ప్రేమకథల్లోనే కిక్ దొరుకుతుంది - అథితి రావ్
సమ్మోహనం సినిమా దగ్గర నుంచీ తెలుగు వారిని సమ్మోహితలను చేస్తూనే ఉన్న అథితి రావ్ హైదరీ, ఇటీవలే వీ లోనూ అందచందాలలోనూ, అభినయంతోనూ ఆకట్టుకుంది. సినిమాపై జనాల్లో భిన్న అభిప్రాయాలు నెలకొన్నప్పటికీ, అమ్మడి పాత్ర అందరినీ ఆకట్టుకుంది. నానీకకి జోడీగా నటించిన అథితి స్క్రీన్ పై కనిపించింది కాసేపే అయినా సినిమాకు అదే ప్లస్ పాయింట్ అయింది.
ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన అథితి తన మనసులోని మాటలను పంచుకుంది. వీ ఓ డార్క్ థ్రిల్లర్ సినిమానే అయినప్పటికీ, ఇందులో రెండు ప్రేమకథలు ఉన్నాయని చెప్పింది. కాబట్టి, తనకు రెండు భిన్నమైన జానర్లకు చెందిన సినిమాలో నటించే అవకాశం లభించిందని తెలిపింది. అయితే, తాను ఎప్పుడు ప్రేమకథలకు మాత్రమే పెద్ద పీటవేస్తానని తేల్చేసింది.

ఛాలెంజింగ్ రోల్స్ కూడా చేస్తానని చెబుతున్న అథితి, ప్రేమ కథల్లో మాత్రమే తనకు పూర్తి సంతృప్తి లభిస్తుందని వెల్లడించింది. వీ లో తన పాత్ర సాహేబా కథలో కీలకమైన మలుపుకు ప్రధాన కారణమవుతున్నందుకే ఈ సినిమాను అంగీకరించానని తెలిపింది. స్క్రీన్ టైమ్, జానర్ల గురించి పక్కన పెడితే ప్రతి పాత్రతోనూ ప్రేక్షకుల జ్ఞాపకాల్లో మిగిపోవడమే తన లక్ష్యమని పేర్కొంది.


Click it and Unblock the Notifications











