Nidhhi Agerwal: శివాజీ సామాన్లు కామెంట్‌కు కౌంటరా? నిధి అగర్వాల్ గ్లామర్ షోపై నెటిజన్లు ఘాటుగా!
దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆడవాళ్ల అందం నిండైన వస్త్రధారణలోనే ఉంటుంది తప్ప.. సామాన్లు చూపించే బట్టల్లో ఉండదని శివాజీ వ్యాఖ్యానించారు. దీనిపై సినీరంగానికి చెందిన నటీనటులతో పాటు సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో శివాజీ తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. నేను చెప్పాలనుకున్న ఉద్దేశం కరెక్టేనని, కాకపోతే రెండు పదాలు తప్పుగా దొర్లాయని శివాజీ తెలిపారు.
శివాజీ క్షమాపణలతో వివాదం అక్కడితో ముగిసిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ మర్నాడు ప్రెస్‌మీట్ పెట్టి.. ఈ వ్యవహారంతో ఏమాత్రం సంబంధం లేదని అనసూయ మధ్యలో ఎందుకు వచ్చినట్లు అని శివాజీ ఘాటుగా ప్రశ్నించారు. తాను ఆ వ్యాఖ్యలు చేయడానికి కారణం ది రాజాసాబ్ ఈవెంట్ అని తెలిపారు. హైదరాబాద్‌లోని ఓ మాల్‌లో జరిగిన ది రాజాసాబ్ ఈవెంట్ ముగించుకుని తిరిగి వెళ్తున్న హీరోయిన్ నిధి అగర్వాల్‌ను అభిమానులు చుట్టేశారు. ఇదే సమయంలో కొందరు ఆకతాయిలు ఆమెను అసభ్యంగా తాకారు. నిధి అగర్వాల్ వేసుకొచ్చిన డ్రెస్ వల్ల అలా జరిగిందని... బహిరంగ వేదికలపైకి సెలబ్రిటీలు వచ్చేటప్పుడు మంచి బట్టలు వేసుకోవాలని చెప్పడమే తన ఉద్దేశ్యమని శివాజీ తెలిపారు.

దాంతో ఈ సీన్‌లోకి యాంకర్ అనసూయ వచ్చింది. తప్పు మగాళ్ల చూపుల్లో, చేతల్లో ఉందని.. మాకు మంచి బట్టలు వేసుకోమని చెబుతున్న శివాజీ గారు.. ఆడపిల్ల మీదకు ఆంబోతుల్లా పడటం ఏంటని ఎందుకు చెప్పారంటూ అనసూయ ఘాటుగా స్పందించింది. దాంతో వివాదం ట్రాక్ తప్పి ఎక్కడెక్కడో తిరిగింది. మధ్యలో అన్వేష్ లాంటి ఇన్‌ఫ్లూయెన్సర్లు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇండస్ట్రీతో పాటు నెటిజన్లు కూడా రెండుగా ఛీలిపోయి శివాజీకి, అనసూయకి మద్ధతు పలికారు. ఈ క్రమంలో హీరోయిన్ నిధి అగర్వాల్ స్పందించారు.
ఈ వివాదంలో తనను ఉదాహరణగా ప్రస్తావిచడంపై నిధి అగర్వాల్ నిప్పులు చెరిగారు. శివాజీ వ్యాఖ్యలు బాధితురాలిదే తప్పని నిందించేలా ఉన్నాయి.. ఇది అత్యంత దారుణం. జరిగిన సంఘటనకు మహిళను బాధ్యురాలిని చేయడం ఓ మానిప్యులేషన్. ఇలాంటి ఆలోచనా ధోరణి మారాలి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దాంతో నెటిజన్లు, పలువురు నటీనటులు నిధి అగర్వాల్‌కు మద్ధతు పలికారు. ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలలోనూ మహిళల వస్త్రధారణపై కీలక వ్యాఖ్యలు చేశారు నిధి.
తాజాగా ఫిలింఫేర్ అవార్డ్స్ - సౌత్‌లో ఈ ముద్దుగుమ్మ తన చేతలతో కలకలం రేపారు.
ఫిలింఫేర్ అవార్డ్స్ కోసం నిధి.. ఓ వైట్ కలర్ లాంగ్ గౌనును వేసుకొచ్చి సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. అయితే ఈ డ్రెస్ చాలా పొడవుగా ఉండటంతో నడవటానికి చాలా ఇబ్బంది పడింది. వేదిక వద్దకు చేరుకునే వరకు ఆమె అసిస్టెంట్ డ్రెస్ వెనుక భాగాన్ని చేతులతో పట్టుకుని నిధి వెనుకే నడుచుకుంటూ వచ్చాడు. అలాగే ఫోటోషూట్ సమయంలోనూ డ్రెస్‌ను ఆ కుర్రాడు సర్దుతూనే ఉన్నాడు. ఎద భాగం, తోడలు కనిపించే విధంగా ఉన్న ఈ డ్రెస్‌లో ఆమె అందాలన్నీ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. శివాజీ గతంలో చేసిన సామాన్ల వ్యాఖ్యలకు పరోక్షంగా ఇలాంటి డ్రెస్‌తో నిధి కౌంటర్ ఇచ్చారా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియా ట్రెండ్స్‌ను బట్టి చూస్తే నిధి అగర్వాల్ డ్రెస్ వ్యవహారం వివాదానికి దారితీసేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











