నువ్వు వర్జిన్‌వేనా అంటూ పునర్నవికి ప్రశ్న: డేటింగ్ చేస్తున్నా.. దానికోసమే వెయిట్ చేస్తున్నా అంటూ!

తొలినాళ్లలో తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ వాళ్లే బాగా సందడి చేసేవాళ్లు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం వేరే రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలే టాలీవుడ్‌లో హీరోయిన్లుగా చాలామణీ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొంత మంది తెలుగు భామలు అవకాశాలను దక్కించుకుని సత్తా చాటారు. అలాంటి వారిలో ఫైర్ బ్రాండ్ పునర్నవి భూపాలం ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ఎంటరైన ఈ భామ.. తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును అందుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ షో పుణ్యమా అని మరింత పాపులర్ అయింది. ఇక, ఈ మధ్య ఫారెన్‌లో సందడి చేస్తోన్న పునర్నవి.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమెకు నెటిజన్లు షాక్ ఇచ్చారు. ఆ వివరాలేంటో మీరే చూడండి!

అలా వచ్చి... ఇలా పాపులారిటీ

అలా వచ్చి... ఇలా పాపులారిటీ

తెలుగు పిల్ల పునర్నవి భూపాలం 'ఉయ్యాల జంపాల' అనే సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో కనిపించి మెప్పించిన ఆమె.. ఆ తర్వాత 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'పిట్టగోడ', 'మనసుకు నచ్చింది', 'ఈ సినిమా సూపర్ హిట్', 'ఎందుకో ఏమో' సహా ఎన్నో చిత్రాల్లో నటించి ఫుల్ పాపులర్ అయిపోయింది.

బిగ్ బాస్ వల్ల మరింత ఫేమస్

బిగ్ బాస్ వల్ల మరింత ఫేమస్

చాలా సినిమాల్లో నటించినా పునర్నవికి అనుకున్న రీతిలో గుర్తింపు మాత్రం దక్కలేదనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈమె బిగ్ బాస్ మూడో సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. హౌస్‌లోకి వెళ్లిన కొత్తలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన ఆమె.. ఆ తర్వాత తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలిచేది. ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఈ భామ తర్వాత ఫేమస్ అయింది.

రాహుల్‌తో ట్రాక్ వల్ల హైలైట్

రాహుల్‌తో ట్రాక్ వల్ల హైలైట్

బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు రాహుల్ సిప్లీగంజ్‌తో కలిసి పునర్నవి భూపాలం చేసిన రచ్చ గురించి తెలిసిందే. వీళ్లిద్దరూ ప్రేమికుల్లా వ్యవహరిస్తూ ప్రేక్షకుల్లో ఎన్నో సందేహాలను క్రియేట్ చేశారు. అదే సమయంలో రొమాన్స్‌తోనూ రచ్చ చేశారు. దీంతో వీళ్లిద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతుందని ప్రచారం జరిగింది.

ఎంగేజ్‌మెంట్.. ఫారెన్‌కు వెళ్లి

ఎంగేజ్‌మెంట్.. ఫారెన్‌కు వెళ్లి

బిగ్ బాస్ తర్వాత కూడా పునర్నవికి పెద్దగా ఆఫర్లు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె రఘునందన్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నానని చెబుతూ ఆమె సోషల్ మీడియాలో ఓ ఫొటోను వదిలింది. ఆ తర్వాత ఈ పిక్ ఆహా రూపొందించిన 'కమిట్ మెంటల్' అనే వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసమని వెల్లడించింది. ఇక, ఇప్పుడీ బ్యూటీ స్టడీ కోసం ఫారెన్‌లో ఉంటూ తెగ సందడి చేసేస్తోంది.

సోషల్ మీడియాలో సందడిగా

సోషల్ మీడియాలో సందడిగా

పునర్నవి భూపాలం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తోంది. అంతేకాదు, తన వ్యక్తిగత కెరీర్ సంబంధిత విషయాలను పంచుకుంటోంది. దీంతో పునర్నవిని ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగా పెరిగింది. అప్పుడప్పుడూ ఈ అమ్మడు అందాలను ఆరబోసే ఫొటోలను కూడా షేర్ చేస్తూ రెచ్చిపోతోంది.

కన్యవేనా.. డేట్ చేస్తున్నావా?

కన్యవేనా.. డేట్ చేస్తున్నావా?

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే పునర్నవి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌ను నిర్వహించింది. ఇందులో తన ఫాలోవర్లు అడిగిన ఎన్నో అడ్డదిడ్డమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలోనే ఓ ఔత్సాహిక నెటిజన్ 'నువ్వు వర్జిన్ (కన్య) వేనా' అని, మరో నెటిజన్ 'ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నావా' అని ప్రశ్నించారు.

తడబడకుండా సమాధానం

తడబడకుండా సమాధానం

సదరు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు పునర్నవి ఏమాత్రం కోప్పడకుండానే సమాధానం చెప్పంది. కన్యవేనా అంటూ అతడు అడగ్గానే 'ఇలాంటి ప్రశ్న కోసమే ఎదురు చూస్తున్నా' అంటూ సమాధానం చెప్పింది. అలాగే, డేటింగ్ గురించి అడిగిన ప్రశ్నకు 'అవును ఆమె' అని షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X