పొట్టి స్కర్ట్‌లో రోజా హాట్ హాట్‌గా.. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్!
తెలుగు సినిమాకి చెందిన అలనాటి కొందరు హీరోయిన్స్ లో ఇప్పటికీ కొందరు సర్వైవ్ అవుతున్నారు. అయితే సినిమాలోనో లేకపోతే బుల్లి తెర మీద కొన్ని షోస్ తోనో లేక రాజకీయాల్లోకి వెళ్లిపోయో ఇలా కొందరు మాత్రం ప్రస్తుత ట్రెండ్ లో అలా ఎప్పటికప్పుడు వినిపిస్తూ ఉంటారు. కాగా ఇలా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యినటువంటి ఓ సీనియర్ నటి పై సోషల్ మీడియాలో గట్టిగా ట్రోల్స్ పడుతున్నాయి. మరి ఆ నటి ఎవరో కూడా కాదు ప్రముఖ నటి రోజా సెల్వమణినే..
రోజా సినిమాలు పక్కన పెడితే సెకండ్ ఇన్నింగ్స్ లో పలు టెలివిజన్ షోస్ చేసి మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చింది. అయితే రోజా తన సినిమా కెరీర్ లో అప్పట్లో క్రేజీ స్కిన్ షో చేయడం ఇంకా తనపై వేరే రకమైన కామెంట్స్ కూడా ఉన్నాయి. మరి అన్ని చేసిన రోజా రాజకీయాల్లోకి వెళ్లి అక్కడా కొన్ని ఎదురు దెబ్బలు తిని మళ్ళీ అక్కడ గెలిచింది. కానీ ఇక్కడ గెలిచిన తర్వాత రోజా చేసిన కొన్ని చేష్టలు కామెంట్స్ వంటివి మాత్రం చాలా కాంట్రవర్సీలకి దారి తీసింది.

దీనితో రోజాపై చాలా నెగిటివ్ వచ్చేసింది. దీనితో రోజా చేసిన ఏ పని అయినా కూడా చర్చకి దారి తీస్తుండగా తాజాగా ఆమె కొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారి ట్రోల్స్ కి గురవుతుంది. మరి 51 ఏళ్ల రోజా తాజాగా ఒక పొట్టి స్కర్ట్ లో దర్శనం ఇచ్చింది. దీనితో పిక్స్ కొన్ని వీడియో విజువల్స్ వైరల్ గా మారాయి. ఈ ఏజ్ లో కూడా ఇలాంటి డ్రెస్సింగ్ లు వేసుకొని రాజా గతంలో పలు సూక్తులు చెప్పింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
రోజా పాత వీడియోలు కొన్ని తవ్వి తెలుగు ఆడవారు అంటే ఇలానే ఉండాలి నిండుగా చీర కట్టుకోవాలి చుడీదార్స్ లాంటివి వేసుకోకూడదు అంటూ చిలుక పలుకులు రోజా పలుకగా ఇప్పుడు ఈమె స్కర్ట్స్ లాంటివి వేసుకొని బయట కనిపించడంతో ఇక నెటిజన్స్ ఆ పాత వీడియోలు తీసి రోజాపై ట్రోల్స్ చేస్తున్నారు. అప్పట్లో అన్ని నీతులు చెప్పి ఇప్పుడు మీరేం చేస్తున్నట్టు అని ప్రశ్నిస్తున్నారు.

ఇలా రోజాపై అయితే సోషల్ మీడియాలో గట్టిగానే ఇపుడు పలువురు ఏకేస్తున్నారు. కాగా ప్రస్తుతం రోజా అయితే రాజకీయాలకి దూరంగానే ఉంటుండగా ప్రస్తుతం తెలుగు సహా తమిళ్ లో కూడా అవకాశాల కోసం ఎదురు చూస్తుందట. మొదట తెలుగు స్మాల్ స్క్రీన్ దగ్గరే ట్రై చేసింది కానీ తెలుగులో ఆఫర్స్ ఇవ్వం అనేసరికి తమిళ్ లో ట్రై చేస్తున్నట్టుగా పలు ఊహ్హాగానాలు వచ్చాయి. కానీ అక్కడ కూడా ఎలాంటి అవకాశాలు ఎవరూ ఇవ్వడం లేదని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి మళ్ళీ రోజా కోరుకుంటున్న కం బ్యాక్ కానీ అవకాశాలు కానీ వస్తాయో లేదో అనేది చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











