అంబానీ పెళ్లి మాత్రం దిగొచ్చింది అంటూ మండిపడుతున్నారు నెటిజెన్లు. మరి ఇంతకీ ప్రియాంక చోప్రా చేసిన తప్పేంటి? ఆమెను ఎందుకు నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల పెళ్లి ఈరోజే. ఈ వేడుక గురించి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆకాశమంత పందిరి, భూదేవంత పీఠం వేసి, వందేళ్ల తరువాత కూడా మరచిపోలేని విధంగా తన తనయుడి పెళ్లిని జరిపిస్తున్నారు అంబానీ. ఈ వేడుక కోసం ఆయన వేల కోట్లను నీళ్లలా కుమ్మరిస్తున్నారు.

Netizens Trolling on Priyanka Chopra and Nick jonas due to attending Anant Ambani wedding

అలాగే అనంత్ రాధికల వివాహానికి ప్రపంచం వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖ రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు. అందులో భాగంగానే ప్రియాంక చోప్రా కూడా తన భర్తతో కలిసి అనంత్ రాధికల పెళ్లి కోసం విదేశాల నుంచి ఇండియాకు తిరిగి వచ్చింది. అయితే ఆమె అలా దిగిందో లేదో ఇలా నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికో ప్రత్యేకమైన కారణం ఉంది.

అదేంటంటే పరిణితి చోప్రా. ఈ బ్యూటీ కారణంగానే ప్రియాంక చోప్రాను ఏకి పారేస్తున్నారు నెటిజన్లు. అసలు ఏం జరిగిందంటే... గతేడాది సెప్టెంబర్ లో ప్రియాంక కజిన్ పరిణీతి చోప్రా వివాహం రాఘవ్ చద్దాతో జరిగింది. అయితే తన సోదరి ప్రియాంక చోప్రా పెళ్ళిలో ఎక్కడా కన్పించకపోవడం అందరినీ షాక్ కు గురి చేసింది. దీంతో వరుసకు అక్కచెల్లెళ్లయిన పరిణితి, ప్రియాంక మధ్య గొడవ జరిగిందా అనే చర్చలు నడిచాయి.

Netizens Trolling on Priyanka Chopra and Nick jonas due to attending Anant Ambani wedding

అయితే పెళ్లి జరిగాక ప్రియాంక సోషల్ మీడియా ద్వారా పరిణితికి శుభాకాంక్షలు తెలియజేసి ఆశ్చర్యపరిచింది. దీంతో ఆమె వేరే ఏదో కారణంతో పరిణితి పెళ్ళికి హాజరుకాలేదేమో అని సరిపెట్టుకున్నారు. దీంతో ఆ వివాదం సద్దుమణిగింది. కానీ తాజాగా అంబానీ పెళ్లిలో ప్రియాంక చోప్రా భర్తతో కలిసి ప్రత్యక్షం అవ్వడాన్ని పలువురు మూవీ లవర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. పరిణీతి చోప్రా పెళ్లికి టైం లేదు గానీ ఇప్పుడు అంబానీ పెళ్లికి మాత్రం టైం నడుచుకుంటూ వచ్చేసింది అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రియాంక చోప్రా దంపతులపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

కాగా అనంత్, రాధికల పెళ్లిలో ప్రియాంక పసుపు రంగు లెహంగా ధరించి అందంగా కనిపించింది. ఇక నిక్ జోనాస్ పింక్ సూట్, పైజామా ధరించి మరింత హ్యాండ్సమ్ గా తయారయ్యారు. అలాగే అనంత్ పెళ్లి వేడుకలో ప్రియాంక సంతోషంగా డాన్స్ చేస్తూ కనిపించింది. ఆమె డాన్స్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా గత ఆరు నెలల నుంచి జరుగుతున్న ఆనంద్ రాధికల వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మరో మూడు రోజుల్లో పూర్తి కాబోతున్నాయి. మరోవైపు ప్రియాంక చోప్రా ప్రస్తుతం పలు హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X