Oscars for RRR అల్లు అర్జున్ ట్వీట్.. నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్
ఆస్కార్ అవార్డుల వేదికపై RRR చిత్రం సత్తా చాటడంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు గుప్పిస్తున్నారు. నాటు నాటు పాటకు అవార్డు రావడంతో భారతీయులందరూ గర్విస్తూ తమ వంతుగా సోషల్ మీడియాలో ట్వీట్లు, పోస్టులతో ప్రశంసల వర్షం గుప్పించారు. చిరంజీవి, మహేష్ బాబు, రవితేజ లాంటి స్టార్ హీరోలు.. అలాగే ఇతర సినీ ప్రముఖులు తమ అభినందనలు తెలిపారు. అయితే ఒక రోజు ఆలస్యంగా అల్లు అర్జున్ ట్వీట్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

భారతీయులందరిని ఒక్కటి చేసిన RRR
RRR చిత్రం భారత్ దేశాన్ని, భారతీయులందర్ని మరోసారి ఒక్కటి చేసింది. తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కడంతో అందరూ ఆనందంలో మునిగిపోయారు. కులం, మతాలు, ప్రాంతాలకు అతీతంగా సినిమా యూనిట్‌పై ప్రశంసలు గుప్పించారు. రకరకాల మాధ్యమాల ద్వారా తమ అభినందనలను తెలిపారు. తాజాగా అల్లు అర్జున్ ట్వీట్ ఇలా ఉంది..
తెలుగు పాట షేక్ అంటూ
ఇండియాకు మరిచిపోలేని అనుభూతి. ఆస్కార్ అవార్డుల్లో తెలుగు పాట షేక్ చేసిన తీరు నాకు ఆనందం కలిగించింది. నాటు నాటు పాటలో భాగమైన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారు.. గేయ రచయిత చంద్రబోస్ గారు.. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గారు, నా సోదరులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నేను అమితంగా ప్రేమించే గ్లోబల్ స్టార్స్, నా ప్రియాతి ప్రియమైన రాంచరణ్‌కు కంగ్రాట్స్ అంటూ అల్లు అర్జున్ తన మొదటి ట్వీట్ చేశారు.
జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి గురించి
అల్లు అర్జున్ మొదటి ట్వీట్‌కు కొనసాగింపుగా రెండో ట్వీట్ పెట్టి.. స్టెప్పులతో తన డ్యాన్స్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన మా తెలుగు ప్రైడ్ తారక్, నాటు నాటు పాటను మ్యాజిక్ చేయడంలో మూల కారకుడు ఎస్ఎస్ రాజమౌళి ధన్యవాదాలు. RRR ఇండియాకు గర్వకారణంగా నిలిచింది అంటూ అల్లు అర్జున్ రెండో ట్వీట్‌లో పేర్కొన్నారు.

24 గంటల తర్వాత ట్వీట్ అంటూ
అయితే RRR చిత్రానికి ఆస్కార్ అవార్డు సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో వచ్చింది. అయితే నాటు నాటు పాటకు అవార్డు రాగానే.. ఇండియాలోని సినీ ప్రముఖులు వెంటనే ట్వీట్ చేసి అభినందనలు..ప్రశంసలు గుప్పించారు. అయితే ఆస్కార్ అవార్డు వచ్చిన 24 గంటల తర్వాత అల్లు అర్జున్ ట్వీట్ చేసి అభినందించడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ సపోర్టుగా
అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం బన్నీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రాంచరణ్‌ను గ్లోబల్ స్టార్ అంటూ.. అలాగే ఎన్టీఆర్‌ను తెలుగు ప్రైడ్ అంటూ ప్రశంసించడంపై ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అయితే లేటుగా ట్వీట్ వేయడంపై ఫ్యాన్స్ స్పందిస్తూ.. గుంపులో గోవిందయ్యలా కాకుండా అందరి అటెన్షన్ పొందేందుకు లేటుగా ట్వీట్ వేశారు అంటూ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.


Click it and Unblock the Notifications











